తాత్కాలిక మార్చురీలో ఉంచిన శవాలు
న్యూయార్క్ : కరోనా మహమ్మారి బారిన పడి అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. న్యూయార్క్ నగరంలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. చికిత్స పొందుతున్న బాధితులతో.. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసులతో.. రోగుల మరణాలతో అక్కడి ఆసుపత్రుల్లోని పరిస్థితులు భీతావహంగా మారాయి. న్యూయార్క్ సిటీ, బుష్‌విక్‌లోని వైకాఫ్ హైట్స్ మెడికల్ సెంటర్‌లో గత నెల 14న మొదటి కరోనా వైరస్ మరణం నమోదు కాగా, ఇప్పటివరకు నగర వ్యాప్తంగా 2,400 మంది మృత్యువాత పడ్డారు. అక్కడి ఆసుపత్రుల్లో ఎక్కడ చూసినా ఆరెంజ్, తెలుపు రంగు సంచుల్లో ఉంచిన శవాలు దర్శనమిస్తున్నాయి. ( కోవిడ్–19పై సహకరించుకుందాం )
ఆసుపత్రి కారిడార్‌లో, ఆవరణలో ఉన్న శవాలు
మరణించిన వారిని ఉంచటం కోసం ఉన్న మార్చురీలు చాలక తాత్కాలిక, మొబైల్ మార్చురీలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది కూడా దినదినగండంగా గడుపుతున్నారు. కాగా, అమెరికాలో ఇప్పటివరకు 3లక్షల 36 వేల కేసులు నమోదు కాగా.. దాదాపు 10వేల మంది మృత్యువాత పడ్డారు. (మృతుల సంఖ్యను ఊహించలేం: ట్రంప్)
Comments
Please login to add a commentAdd a comment