అమెరికా ప్రజల్ని ఉద్ధేశిస్తూ మాట్లాడుతున్న ట్రంప్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ ప్రత్యర్ధులపై యుద్ధానికి సిద్ధమయ్యారు. ఓక్లహోమా ర్యాలీతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తననో తోలుబొమ్మ అంటూ విమర్శించిన వారిపై విరుచుకుపడ్డారు. మాజీ అమెరికా ఉపాధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జోయ్ బిడెన్‌పై దాడి మొదలుపెట్టారు. శనివారం ఓక్లహోమా, తుల్సా నగరంలో అమెరికా ప్రజల్ని ఉద్ధేశిస్తూ ఆయన మాట్లాడుతూ.. ‘‘ రాడికల్ లెఫ్ట్ చేతుల్లో బిడెన్ ఓ తోలుగబొమ్మ. వారి చెప్పుచేతల్లో ఉన్నాడతను. లెఫ్ట్ పార్టీ మనల్ని అడ్డుకోవటానికి శతవిధాల ప్రయత్నిస్తోంది. వారి బెదిరింపులకు నేను భయపడను, ఈ దేశాన్ని ఎన్నటికీ వారి చేతుల్లో నాశనం కానివ్వను. మన చరిత్రను ధ్వంసం చేయటానికి చూస్తున్నారు. ( జాఫ్రీ బెర్మన్ తొలగింపునకు ట్రంప్ ఆదేశాలు!)
అందమైన చారిత్రక కట్టడాలను చెరిపేస్తున్నారు. వారు మన వారసత్వాన్ని కూల్చేయటానికి అణిచివేత పాలనను ఇక్కడ ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. మన పోలీసు వ్యవస్థను కనుమరుగు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అమెరికన్లంతా దాని గురించి ఓ సారి ఆలోచించండి’’ అని అన్నారు. కాగా, అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. నిన్న ఒక్కరోజే 26వేల కొత్త కేసులు నమోదవ్వగా 200 పైగా మంది మృత్యువాత పడ్డారు. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 23 లక్షల కేసులు నమోదయ్యాయి. మొత్తం 50 వేలకు పైగా మంది మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment