ఐస్‌క్రీంలకూ శ్మశానవాటిక.. | Cemetery for ice creams | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీంలకూ శ్మశానవాటిక..

Published Sun, Oct 13 2013 12:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

ఐస్‌క్రీంలకూ శ్మశానవాటిక..

ఐస్‌క్రీంలకూ శ్మశానవాటిక..

నిజమే.. బ్రిటన్‌లోని వెర్మాంట్‌లో ఐస్‌క్రీంల కోసం ప్రత్యేకంగా ఓ శ్మశానవాటిక ఉంది. ఈ ఊర్లో బెన్ అండ్ జె ర్రీ ఐస్‌క్రీం చాలా ఫేమస్. ఈ కంపెనీయే వీటి కోసం ఈ శ్మశానవాటికను కట్టించింది. ఐస్‌క్రీంలలో ఎన్నో రుచులు ఉంటాయి.  ఉదాహరణకు చాక్లెట్, వెనీలా వంటివి. కొత్త ఫ్లేవర్స్ వచ్చినప్పుడు పాత ఫ్లేవర్లు తెరమరుగైపోతాయి. ఒక్కోసారి వినియోగదారుల నుంచి డిమాండ్ లేకున్నా.. వాటిని తయారుచేయడం మానేస్తారు.  ఈ లెక్కన సదరు కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 200 ఫ్లేవర్స్ తయారీ పలు కారణాలతో ఆపేశారు. దీంతో ‘చనిపోయిన’ ఆయా రుచుల ఐస్‌క్రీంల గౌరవార్థం ఈ శ్మశానవాటికను కట్టించారు.
 
  ‘నచ్చని’ వంట వడ్డిస్తారు..
 
 ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్తే..మనకు నచ్చిన వంటకాలు వడ్డిస్తారు. కానీ ఈ రెస్టారెంట్లో అమెరికాకు ‘నచ్చని’ దేశాల వంటకాలు మాత్రమే వడ్డిస్తారు! అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో ఉన్న ఈ ‘కాన్‌ఫ్లిక్ట్ కిచెన్’ రెస్టారెంట్లో(పార్శిల్ సర్వీస్) ఆ దేశానికి శత్రుత్వం లేదా ఘర్షణ ఉన్న దేశాల వంటకాలు మాత్రమే తయారవుతాయి. అంటే ఇరాన్, ఉత్తర కొరియా, వెనిజులా వంటివన్నమాట. అంతేకాదు.. ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడంతోపాటు అమెరికాకు ఆ దేశంతో ఉన్న ఘర్షణకు సంబంధించిన చరిత్రనూ వీరు తెలియజేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement