రోజుకో యాపిల్ తింటే వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. అలాగే రోజుకో టొమాటో మాత్రను వేసుకుంటే గుండెజబ్బు ముప్పు కూడా తగ్గుతుందంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు. రక్తనాళాల పనితీరును, రక్తప్రసరణను మెరుగుపర్చేందుకు తోడ్పడే టొమాటో మాత్రను తాము తయారు చేశామని వారు వెల్లడించారు.
పరిశోధనలో భాగంగా 36 మంది సాధారణ ఆరోగ్యవంతులు, 36 మంది గుండెజబ్బు రోగులకు ఈ మాత్రను, నకిలీ మాత్రను ఇచ్చి పరీక్షించగా టొమాటో మాత్ర తీసుకున్న వారిలో మాత్రమే సానుకూల ఫలితాలు వచ్చాయని వారు తెలిపారు. టొమాటోకు రంగును ఇచ్చే లైకోపీన్ అనే వర్ణద్రవ్యంతో ఈ మాత్రను తయారు చేశామని, ఇది రక్తనాళాలు ఇరుకుగా మారకుండా చేయడంతోపాటు ముంజేతిలో రక్తప్రసరణను మెరుగుపర్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే టొమాటో మాత్ర ఒక్కటే గుండెజబ్బుకు పూర్తిస్థాయి ఔషధం కాదని, అది కొంత మెరుగైన ఫలితాలు వచ్చేందుకు తోడ్పడుతుందన్నారు.
గుండెజబ్బు నివారణకు టొమాటో మాత్ర!
Published Wed, Jun 11 2014 12:40 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
Advertisement