పిల్లి ఆమెను కరిచింది.. ఆమె అతడిని కరిచింది! | Cat bites woman, woman bites boyfriend | Sakshi
Sakshi News home page

పిల్లి ఆమెను కరిచింది.. ఆమె అతడిని కరిచింది!

Published Mon, Jun 22 2015 4:12 AM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM

పిల్లి ఆమెను కరిచింది.. ఆమె అతడిని కరిచింది! - Sakshi

పిల్లి ఆమెను కరిచింది.. ఆమె అతడిని కరిచింది!

బెర్లిన్: గడుసైన ఓ పెంపుడు పిల్లి ఓ మహిళను కరిచింది. కోపగించుకున్న ఆమె దానికి రెండు దెబ్బలేసి దారిలో పెట్టాలని ప్రయత్నించింది. కానీ ఆ పిల్లి యజమాని అయిన ఆమె బోయ్‌ఫ్రెండ్ అడ్డుకున్నాడు. దీంతో మరింత కోపంతో ఊగిపోయిన ఆమె ఏకంగా బోయ్‌ఫ్రెండ్ మీద పడి మళ్లీ మళ్లీ కసితీరా కరిచేసింది.
వెంటపడి మరీ అతడిని చితక్కొట్టింది! విచిత్రమైన ఈ సంఘటన శనివారం జర్మనీలోని హెగెన్ నగరంలో చోటు చేసుకుంది.

బాధితుడు(39) ఫోన్ చేయడానికి ప్రయత్నించినా సదరు మహిళ(26) అతడిని విడిచిపెట్టలేదని, చివరకు అతడు పారిపోయి తమకు సమాచారమిచ్చాడని పోలీసులు తెలిపారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించామని, ఆమెపై గృహహింస చట్టం కింద కేసు పెట్టడంతో పాటు పది రోజులు గృహ నిర్బంధంలో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement