అతి పే.....ద్ద రేడియో జెట్‌ | Astronomers reveal largest radio jet ever seen in the early universe | Sakshi
Sakshi News home page

అతి పే.....ద్ద రేడియో జెట్‌

Published Sat, Feb 8 2025 5:33 AM | Last Updated on Sat, Feb 8 2025 5:33 AM

Astronomers reveal largest radio jet ever seen in the early universe

ఇదేమిటో తెలుసా? ఇప్పటిదాకా మనిషి కంటికి చిక్కిన అతి పెద్ద రేడియో జెట్‌.  కాంతివేగంతో దూసుకెళ్లే ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ రేడియేషన్, అంతరిక్ష ధూళితో కూడిన ప్రవాహాలు. క్వాజార్‌గా పిలిచే కృష్ణబిలాల సమూహాలు నుంచి ఇవి పుట్టుకొస్తుంటాయి.  వీటి ఉనికి ఇంత స్పష్టంగా చిక్కడం ఇదే తొలిసారి. ఈ రేడియో జెట్‌ ఏకంగా 2 లక్షల కాంతి సంవత్సరాల పొడవున పరుచుకుని ఉన్నట్టు తేలడం సైంటిస్టులనే విస్మయపరుస్తోంది. 

అంటే పాతపుంత కంటే రెట్టింపు పరిమాణంలో ఉంది! డర్హాంకు చెందిన పరిశోధకుల బృందం ఇంటర్నేషనల్‌ లో ఫ్రీక్వెన్సీ అర్రే (లోఫర్‌) టెలిస్కోప్‌ ద్వారా దీన్ని ఉనికిని కనిపెట్టింది. ఇది విశ్వం ఆవిర్భవించిన తొలినాళ్లలో ఏర్పడ్డ జే1601+3102 అనే క్వాజార్‌ నుంచి పుట్టుకొచ్చిన రేడియో జెట్‌ అని నిర్ధారణయింది. దీని పుట్టుకకు కారణమైన కృష్ణబిలం పరిమాణంలో మరీ పెద్దదేమీ కాకపోవడం సైంటిస్టులను మరింత ఆశ్చ ర్యపరుస్తోంది. అతి భారీ కృష్ణబిలాలు మా త్రమే భారీ రేడియో జెట్లకు జన్మనిస్తాయని భావించేవారు. దీనిద్వారా అతి భారీ కృష్ణబిలాల ఆవిర్భావంపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.     

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement