హాంగ్ కాంగ్ : మేన్‌లాండ్ చైనాను టైఫూన్ హడలెత్తిస్తోంది. ఆదివారం అర్ధరాత్రి మొదలైన ఈ తుఫాను వల్ల తీవ్రంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ‘మంగ్‌కూట్’గా పిలుస్తున్న టైఫూన్.. హాంగ్‌కాంగ్, మకావులలో విధ్వంసం సృష్టించింది. 2018లో అతి పెద్ద తుఫానుగా భావిస్తున్న మంగ్‌కూట్ కారణంగా ఉత్తర ఫిలిప్పైన్స్‌లో ఇప్పటికి సుమారు 59 మంది మరణించగా, 300 మంది గాయపడ్డారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చెట్లు, భారీ భవనాలు కుప్పకూలుతున్నాయి. దీంతో టీ10(హై) అలర్టు ప్రకటించారు.
కుప్పకూలిన ఎలివేటర్
మంగ్‌కూట్ ధాటికి నిర్మాణంలో ఉన్న భవనానికి చెందిన ఎలివేటర్ షాఫ్ట్ కుప్పకూలింది. పక్కనే ఉన్న భవనంపై పడటంతో ప్రజలు భయంతో బెంబేలెత్తిపోయారు. కాగా ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ సుమారు 40 మంది ఉన్నారని.. అయితే వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారని ఓ వార్తా సంస్థ తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్నఎలివేటర్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment