జిహాదీ జాక్ దొరికిపోయాడు
‘నేను మా అమ్మను చూడాలని అనుకుంటున్నాను. ఆమెకు కొన్ని విషయాలు వివరించాలి’ అని కుర్దీష్‌లకు పట్టుబడిన తర్వాత చెప్పాడంట. బ్రిటన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్న జిహాదీ జాక్ 2014లో సిరియా వెళ్లడమే కాకుండా ఓ ఇరాకీ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అతడికి మహ్మద్ అనే కుమారుడు కూడా ఉన్నట్లు అధికారులు గతంలోనే తెలుసుకున్నారు.
ఐసిస్‌లో చేరడానికి ముందు జాక్‌గా ఉన్న తన పేరును అబూ మహ్మద్ అని మార్చుకున్నాడు. సిరియాలో ఉన్న సమయంలో పలు రకాల ఆయుధాలు ధరించి వీడియోల్లో చూపిస్తూ జిహాదీ జాన్ మాదిరిగా తానిప్పుడు పనిచేస్తున్నానంటూ వీడియోలో పోస్ట్ కూడా చేశాడు. ఐసిస్‌లో అత్యంత క్రూరంగా బందీల పీకలు కోసే ఓ ముసుగు వ్యక్తి జిహాదీ జాన్. అతడి స్థానంలోనే తాను పనిచేస్తున్నానంటూ జాక్ పోస్టింగ్‌లు చేసినా ఐసిస్ నుంచి మాత్రం ఎలాంటి నిర్ధారణ రాలేదు. అయితే, ఐసిస్‌లో ఉండే పనిచేస్తున్నాడని మాత్రం ధ్రువీకరించారు.