Space dust
-
ఆహా.. భూమ్మీదకు నీరు అలా వచ్చి చేరిందా!!
వెబ్‌డెస్క్: ఈ భూమ్మీద నీటి శాతం 71గా ఉందని చదువుకునే ఉంటారు. ఈ నీటిలో సింహభాగం.. మహా సముద్రాలు, సముద్రాల రూపంలోనే ఉంది. మిగతా భాగం.. ఖండాలు, ద్వీపాలు వగైరా వగైరా ఉన్నాయి. మరి అంత శాతం నీరు ఎలా వచ్చి చేరి ఉంటుందని అనుకుంటున్నారు?.. ఈ విషయంపై ఏళ్ల తరబడి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. ఇది తేల్చేందుకే జపాన్ ఓ స్పేస్ మిషన్‌ను చేపట్టింది. సుమారు ఆరేళ్ల తర్వాత దాని ఫలితం ఆధారంగా.. ఇప్పుడొక ఆసక్తికర ప్రకటన చేసింది. సౌర వ్యవస్థ యొక్క బయటి అంచుల నుండి గ్రహశకలాలు(ఆస్టరాయిడ్స్).. నీటిని భూమ్మీదకు మోసుకొచ్చాయనేది జపాన్ స్పేస్ మిషన్ తేల్చిన విషయం. ఆశ్చర్యంగా అనిపించిన.. వాటి ద్వారానే బిలియన్ల సంవత్సరాల కిందట భూమ్మీద నీరు, సముద్రాలు ఏర్పడ్డాయన్నది ఈ మిషన్ చెబుతోంది. ఈ వాదనకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయన్నది జపాన్ పరిశోధకులు చెప్తున్నమాట. ఈ భూమ్మీద జీవితం మూలాలు, విశ్వం నిర్మాణంపై వెలుగునిచ్చే అంశాల అన్వేషణలో భాగంగా.. 2020లో రైయుగు Ryugu అనే గ్రహశకలం భూమ్మీదకు తీసుకొచ్చిన పదార్థాన్ని పరిశీలించారు. హయబుసా-2 అని పిలిచే జపనీస్ స్పేస్ ప్రోబ్ ద్వారా 5.4 గ్రాముల (0.2 ఔన్సుల) రాళ్ళు, ధూళిని సేకరించారు. భూ జీవనానికి సంబంధించిన కొన్ని బ్లాకులలో అమైనో ఆమ్లాల ఉనికిని గుర్తించామని, అంతరిక్షంలోనే అవి ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తల బృందం ఈ జూన్‌లో ఓ ఆర్టికల్ తమ పరిశోధన వివరాలను వెల్లడించింది. అంతేకాదు.. రైయుగు శాంపిల్స్‌లో కనిపించిన ఆర్గానిక్ మెటీరియల్ వల్లే భూమ్మీద నీటి జాడ ఏర్పడి ఉంటాయన్న వాదనకు బలం చేకూరుతోందని అంటున్నారు. అస్థిర, ఆర్గానిక్మూలాలు అధికంగా ఉన్న సీ-టైప్ గ్రహశకలాలు.. భూమి యొక్క నీటి యొక్క ప్రధాన వనరులలో ఒకటిగా ఉండవచ్చంటూ జపాన్, ఇతర దేశాల సైంటిస్టులు.. జర్నల్ నేచర్ ఆఫ్ ఆస్ట్రోనమీలో అభిప్రాయం వెల్లడించడం.. ఆ జర్నల్ సోమవారం పబ్లిష్ కావడం విశేషం. ఇదీ చదవండి: అంతరిక్ష కేంద్రం నుంచి భారత్‌కు సర్ప్రైజ్ -
Viral Video: భూమిపైకి దూసుకొచ్చిన చైనా రాకెట్ శకలాలు
వాషింగ్టన్: చైనా కొద్ది రోజుల క్రితం ప్రయోగించిన లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్‌కు సంబంధించిన భారీ శకలాలు భూకక్ష్యలోకి ప్రవేశించాయి. రాత్రి వేళ వివిధ రంగుల్లో మిరిమిట్లు గొలుపుతూ రాకెట్ శిథిలాలు భూమివైపు దూసుకొచ్చాయి. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రజలు వీటిని ఉల్కాపాతంగా భావించి వీడియోలు తీశారు. శనివారం రాత్రి హిందూ మహాసముద్రంపై 10.45 గంటల సమయంలో భూవాతావరణంలోకి రాకెట్ శకలాలు ప్రవేశించినట్లు అమెరికా అంతరిక్ష కమాండ్ సైతం నిర్ధరించింది. తూర్పు, దక్షిణాసియాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఈ శకలాలు మండుతూ భూకక్ష్యలోకి రావటాన్ని వీక్షించారు. మలేసియా మీదుగా ఇవి ప్రయాణిస్తోన్న వీడియోను నాసా ఆస్ట్రోనాట్ క్రిస్ హాడ్ఫీల్డ్ ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే.. అందులో ఎన్ని భూమిని తాకి ఉంటాయనేదానిపై సమాచారం లేదు. మరోవైపు.. చైనా స్పేస్ ఏజెన్సీ పనితీరును నాసా ప్రతినిధి బిల్ నిల్సన్ తప్పుపట్టారు. తన రాకెట్ల శిథిలాలు భూవాతావరణంలోకి రాకుండా అడ్డుకోలేకపోతోందని పేర్కొన్నారు. లాంగ్‌మార్చ్ 5బీ వంటి రాకెట్ల శిథిలాలు ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలుగజేసే ప్రమాంద ఉందన్నారు. జులై 24న చైనా ఈ రాకెట్‌ను ప్రయోగించింది. Looks like that Chinese rocket just burned up over Malaysia. Now wait to hear what big pieces splashed/thumped to Earth. https://t.co/SVh2UXVIyG — Chris Hadfield (@Cmdr_Hadfield) July 30, 2022 ఇదీ చదవండి: ల్యాబ్ మాడ్యూల్‌లోకి ప్రవేశించిన చైనా వ్యోమగాములు -
ఇళ్ల పై కప్పులపై అంతరిక్ష ధూళి
లండన్: ప్రపంచంలోని మూడు అతి పెద్ద నగరాల్లోని ఇళ్ల పైకప్పులపై అంతరిక్ష ధూళి ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని సాయంతో సౌర కుటుంబ పరిణామ క్రమం గురించి తెలుసుకోవచ్చని వారు చెబుతున్నారు. సౌర కుటుంబం పుట్టిన దగ్గర్నుంచీ అందులో ఉన్న గ్రహాలు, ఉపగ్రహాల నుంచి విడిపోయిన చిన్న అణువుల నుంచి అంతరిక్ష ధూళి తయారవుతోంది. ఈ అణువులు ప్రధానంగా 0.01 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటాయి. కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి అవి భూమ్మీద పడుతూనే ఉన్నాయి. అంటార్కిటికా వంటి మంచుతో కూడిన ప్రదేశాల నుంచి చాలా ధూళిని వారు సేకరించారు. కొత్త పరిశోధన కోసం శాస్త్రవేత్తలు పారిస్, ఓస్లో, బెర్లిన్‌లోని ఇళ్ల పైకప్పులపై నుంచి సేకరించిన 300 కేజీల చెత్త నుంచి అంతరిక్ష ధూళిని వేరు చేశారు.