చోంగ్‌క్వింగ్/గుయాంగ్, ఆగ్నేయ చైనా : ఆగ్నేయ చైనాలోని ముఖ్య ప్రాంతాలైన చోంగ్‌క్వింగ్, గుజౌ ప్రావిన్సు రాజధాని గుయాంగ్‌ల మధ్య తొలి బుల్లెట్ రైలును చైనా గురువారం ప్రారంభించింది. దీంతో ఆగ్నేయ చైనాలో ఆ దేశం కీలక ముందడుగు వేసినట్లు అయింది.
గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ సర్వీసు వల్ల చోంగ్‌క్వింగ్, గుయాంగ్‌ల మధ్య ప్రయాణ వ్యవధి పది గంటల నుంచి రెండు గంటలకు తగ్గింది. ఆగ్నేయ చైనాలోని మరో కీలక నగరమైన చెంగ్డూ నుంచి గుయాంగ్ మధ్య కూడా హైస్పీడ్ రైలు సర్వీసును చైనా ఆరంభించింది. ఈ మార్గంలో కేవలం మూడున్నర గంటల్లో చెంగ్డూ నుంచి గుయాంగ్ చేరుకోవచ్చు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ చైనా, ఆగ్నేయ చైనాలను రైలు మార్గంతో కలపాలని చైనా నిర్ణయించింది. అందులో భాగంగా దాదాపు 347 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్వే ట్రాక్‌ను నిర్మించింది. దీంతో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దక్షిణ చైనా నగరాల్లో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు వీలు కలుగుతుంది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు ‘ఫక్సింగ్’ కూడా చైనాదే.
Comments
Please login to add a commentAdd a comment