చైనాలో 5జీ ట్రయల్స్
బీజింగ్: ప్రపంచంలోనే అతిపెద్ద టెలికం మార్కెట్ అయిన చైనా మరో ముందడుగు వేసింది. 5జీ నెట్‌వర్క్ సేవలందించేందుకు ట్రయల్స్ నిర్వహించింది. 100 నగరాల్లో 5జీ పరికరాలను పరిశీలించింది. మొబైల్ డేటా అందించడంలో 4జీ కన్నా 20 రెట్లు వేగంగా 5జీ నెట్‌వర్క్ పనిచేస్తుందని భావిస్తున్నారు.
మల్టిపుల్ యాంటెనా వ్యవస్థతో అనేక మంది వినియోగదారులకు సేవలందిచవచ్చని హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక పేర్కొంది. 5జీతో సెకనుకు 20 జీబీ స్పీడ్‌తో డేటా వాడుకోవచ్చు. ప్రస్తుతం 4జీ సెకనుకు 1జీబీ స్పీడుతో మాత్రమే పనిచేస్తోంది. ఈ 5జీ సేవలు 2020 సంవత్సరానికల్లా అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.