సింగర్ హత్యపై సెలబ్రిటీల దిగ్భ్రాంతి | Celebrities mourn 'The Voice' singer Christina Grimmie's death | Sakshi
Sakshi News home page

సింగర్ హత్యపై సెలబ్రిటీల దిగ్భ్రాంతి

Published Sun, Jun 12 2016 3:10 PM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM

క్రిస్టినా గ్రిమ్మీ(ఫైల్) - Sakshi

క్రిస్టినా గ్రిమ్మీ(ఫైల్)

ఫ్లోరిడా: ప్రముఖ సింగర్, 'ది వాయిస్' స్టార్ క్రిస్టినా గ్రిమ్మీ(22) మరణంపై హాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బ్లేక్ షెల్టన్, ఆడమ్ లివైన్, సెలెనా గోమెజ్, డెమీ లొటావొ తదితర సెలబ్రిటీలు సంతాపం ప్రకటించారు. ఫ్లోరిడాలోని ఒర్లాండోలో శుక్రవారం 'బి ఫోర్ యు ఎగ్జిట్' ప్రదర్శన ముగిశాక  ప్రేక్షకులకు ఆటోగ్రాఫ్ ఇస్తున్న సమయంలో కెవిన్ జేమ్స్ అనే వ్యక్తి ఆమెపై కాల్పులు జరిపాడు. తర్వాత అతడు కూడా కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

క్రిస్టినా మరణం తననెంతో కలిచివేసిందని గోమెజ్ తెలిపింది. ఆమెను ఎందుకు హత్య చేశారో తెలియదని వెల్లడించింది. క్రిస్టినాకు కన్నీటితో నివాళి అర్పించింది. తన పాటల్లో ఒకటి ఆమెకు అంకితం చేసింది. క్రిస్టినా హత్య గురించి తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని, గుండె పగిలినంతపనైందని బ్లేక్ షెల్టన్ ట్వీట్ చేశాడు. క్రిస్టినా కుటుంబానికి సానుభూతి తెలిపింది. క్రిస్టినా మృతి వార్త వినగానే తన హృదయం గాయపడిందని, ఆమెను హత్య చేయడం దారుణమని లొటావొ ట్వీట్ చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాక్షించింది.

క్రిస్టినా, ఆమె కుటుంబ సభ్యుల కోసం ప్రార్థనలు చేస్తున్నట్టు నిక్ జొనాస్ ట్విటర్ లో పేర్కొన్నాడు. క్రిస్టినా హత్యకు గురికావడం తనను షాక్ కు గురి చేసిందని, తానెంతో ఇష్టపడే ఆమె మరణం కలచివేసిందని ఆడమ్ లివైన్ ట్వీట్ చేశాడు. తనకు మాటలు రావడం లేదని, క్రిస్టినా ఆత్మకు చేకూరాలని సింగర్ టొరీ కెల్లీ కోరుకుంది. సింగర్ చెర్ లయెడ్, మోడల్ హెయిలీ బాల్డ్విన్ తదితరులు కూడా క్రిస్టినా మరణం పట్ల సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement