విదేశాల్లో కంపెనీలు పెడితే 35% పన్ను: ట్రంప్ | Despite the 35% tax on foreign companies: Trump | Sakshi

విదేశాల్లో కంపెనీలు పెడితే 35% పన్ను: ట్రంప్

Dec 5 2016 2:08 AM | Updated on Aug 25 2018 7:50 PM

విదేశాల్లో కంపెనీలు పెడితే 35% పన్ను: ట్రంప్ - Sakshi

విదేశాల్లో కంపెనీలు పెడితే 35% పన్ను: ట్రంప్

ఉద్యోగాలను ఇతర దేశాలకు అవుట్‌సోర్స్ చేస్తున్న, ఇతర దేశాల్లో ఫ్యాక్టరీలను నిర్మిస్తున్న కంపెనీలపై భారీగా 35% వరకు పన్ను భారం వేస్తామని అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికై న డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

 వాషింగ్టన్: ఉద్యోగాలను ఇతర దేశాలకు అవుట్‌సోర్స్ చేస్తున్న, ఇతర దేశాల్లో ఫ్యాక్టరీలను నిర్మిస్తున్న కంపెనీలపై భారీగా 35% వరకు పన్ను భారం వేస్తామని అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికై న డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. భారత ప్రభుత్వం ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’ విధానంలో భాగంగా భారత్‌లో ఉత్పత్తి విభాగాలు నెలకొల్పాలనుకునే అమెరికన్ కంపెనీలపై ఈ నిర్ణయం పెను ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.

విదేశాల్లో విభాగాలు నెలకొల్పాలనుకోవడాన్ని ‘ఖరీదైన నిర్ణయం’గా ట్రంప్ ఆదివారం ట్విటర్‌లో అభివర్ణించారు. ‘ఈ దేశం విడిచి వేరే దేశంలో వ్యాపారాలు చేసుకుంటూ.. అక్కడే ఉద్యోగాలు కల్పించి, అక్కడే ఉత్పత్తులను తయారు చేసి, ఇక్కడ మన అమెరికాలో అమ్మాలనుకోవచ్చు అనుకుంటే.. అది పెద్ద తప్పు. వారిపై 35% వరకు పన్ను విధిస్తాం’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. కాగా, ట్రంప్‌తో  భేటీ అయ్యేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.. వచ్చే నెలలో జరగనున్న ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది.

 ట్రంప్‌కు సీఎన్‌ఎన్ క్షమాపణ
 అమెరికా టెలివిజన్ చానల్ సీఎన్‌ఎన్.. ట్రంప్‌కు క్షమాపణలు చెప్పింది. సీఎన్‌ఎన్ ప్రొడ్యూసర్ ఒకరు ట్రంప్ విమానం కూలిపోరుుందని జోక్ చేశారు. దీనిపై ట్రంప్‌కు క్షమాపణలు చెప్పడంతోపాటు, ప్రొడ్యూసర్‌పై చర్యలు తీసుకున్నామని సీఎన్‌ఎన్ వివరించింది. ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్ సీఎన్‌ఎన్‌ను తీవ్రంగా విమర్శించేవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement