ఇళ్ల పై కప్పులపై అంతరిక్ష ధూళి
లండన్: ప్రపంచంలోని మూడు అతి పెద్ద నగరాల్లోని ఇళ్ల పైకప్పులపై అంతరిక్ష ధూళి ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని సాయంతో సౌర కుటుంబ పరిణామ క్రమం గురించి తెలుసుకోవచ్చని వారు చెబుతున్నారు. సౌర కుటుంబం పుట్టిన దగ్గర్నుంచీ అందులో ఉన్న గ్రహాలు, ఉపగ్రహాల నుంచి విడిపోయిన చిన్న అణువుల నుంచి అంతరిక్ష ధూళి తయారవుతోంది. ఈ అణువులు ప్రధానంగా 0.01 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటాయి. కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి అవి భూమ్మీద పడుతూనే ఉన్నాయి. అంటార్కిటికా వంటి మంచుతో కూడిన ప్రదేశాల నుంచి చాలా ధూళిని వారు సేకరించారు. కొత్త పరిశోధన కోసం శాస్త్రవేత్తలు పారిస్, ఓస్లో, బెర్లిన్‌లోని ఇళ్ల పైకప్పులపై నుంచి సేకరించిన 300 కేజీల చెత్త నుంచి అంతరిక్ష ధూళిని వేరు చేశారు.