బీజింగ్ : కరోనా వైరస్.. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ విలయ తాండవం చేస్తోంది. ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా అందర్ని బాధితులుగా మార్చేస్తూ మానవాళి మనుగడకు పెను సవాలు విసురుతోంది. ఇలాంటి తరుణంలో ఈ మహమ్మారి బారి నుంచి తన కుమారుడిని కాపాడుకునేందుకు ఓ తండ్రి వినూత్న ప్రయత్నం చేశాడు. కరోనా నుంచి రక్షించేందుకు ఓ ప్రత్యేకమైన సూట్‌ను తయారు చేసి తన కొడుకుకు తొడిగాడు. చైనాకు చెందిన కావో జుంజీ అనే వ్యక్తికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కరోనావైరస్ విజృంభించడంతో తన కొడుకును కాపాడుకునేందు ప్రత్యేకమైన సూట్‌ను సృష్టించాడు. వ్యోమగామి ధరించేలా ఉన్న ఆ సూట్‌లో గాలీ శుద్ధీకరణకు ప్రత్యేక పరికరాన్ని అమర్చాడు. అలాగే చల్లటి గాలి తగిలేలా ఒక ఎలక్ట్రానిక్ ఫ్యాన్‌ను కూడా దాంట్లో ఏర్పాటు చేశాడు.
(చదవండి : కరోనా: ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ గెలిచాడు)
ఇక ఎలాంటి మాస్కులు, శానిటైజర్లు వాడకుండా నిర్భయంగా తమ కుమారుడిని బయటకు తీసుకెళ్తున్నామని కావో పేర్కొన్నారు. ఇది మాస్కు కంటే అత్యంత భద్రమైనది అని చెప్పుకొచ్చారు. ‘ చిన్న పిల్లల ముఖానికి మాస్కులు తొడిగితే ఉంచుకోలేరు. చేతులతో ముఖాలను తరచూ తాకుతుంటారు. ఈ సూట్ ధరింపజేస్తే ఇక ఇలాంటి బాధలు ఉండవు. మాస్కులకు ప్రత్యామ్నాయంగా ఈ సూట్‌ను డిజైన్ చేశాను’ అని కావో వివరించారు. కాగా, ఇలాంటి ప్రయోగాలు చేయడం కావోకు కొత్తేమి కాదు. గత నెలలో రూ.21,587 (2000 యువాన్లు)తో ‘ బేబీ సేఫ్టీ పాడ్’ను తయారు చేశారు. ప్రస్తుతం స్పేషల్ సూట్ ధరించిన బుడ్డోడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అచ్చం వ్యోమగామిలా ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, గత ఆదివారం చైనాలో కొత్తగా 108 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఆరు వారాలలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే. ఇక మొత్తంగా 82,160 మందికి కరోనా వైరస్ సోకగా, 3,341మంది మృతి చెందారు.
Dad makes innovative protective suit for his son https://t.co/3XOBcRZDQZ pic.twitter.com/FpGViuvKc7
— Reuters (@Reuters) April 15, 2020
Comments
Please login to add a commentAdd a comment