Durham University scientists
-
అతి పే.....ద్ద రేడియో జెట్
ఇదేమిటో తెలుసా? ఇప్పటిదాకా మనిషి కంటికి చిక్కిన అతి పెద్ద రేడియో జెట్. కాంతివేగంతో దూసుకెళ్లే ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్, అంతరిక్ష ధూళితో కూడిన ప్రవాహాలు. క్వాజార్గా పిలిచే కృష్ణబిలాల సమూహాలు నుంచి ఇవి పుట్టుకొస్తుంటాయి. వీటి ఉనికి ఇంత స్పష్టంగా చిక్కడం ఇదే తొలిసారి. ఈ రేడియో జెట్ ఏకంగా 2 లక్షల కాంతి సంవత్సరాల పొడవున పరుచుకుని ఉన్నట్టు తేలడం సైంటిస్టులనే విస్మయపరుస్తోంది. అంటే పాతపుంత కంటే రెట్టింపు పరిమాణంలో ఉంది! డర్హాంకు చెందిన పరిశోధకుల బృందం ఇంటర్నేషనల్ లో ఫ్రీక్వెన్సీ అర్రే (లోఫర్) టెలిస్కోప్ ద్వారా దీన్ని ఉనికిని కనిపెట్టింది. ఇది విశ్వం ఆవిర్భవించిన తొలినాళ్లలో ఏర్పడ్డ జే1601+3102 అనే క్వాజార్ నుంచి పుట్టుకొచ్చిన రేడియో జెట్ అని నిర్ధారణయింది. దీని పుట్టుకకు కారణమైన కృష్ణబిలం పరిమాణంలో మరీ పెద్దదేమీ కాకపోవడం సైంటిస్టులను మరింత ఆశ్చ ర్యపరుస్తోంది. అతి భారీ కృష్ణబిలాలు మా త్రమే భారీ రేడియో జెట్లకు జన్మనిస్తాయని భావించేవారు. దీనిద్వారా అతి భారీ కృష్ణబిలాల ఆవిర్భావంపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాఫీతో తిక్క... దానికో లెక్క!
పరిపరి శోధన కాఫీ అతిగా తాగితే మతిభ్రమిస్తుందట! అతిగా తాగేవాళ్లకు రకరకాల భ్రమలు ఏర్పడతాయని, ఇలాంటి వాళ్లకు చనిపోయిన సన్నిహితులను తిరిగి చూస్తున్నట్లుగా అనుభూతి కలుగుతుందని బ్రిటిష్ పరిశోధకులు చెబుతున్నారు. మితిమీరి కాఫీతాగే అలవాటు ఉన్న రెండువందల మందిపై విస్తృతంగా అధ్యయనం జరిపి ఈ సంగతిని కనుగొన్నామని బ్రిటన్లోని డర్హామ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజుకు ఏడు కప్పులకు మించి కాఫీ తాగే వారిలో ఇలాంటి భ్రమలు ఎక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని అంటున్నారు. కెఫీన్ మోతాదు మించితే, శరీరంలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుందని, దీనివల్ల ఇలాంటి భ్రమలు కలుగుతాయని వివరిస్తున్నారు.