స్మార్ట్‌ఫోన్ = డాక్టర్ | Doctor in your pocket: smartphones become real-time diagnostic tools | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్ = డాక్టర్

Published Wed, Mar 12 2014 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM

Doctor in your pocket: smartphones become real-time diagnostic tools

హ్యూస్టన్: మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఇకపై మీ దగ్గర డాక్టర్ కూడా ఉన్నట్లే... మాట్లాడుకోడానికి, ఫొటోలు తీసుకోడానికే కాదు రోగనిర్ధారణ పరీక్షలు చేసే కొత్త రకం స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా ఇప్పటికే  హ్యూస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేశారు. బాక్టీరియా, వైరస్‌ల వల్ల వ్యాపించే రోగాలను కూడా ఈ కొత్త రకం ఫోన్ గుర్తించగలదు. ఇందుకు సంబంధించి వివిధ పరికరాలను స్మార్ట్‌ఫోన్‌లో అమర్చుతారు. ఇవి జబ్బుపడిన వ్యక్తికి వచ్చిన రోగాన్ని గుర్తించి స్మార్ట్‌ఫోన్‌కు వివరాలు అందిస్తాయి. హ్యూస్టన్ వర్సిటీకి చెందిన   జిమింగ్ బావో, రిచర్డ్ విల్సన్‌లు ఈ కొత్త రకం స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధిపరిచారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement