వాషింగ్టన్: అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోకుండా ఉత్పత్తి కొనసాగేలా ఒప్పందం కుదుర్చుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా తగ్గిన డిమాండ్, పోటీ పడి సౌదీ అరేబియా, రష్యా చమురు ధరలను తగ్గించాయి. దీంతో అమెరికా చమురు కంపెనీలు భారీ నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ జోక్యంతో పెట్రోలియం ఉత్పత్తి దేశాల సమాఖ్య(ఒపెక్, రష్యా) ఉత్పత్తిని తగ్గించుకునేందుకు అంగీకరించాయి. ఇందుకు సహకరించినందుకు సౌదీ అరేబియా, రష్యా ప్రభుత్వాధినేతలకు ఫోన్ చేసి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో స్థిరత్వం వస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment