మోదీ యోగా చేస్తున్నారా?
సెయింట్ పీటర్స్ బర్గ్: భారతదేశంలో యోగా విద్యను విస్తరించడానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయన కూడా యోగా చేయడానికి సిద్ధమవుతున్నారా?అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సరదాగా వ్యాఖ్యానించారు. భారత్ లో యోగాకు మోదీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ(మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లో యోగా ఒక భాగం, ఏ-ఆయుర్వేదా, వై-యోగా, యూ-యునానీ)ని కేటాయించారని తెలుసుకున్నపుతిన్ ఈ విధంగా స్పందించారు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన అంతర్జాతీ ఆర్థిక ఫోరం సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
నరేంద్ర మోదీ యోగాను విస్తరించాలనుకోవడం అద్భుతమైన చర్యగా ఆయన అభివర్ణించారు. 'తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మీరు పాల్గొంటున్నారా?' అని మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రం పుతిన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అందరూ యోగా చేయాలనే సిద్దాంతమేమీ లేదు కదా? అని పుతిన్(నవ్వుతూ) తిరిగి ప్రశ్నించారు.