opec
-
పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు!
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా, రష్యా తమ ఉత్పత్తి– ఎగుమతి కోతల విధానాన్ని ఏడాది చివరి వరకు పొడిగించడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు 90 డాలర్ల పైకి చేరాయి. ఇది 10 నెలల గరిష్ట స్థాయి. దీనితో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా, మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. చమురు అవసరాల కోసం 85 శాతం కంటే ఎక్కువ దిగుమతులపై భారత్ ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా క్రూడ్ ధర పెరిగితే, దేశంపై దిగుమతుల భారం మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా, పెరిగే అవకాశాలే ఉన్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. రష్యాతో కలిసి కూటమిగా ఉన్న ఒపెక్ (ఓపీఈసీ– పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ)కు నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియా డిసెంబర్ చివరి వరకు ప్రపంచ మార్కెట్‌కు సరఫరాలో రోజుకు ఒక మిలియన్ బ్యారెల్స్ తగ్గింపును కొనసాగించాలని ఇటీవల నిర్ణయించింది. అటు తర్వాత బ్రెంట్ ధర గత వారంలో 6.5% పెరిగింది. ఇక రష్యా కూడా ఇటీవలి నెలల్లో చమురు ఎగుమతులపై కోతలకు నిర్ణయం తీసుకుంది. భారత్ బిల్లు బ్యారెల్ సగటు 89.81 డాలర్లు! తాజా పరిణామాలతో మంగళవారం మొదటిసారి ఈ సంవత్సరంలో బ్రెంట్ బ్యారెల్ ధర మొదటిసారి 90 డాలర్లు దాటింది. బుధవారం కూడా ఈ వార్త రాసే 11 గంటల సమయంలో అదే స్థాయిలో ట్రేడవుతోంది. చమురు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు బాస్కెట్ ఆగస్టులో 86.43 డాలర్లు. ఈ నెలలో 89.81 డాలర్లకు పెరుగుతుందని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. మేలో ఈ ధర 73 నుంచి 75 డాలర్ల శ్రేణిలో తిరిగింది. అయితే జూలైలో 80.37 డాలర్లకు తాజాగా 90 డాలర్లకు పెరిగింది. దీనితో దేశీయంగా రేట్లు తగ్గవచ్చన్న అంచనాలకు ముగింపు పడినట్లయ్యింది. నిజానికి గత సంవత్సరం తీవ్ర స్థాయికి ధరలు చేరినప్పుడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఈ యేడాది మేలో పరిస్థితి కొంత మెరుగుపడుతోందనుకుంటుండగా, ధరలు మళ్లీ దూసుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో నిజానికి 17 నెలల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో నిలకడగా కొనసాగుతున్నాయి. రాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72 పలుకుతుండగా, డీజిల్ ధర రూ.89.62 వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు అంతర్జాతీయ ఇంధన ధరల బెంచ్‌మార్క్ 15 రోజుల రోలింగ్ యావరేజ్ ఆధారంగా ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాలి. అయితే ఆయా సంస్థలు 2022 ఏప్రిల్ 6 నుంచి అలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల తర్వాత రిటైల్ రేట్ల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పుడు మే 22న చివరిసారిగా ధరలు మారాయి. అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్ ధర 73–74 డాలర్ల శ్రేణిలో ఉంటే, చమురు కంపెనీలు రోజువారీ ధరల సవరణను మళ్లీ ప్రారంభించేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఇక తగ్గింపు అవకాశాలే సన్నగిల్లాయన్నది నిపుణుల అంచనా. భారీ ‘విండ్‌ఫాల్’ ఆదాయం! అధిక ధరల పరిస్థితుల్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వంటి దేశీయ ఉత్పత్తి సంస్థలు అధిక ఆదాయాలను పొందుతాయి. దీనితో పెరుగుతున్న ఆదాయాల నుంచి ప్రభుత్వం విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ రూపంలో భారీ మొత్తాలను పొందే అవకాశం ఉంది. దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ) రూపంలో విధించే పన్ను సెప్టెంబర్ 2 నుండి టన్నుకు రూ. 6,700కి తగ్గింది. ఇది గతంలో టన్నుకు రూ.7,100గా ఉంది. రానున్న నెలల్లో మళ్లీ పెంపు బాట పట్టవచ్చు. భారత్ 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. చమురు ఉత్పత్తిదారులు ప్రతి బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే ఎక్కువ ధరను పొందే సందర్భంలో వారు పొందే విండ్‌ఫాల్ లాభాలపై ప్రభుత్వం పన్ను విధింపు దీని లక్ష్యం. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతులపై విధించిన ఈ ప్రత్యేక అదనపు ఎౖMð్సజ్ సుంకం (ఎస్ఏఈడీ) వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఖజానాకు దాదాపు రూ.40,000 కోట్ల ఆదాయం లభించింది. 2023–24లో దాదాపు రూ.15,000 కోట్ల ఆదాయం వస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రస్తుత అంచనా. -
ఉత్పత్తి కోతలతో చమురు ధరలకు సెగ
ప్యారిస్: చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్‌ప్లస్ .. ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించడం వల్ల ప్రపంచ ఎకానమీకి రిస్కులు పొంచి ఉన్నాయని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అధిక స్థాయుల్లో ఉన్న ఇంధన ధరలు.. దీని వల్ల మరింతగా ఎగిసే అవకాశం ఉందని, భారత్ వంటి దేశాలకు చమురు దిగుమతుల భారం భారీగా పెరిగిపోవచ్చని తెలిపింది. సరఫరా తగ్గిపోయే అవకాశాలు ఉన్నందున 2023 ద్వితీయార్ధంలో అంతర్జాతీయంగా ఆయిల్ మార్కెట్లలో కొరత నెలకొనవచ్చని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతిహ్ బిరోల్ పేర్కొన్నారు. ‘ప్రపంచ ఎకానమీ ఇంకా బలహీనంగానే ఉండటంతో పాటు పలు వర్ధమాన దేశాలు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో చమురు ఉత్పత్తి కోతల నిర్ణయం వల్ల అంతర్జాతీయ ఎకానమీకి రిస్కులు ఎదురవుతాయని భావిస్తున్నాను‘ అని ఆయన తెలిపారు. ఇన్వెస్టర్ల సమావేశాల కోసం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య మంత్రి పియుష్ గోయల్‌తో సమావేశం అనంతరం బిరోల్ ఈ విషయాలు వివరించారు. భారత ఎకానమీ పటిష్టంగా ఉందని, రాబోయే రోజుల్లో మరింత బలంగా మారగలదని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని బిరోల్ చెప్పారు. మరోవైపు, ఉక్రెయిన్ మీద యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షల ప్రభావం గురించి మాట్లాడుతూ ఆ దేశ ఆదాయాలను తగ్గించాలన్న లక్ష్యం సాకారమైందని తెలిపారు. చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే, వినియోగించుకునే దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్ 85 శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో ఆయిల్ దిగుమతులపై 118 బిలియన్ డాలర్లు వెచ్చించింది. -
క్రూడ్ మళ్లీ 100 డాలర్లకు..!
న్యూఢిల్లీ: చమురు ధరలు మళ్లీ బ్యారెల్‌కు 100 డాలర్లను దాటిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) రోజువారీ 2 మిలియన్ బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిని (అంతర్జాతీయ సరఫరాలో 2 శాతం) తగ్గించాలని తీసుకున్న నిర్ణయం ఇందుకు దారితీస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బ్రెంట్ బ్యారెల్ ధర 92 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఒపెక్ తాజా నిర్ణయం నవంబర్ నుంచి అమల్లోకి రానుంది. దీంతో అప్పటికి ధరలు పెరిగిపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒపెక్ నిర్ణయం మేరకు ఉత్పత్తిలో కోత 2023 డిసెంబర్ వరకు అమల్లో ఉండనుంది. ‘‘చమురు ధరల విషయంలో సానుకూల అంచనాలతో ఉన్నాం. శీతాకాలంలో గ్యాస్ నుంచి చమురుకు మళ్లడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ఓఈసీడీ వ్యూహాత్మక చమురు నిల్వల విడుదల ముగింపు, చమురు ఉత్పత్తికి కోత విధించడానికి అదనంగా, రష్యా చమురు దిగుమతులపై యూరప్ విధించిన నిషేధం డిసెంబర్ 5 నుంచి అమల్లోకి రానుంది. దీంతో చమురు మార్కెట్ మరింత కఠినంగా మారనుంది’’అని యూబీఎస్‌కు చెందిన విశ్లేషకులు స్టానోవో, గోర్డాన్ అంచనా వ్యక్తం చేశారు. సాధారణంగా ఒపెక్ భేటీ ఆరు నెలలకు ఓసారి జరుగుతుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైతే అసాధారణ సమావేశాన్ని నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. విపరిణామాలు.. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ధర ఇటీవలి 82 డాలర్ల కనిష్ట స్థాయి నుంచి 12 శాతం ఇప్పటికే పెరగడం గమనార్హం. ‘‘రోజువారీగా 2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి కోత విధించాలన్న ఒపెక్ నిర్ణయం పలు ప్రతికూలతలకు దారితీస్తుంది. కొన్ని సభ్య దేశాలు ఈ లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా జీవన వ్యయం పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న వినియోగదారుడికి ఉపశమనం కల్పించాలన్న లక్ష్యంతో యూఎస్ ఉంది. మరి ఒపెక్ నిర్ణయం అమలైతే ఈ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది’’అని క్విల్టర్ చెవియొట్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ జామీ మడాక్ వివరించారు. ఓపెక్ సభ్య దేశం రష్యా అయితే మరింత తక్కువ ఉత్పత్తి చేస్తున్నట్టు కొందరు అనలిస్టులు చెబుతున్నారు. 8 లక్షల బ్యారెళ్ల మేర నికర సరఫరా మార్కెట్లో తగ్గుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీస్ డైరెక్టర్ పాల్ హికిన్ అంచనా వేశారు. ఒపెక్ నిర్ణయం వచ్చే కొన్ని నెలలకు క్రూడ్‌కు బేస్ ధరను నిర్ణయించినట్టు చెప్పారు. ‘‘2020 మే నెలలో క్రూడ్ ధరలు మైనస్‌కు పడిపోయిన సమయంలో ఒపెక్ చమురు ఉత్పత్తికి భారీ కోత విధించింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉత్పత్తికి కోత పెట్టాలని ఒపెక్ నిర్ణయించడం మళ్లీ ఇదే. ఇప్పుడు బ్రెండ్ బ్యారెల్ కనీసం 90 డాలర్ల కంటే తగ్గకుండా ఉండాలని (బేస్) ఒపెక్ ప్లస్ దేశాలు భావిస్తుండొచ్చు. ఆయిల్ మార్కెట్ కొత కాలంగా బేరిష్ ట్రెండ్‌లో ఉన్నాయి. అమెరికా వ్యూహత్మక చమురు నిల్వల విడుదల అక్టోబర్‌తో ముగిసిపోతుంది. చైనా లాక్డౌన్లు, మొత్తం మీద డిమాండ్‌పై ప్రభావం చూపిస్తాయి. అలాగే, రష్యాపై ఆంక్షలు కూడా చమురు ధరలను నిర్ణయిస్తుంది’’అని పాల్ హికిన్ అంచనా వేశారు. -
చమురు ఉత్పత్తికి ఒపెక్ కోత, దేశంలో మళ్లీ పెట్రో ధరల మంట?
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ విక్రయాలపై లాభాలు కళ్లచూద్దామన్న ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు దేశంలో ఆరు నెలలుగా ఒకే స్థాయిలో ఉండిపోయాయి. కేంద్ర ప్రభుత్వ పరోక్ష ఆదేశాలతో ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు రోజువారీ రేట్ల సవరణను నిలిపివేశాయి. చమురు ఉత్పత్తికి కోత పెట్టాలని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో రేట్ల సవరణ కూడా ఇప్పట్లో చేపట్టే అవకాశాల్లేవని తెలుస్తోంది. చమురు ధరలు ఇటీవలి గరిష్టాల నుంచి కొంత తగ్గుముఖం పట్టాయి. దీంతో చమురును ఉత్పత్తి చేస్తున్న దేశాల కూటమి ఒపెక్ రోజువారీగా 2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గించుకోవాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ధరలు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న మన ఆర్థిక వ్యవస్థకు ఓపెక్ తాజా నిర్ణయం ప్రతికూలం కానుంది. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలను సవరించకపోవడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ధరలు తగ్గడంతో డీజిల్ మినహా పెట్రోల్, గ్యాస్‌పై అవి ఎదుర్కొంటున్న నష్టాలు సున్నా స్థాయికి చేరాయి. లీటర్ డీజిల్‌పై నష్టం రూ.5కు తగ్గింది. కానీ, తాజా పరిణామంతో తిరిగి ఆయిల్ కంపెనీలకు నష్టాలు పెరిగిపోనున్నాయి. మరోవైపు రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా చమురుపై నష్టాలను పెంచనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నష్టాల బాట.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న కేంద్ర సర్కారు లక్ష్యానికి అనుగుణంగా పెట్రోలియం ఉత్పత్తుల విక్రయ ధరలను సవరించకపోవడంతో ఆయిల్ కంపెనీల నష్టాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా జూన్ త్రైమాసికంలో మూడు ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఉమ్మడిగా రూ.18,480 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. భారత్ దిగుమతి చేసుకునే బ్యారెల్ ముడి చమురు ధర సెప్టెంబర్ 27 నాటికి 84.75 డాలర్లకు తగ్గగా, అక్టోబర్ 5 నాటికి తిరిగి 92.17 డాలర్లకు పెరిగిపోయింది. చమురు ధరల క్షీణత ఇలానే కొనసాగితే, ఏప్రిల్ నుంచి ఎదుర్కొన్న నష్టాల భారం నుంచి గట్టెక్కొచ్చన్న చమురు కంపెనీల ఆశలు తాజా పరిణామంతో చెదిరిపోయాయి. 2021 నవంబర్ 4 నుంచి ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడం గమనార్హం. మార్చి 22 తర్వాత తిరిగి ఇవి రేట్లను సవరించాయి. ఫలితంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.10 మేర పెరిగింది. తిరిగి ఏప్రిల్ 7 నుంచి రేట్ల సవరణ నిలిచిపోయింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 చొప్పున ఉంది. -
పెట్రో ప్రొడక్టులకు డిమాండ్
న్యూఢిల్లీ: ఈ క్యాలండర్ ఏడాది(2022)లో దేశీయంగా పెట్రోలియం ప్రొడక్టులకు ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్ కనిపించనున్నట్లు చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాల(ఒపెక్) నెలవారీ నివేదిక పేర్కొంది. పెట్రోల్, డీజిల్ తదితరాల డిమాండులో 7.73 శాతం వృద్ధి కనిపించనున్నట్లు అంచనా వేసింది. వెరసి 2021లో నమోదైన రోజుకి 4.77 మిలియన్ బ్యారళ్ల(బీపీడీ) నుంచి 5.14 మిలియన్ బ్యారళ్ల(బీపీడీ)కు డిమాండు పుంజుకోనున్నట్లు తెలియజేసింది. ఇది అంతర్జాతీయంగా రికార్డ్‌కాగా.. చైనా డిమాండుతో పోలిస్తే 1.23 శాతం, యూఎస్‌కంటే 3.39 శాతం, యూరప్కంటే 4.62 శాతం అధికమని నివేదిక తెలియజేసింది. అయితే 2023లో దేశీ డిమాండు 4.67 శాతం వృద్ధితో 5.38 శాతానికి చేరనున్నట్లు అంచనా వేసింది. ఇది చైనా అంచనా వృద్ధి 4.86 శాతంతో పోలిస్తే తక్కువకావడం గమనార్హం! ప్రపంచంలోనే చమురును అత్యధికంగా దిగుమతి చేసుకోవడంతోపాటు.. వినియోగిస్తున్న దేశాల జాబితాలో అమెరికా, చైనా తదుపరి ఇండియా మూడో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వృద్ధి అండ పటిష్ట వృద్ధి(7.1 శాతం)ని సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థ దేశీయంగా పెట్రోలియం ప్రొడక్టుల డిమాండుకు దన్నునివ్వనున్నట్లు ఒపెక్ నివేదిక పేర్కొంది. కా గా.. ఈ ఏడాది మూడో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో రుతుపవనాల కారణంగా చమురుకు డిమాండ్ మందగించే వీలున్నదని, అయినప్పటికీ తదుపరి పండుగల సీజన్‌తో ఊపందుకోనున్నట్లు వివరించింది. ఇటీవల పరిస్థితులు (ట్రెండ్) ఆధారంగా ఈ ఏడాది ద్వితీయార్థం డిమాండులో డీజిల్, జెట్ కిరోసిన్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు పేర్కొంది. కోవిడ్–19 ప్రభావంతో వీటికి గత కొంతకాలంగా డిమాండు క్షీణించిన విషయం విదితమే. -
ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు
న్యూఢిల్లీ/దుబాయ్: ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఆ వ్యాఖ్యలు చేసింది అధికార బీజేపీకి చెందిన నేతలు కావడంతో పలు ముస్లిం దేశాలు వాటిని కేంద్ర ప్రభుత్వ వైఖరిగా పరిగణిస్తున్నాయి. 57 ముస్లిం దేశాల సమాఖ్య ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ (ఓఐసీ) ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే గాక భారత్‌లో ముస్లిం మైనారిటీల భద్రతపై జోక్యం చేసుకోవాలంటూ ఐరాసకు విజ్ఞప్తి చేసింది! ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండించిన దేశాల జాబితాలో తాజాగా ఇండొనేసియా, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, అఫ్గానిస్తాన్ కూడా చేరాయి. దీనిపై తమ తీవ్ర అభ్యంతరాలను జకార్తాలోని భారత రాయబారికి తెలియపరిచినట్టు ఇండొనేసియా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. యూఏఈతో పాటు మక్కా గ్రాండ్ మాస్క్, మదీనా ప్రాఫెట్స్ మాస్క్ వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ కూడా ఇలాంటి ప్రకటనలే చేశాయి. సౌదీ విదేశాంగ శాఖ ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండిస్తూనే, సదరు నేతలపై బీజేపీ చర్యలను స్వాగతిస్తున్నట్టు పేర్కొంది. ఖతార్, కువైట్ ఒక అడుగు ముందుకేసి భారత్ క్షమాపణకు కూడా డిమాండ్ చేశాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ, యూఏఈలతో కూడిన ప్రాంతీయ, రాజకీయ, ఆర్థిక యూనియన్ అయిన గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) కూడా బీజేపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. జీసీసీ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పని చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ విద్వేష ప్రచారం భారత ఉత్పత్తులను బహిష్కరిస్తామని ఇస్లామిక్ దేశాల్లోని పలు ప్రముఖ సంస్థలు ప్రకటనలు చేస్తుండటం వివాదాన్ని మరింత జటిలంగా మార్చింది. తమ సూపర్ మార్కెట్లలో టీ పొడి తదితర భారత ఉత్పత్తుల విక్రయాలను ఆపేయాలని యోచిస్తున్నట్టు కువైట్‌లోని అల్–అర్దియా కో ఆపరేటివ్ సొసైటీ వంటివి ఇప్పటికే ప్రకటించాయి. పలు ముస్లిం దేశాల్లో ఇప్పటికే భారత ఉత్పత్తుల బహిష్కరణ మొదలైంది! అరబ్ ప్రపంచమంతా వాటిని నిషేధించాలంటూ ట్విట్టర్ తదితర సోషల్ మాధ్యమాల్లో ట్రెండింగ్ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం హుటాహుటిన నష్ట నివారణ చర్యలకు దిగింది. అటు ఓఐసీ వ్యాఖ్యలను తీవ్ర పదజాలంతో ఖండిస్తూనే, అవి కొందరు వ్యక్తుల అనాలోచిత వ్యాఖ్యలే తప్ప భారత ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించేవి కానే కావని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీతో పాటు పలు ముస్లిం దేశాల్లోని భారత రాయబారులు స్థానికంగా కూడా ప్రకటనలు చేశారు. బలమైన ఆర్థిక బంధం అరబ్ ప్రపంచం నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలను శాంతింపజేసేందుకు భారత్ హుటాహుటిన రంగంలోకి దిగడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పశ్చిమాసియాలోని ఈ ముస్లిం దేశాలతో మనకున్న బలమైన ఆర్థిక, వాణిజ్య సంబంధాలు. సౌదీ, కువైట్, ఖతర్, ఒమన్ తదితర దేశాల్లో భారతీయులు చాలా ఎక్కువగా ఉంటారు. యూఏఈ జనాభాలోనైతే 30 శాతం దాకా భారతీయులే. మొత్తమ్మీద ఈ ముస్లిం దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైల సంఖ్య ఏకంగా 87 లక్షలని అంచనా. వీరిలో కార్మికులే అత్యధికంగా ఉంటారు. తాజా వివాదం నేపథ్యంలో వారి భద్రతపై అనుమానాలు నెలకొన్నాయి. గల్ఫ్ దేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపే మొత్తాలు (రెమిటెన్సులు) దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారాయి. 2021లో భారత్‌కు 87 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు అందాయి. అంటే రూ.6.76 లక్షల కోట్ల పై చిలుకే! దేశ జీడీపీలో ఇది ఏకంగా 3.1 శాతం! ఇంతటి కీలకమైన ఈ రెమిటెన్సుల్లో అమెరికా తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఒమన్ దేశాల నుంచే అత్యధికంగా వస్తున్నాయి. దాంతో రెమిటెన్సుల్లో భారత్ ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉంది. కీలక గల్ఫ్ దేశాలతో కూడిన గల్ఫ్ కో ఆపరేటివ్ కౌన్సిల్(జీసీసీ)తో 2020–21లో భారత్ 87 మిలియన్ డాలర్ల మేరకు వాణిజ్యం జరిపింది. మన వర్తక భాగస్వాముల్లో యూఈఏ మూడో, సౌదీ నాలుగో స్థానంలో ఉన్నాయి. యూఏఈతో ఇటీవలే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమూ కుదిరింది. చదవండి: గూగుల్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా కోర్టు గల్ఫ్ దేశాలతో బంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రధాని మోదీ పలుమార్లు పర్యటించారు. ఆర్టికల్ 370 రద్దును స్వాగతించిన తొలి దేశాల్లో యూఏఈ ఉంది. ఇరాక్, సౌదీ, యూఏఈ తదితర గల్ఫ్ దేశాల నుంచి మనం భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్నాం. యుద్ధం వల్ల రష్యా నుంచి చమురు సరఫరా తగ్గుతున్నందున గల్ఫ్ దేశాలపై ఆధారపడటం మరింతగా పెరిగేలా కన్పిస్తోంది. మనతో వర్తకం ద్వారా సమకూరే ఆదాయం గల్ఫ్ దేశాలకూ కీలకమే. పైగా వాటి కార్మిక శక్తిలో భారతీయులు కీలకంగా ఉన్నారు. వీటికి తోడు చాలా గల్ఫ్ దేశాల ఆహార అవసరాలను భారతే తీరుస్తోంది. ఈ జాబితాలో బియ్యం, మాంసం, సుగంధద్రవ్యాలు, పళ్లు, కూరగాయలు, చక్కెర వంటివెన్నో ఉన్నాయి. కువైట్ ఏకంగా 90 శాతం ఆహార పదార్థాలను భారత్ నుంచే దిగుమతి చేసుకుంటోంది! -
చమురు ఉత్పత్తి పెంచి... యూరప్‌ను ఆదుకోండి
దోహా/ఇస్తాంబుల్: ‘‘చమురు ఉత్పత్తిని మరింతగా పెంచండి. ఇంధనం కోసం రష్యాపై ఆధారపడకుండా యూరప్ దేశాలను ఆదుకోండి. వాటి భవితవ్యం మీ చేతుల్లోనే ఉంది’’ అని ఒపెక్ దేశాలకు, ముఖ్యంగా ఖతర్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. ఖతర్‌లో జరుగుతున్న దోహా ఫోరాన్ని ఉద్దేశించి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తమ దేశాన్ని రష్యా సర్వనాశనం చేస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మా రేవు పట్టణాలను నేలమట్టం చేసింది. దీంతో ఉక్రెయిన్ ఎగుమతులన్నీ నిలిచిపోయాయి. ఇది ప్రపంచమంతటికీ పెద్ద దెబ్బే. మమ్మల్ని లొంగదీయలేక రష్యా అణు బెదిరింపులకు దిగుతోంది. అదే జరిగితే ప్రపంచమంతటికీ పెనుముప్పే’’ అని హెచ్చరించారు. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభానికి చర్చలే పరిష్కారమని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అన్నారు. జెలెన్స్కీతో ఆయన ఫోన్లో మాట్లాడారు. -
ఇటు రష్యా అటు నాటో.. చుక్కలు చూపిస్తోన్న ముడి చమురు ధరలు
-
చుక్కలు చూపిస్తోన్న ముడి చమురు ధరలు.. చిక్కుల్లో ప్రపంచ దేశాలు
ప్రపంచ దేశాలను ముడి చమురు ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో ఇటు నాటో అటు రష్యా పంతానికి పోతుండటం మిగిలిన దేశాలకు చిక్కులు తెస్తోంది. రష్యా బాంబుల మోతలు అమెరికా ఆర్థిక ఆంక్షల వాతలు వెరసి ముడి చమురు ధర రెండో గరిష్ట స్థాయిని అందుకుంది. నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తుందంటూ రష్యా చేపట్టిన దండయాత్ర పది రోజులు దాటినా అనుకున్న ఫలితాలు సాధించలేదు. ఓవైపు ఉక్రెయిన్‌లో ఒక్కో నగరానికి కీలక స్థావరాలను రష్యా స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు నాటోతో పాటు ఈయూ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. ఇలా రెండు వైపులా ఒత్తిడి పెరిగిపోవడంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దిగుమతి చేసుకోం? ప్రపంచ ఆయిల్ మార్కెట్లలో గల్ఫ్ తీరంలో ఉన్న ఒపెక్ దేశాల తర్వాత వెనుజువెలా, రష్యాలదే అగ్రస్థానం. రష్యా ఒక్కటే ప్రపంచ ఆయిల్ ఉత్పత్తిలో 10 శాతం వాటాను కలిగి ఉంది. నిన్నా మొన్నా వరకు ఆర్థిక ఆంక్షలు తప్ప ఆయిల్‌పై నాటో, ఈయూ దేశాలు ఆంక్షలు విధించలేదు. యుద్ధం జరుగుతున్నా రష్యా ఆయిల్ దిగుమతిపై ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. కానీ నో ఫ్లైజోన్ విషయంలో నాటో దేశాలు లక్ష్యంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ చేస్తోన్న విమర్శలు ఆ దేశాల అధినేతలను చుట్టుముడుతున్నాయి. ఫలితంగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతిపై ఆంక్షలు విధిస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అమెరికాకే ఇబ్బంది పెట్రోలు దిగుమతిలో అమెరికా ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. గతంలో అణ్వాయుధాల తయారీ నెపంతో ఇరాన్‌పై ఆంక్షలు విధించింది అమెరికా. తాజాగా రష్యాపై కూడా ఆయిల్ ఆంక్షలు అమలు చేయనుంది. ఇదే జరిగితే అతి పెద్ద ఆయిల్ వినియోగదారైన అమెరికా కేవలం ఒపెక్ దేశాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఉన్న పళంగా డిమాండ్ పెరిగిపోనుంది. ముడి బిగుస్తోంది పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా అధికంగా ఆయిల్‌ను ఉత్పత్తి చేసేందుకు ఒపెక్ దేశాలు సుముఖంగా లేవు. దీనికి తోడు మరో ఆయిల్ ఉత్పత్తి దేశమైన లిబియాలోనూ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఆయిల్ ఉత్పత్తి పెంచొద్దంటూ సాయుధ దళాల నుంచి బెదిరింపులు రావడంతో అక్కడ రెండు చోట్ల ముడి చమురు వెలికి తీత ఆగిపోయింది. మండుతున్న ధర డిమాండ్‌కు తగ్గస్థాయిలో చమురు లభ్యత తగ్గిపోవడంతో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఆదివారం 139 డాలర్లకు చేరుకుంది. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం కారణంగా బ్యారెల్ ధర 143 డాలర్లుగా పలికింది. ఆ తర్వాత ఇదే అత్యధికం. సోమవారం బ్యారెల్ ధర కొంత తగ్గి 129 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. కానీ యుద్ధం తెచ్చిన ఉద్రిక్తతలు అలాగే ఉండటం కలవరం కలిగిస్తోంది. శాంతి నెలకొనని పక్షంలో ఏ క్షణమైనా మరోసారి ఆయిల్ ధరలు ఆకాశం తాకడం గ్యారెంటీ అనే భయం నెలకొంది. చిక్కులు వెరసి ఉక్రెయిన్ను కేంద్రంగా చేసుకుని రష్యా, అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలు మొదలు పెట్టిన ఆధిపత్య పోరు సెగ ప్రపంచ దేశాలను తాకుతోంది. కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే గట్టెక్కుత్ను దేశాలకు చమురు ధరల పెరుగుదల వణికిస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ద్రవ్యోల్బణం తప్పని దుస్థితి ఎదురుకానుంది. చదవండి: ఉక్రెయిన్ - రష్యా వార్ ఎఫెక్ట్.. లబోదిబోమంటున్న బిలియనీర్స్! -
దూసుకెళ్తున్న క్రూడ్ ఆయిల్ ధరలు, ఆందోళనలో భారత్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఏడేళ్లలో మొదటిసారి బేరల్‌కు 93 డాలర్లు చేరడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బాధ్యతాయుత, సహేతుక ధరను భారత్ కోరుకుంటున్నట్లు రాజ్యసభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తెలి పేర్కొన్నారు. ఈ కమోడిటీ విషయంలో తీవ్ర ఒడిదుడుకులను నిరోధించాలని తాము చమురు ఉత్పత్తి దేశాలను కోరుతున్నట్లు తెలిపారు. దేశం తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ చమురు రేట్లకు అనుగుణంగా ఉంటాయి. దీనికితోడు దేశంలో పన్నుల భారం తీవ్రంగా ఉండడం ద్రవ్యోల్బణంపై ఒత్తిడులను పెంచుతోంది. ‘‘ముడిచమురు ధరల అస్థిరతపై భారతదేశం తన తీవ్ర ఆందోళనలను ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం), ఇతర అంతర్జాతీయ వేదికల చీఫ్‌ల దృష్టికి ద్వైపాక్షింగా తీసుకువెళుతోంది’’ అని తెలిపారు. మరో ప్రశ్నకు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సమాధానం చెబుతూ, 2021 డిసెంబర్ 1వ తేదీన బేరల్‌కు అంతర్జాతీయంగా 71.32 డాలర్లు ఉంటే, జనవరి 31వ తేదీ నాటికి 18.09 డాలర్లు పెరిగి 89.41 డాలర్లకు చేరిందని తెలిపారు. -
తగ్గనున్న పెట్రోల్ ధరలు ? ఓపెక్ దేశాల కీలక నిర్ణయం
ఫ్రాంక్ఫర్ట్: ప్రపంచ ఎకానమీకి చమురు సరఫరాలను మరింత పెంచాలని ఒపెక్ దాని అనుబంధ చమురు ఉత్పత్తి దేశాలు నిర్ణయించాయి. కోవిడ్–19 నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కోవిడ్–19 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ వేగవంతమైన వ్యాప్తి ఉన్నప్పటికీ ప్రయాణ, రవాణా, ఇంధనం విభాగాల్లో డిమాండ్ కొనసాగుతున్నట్లు భావిస్తున్నట్లు 23 సభ్యదేశాల ఒపెక్, అనుబంధ దేశాలు పేర్కొన్నాయి. మహమ్మారి తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో జరిగిన ఉత్పత్తి కోతలను నెమ్మదిగా పునరుద్ధరించడానికి ఉద్దేశించిన రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఫిబ్రవరిలో రోజుకు 400,000 బారెల్స్ ఉత్పత్తిని పెంచనున్నట్లు పేర్కొంది. ధరలు తగ్గేనా పెట్రోల్‌ను అత్యధికంగా వినియోగిస్తున్న దేశాలైన అమెరికా, చైనా, భారత్, జపాన్లలో ధరల నియంత్రణ కోసం ముడి చమురు ఉత్పత్తి పెంచాలంటూ ఒపెక్ దేశాలకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం రాలేదు. దీంతో ఈ దేశాలు తమ అత్యవసర నిల్వల నుంచి పెట్రోలును రిలీజ్ చేశాయి. దీంతో చమురు ఉత్పత్తి దేశాలు, వినియోగదారులైన దేశాల మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముడి చమురు ఉత్పత్తి పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఉత్పత్తి పెరిగితే చమురు ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి: ముడి చమురు మహా యుద్ధం! -
ముడి చమురు మహా యుద్ధం!
చమురు విపణి చరిత్రలో తొలిసారిగా ఒక పక్క అమెరికా, చైనా, జపాన్, భారత్, దక్షిణా కొరియా, బ్రిటన్లు. మరోపక్క సౌదీ అరేబియా సారథ్యంలోని ‘పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య’ (ఒపెక్) ప్లస్. ఒకవైపు ప్రపంచమంతటా పెరుగుతూ, మూడేళ్ళ అత్యధికానికి చేరిన ముడి చమురు ధరలకు పగ్గం వేయడానికి ఉత్పత్తి, సరఫరాలు పెంచాలంటున్న అమెరికా తదితర ఆసియా దేశాలు. మరోవైపు పెడచెవిన పెడుతున్న ఒపెక్ ప్లస్ సభ్యులు. అందుకే, 50 మిలియన్ బ్యారళ్ళ ఆయిల్ అమెరికా, 5 మిలియన్ బ్యారళ్ళు భారత్ తమ అత్యవసర నిల్వల నుంచి విడుదల చేస్తామంటూ ప్రకటించడం కీలక పరిణామం. కొన్ని ఆసియా దేశాలు కలిసొస్తున్నాయి. ధరలు తగ్గి, ద్రవ్యోల్బణం అదుపు కావడం కోసమే ఇలా రిజర్వుల నుంచి ఆయిల్‌ను విడుదల చేస్తు్తన్నట్టు దేశాల మాట. కానీ, ఈ నిర్ణయంతో ఆశించినట్టు చమురు ధరలు తగ్గుతాయా అన్నది ప్రశ్న. పైగా, ఒపెక్ ప్లస్ దేశాల వ్యతిరేక కూటమి అన్నట్టుగా మారిన ఈ చమురు వినియోగ దేశాల చర్యకు ‘ఒపెక్’ ప్లస్ నుంచి ప్రతిచర్య తప్పకపోవచ్చు. వ్యూహ ప్రతివ్యూహాల మధ్య అక్షరాలా ఇది ముడి చమురు యుద్ధమే! దీనికి దారి తీసిన పరిస్థితులు అనేకం. కరోనా తారస్థాయికి చేరినవేళ చమురు సరఫరాలను ‘ఒపెక్’ ప్లస్ దేశాలు తగ్గించాయి. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో, చమురు డిమాండ్ పెరిగింది. ఆయిల్ ధరలేమో ఈ ఏడాది 50 శాతానికి పైగా పెరిగాయి. ద్రవ్యోల్బణం భారమైంది. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి పెంచి, త్వరితగతిన మునుపటి స్థాయికి సరఫరాలు తీసుకురమ్మని ఒపెక్ ప్లస్‌ను వివిధ దేశాలు కోరాయి. అయినా లాభం లేకపోయింది. దాంతో, కలసికట్టుగా చమురు ధరకు చెక్ చెప్పడానికి అమెరికా అభ్యర్థనతో ఇతర దేశాలూ కదిలాయి. మునుపెన్నడూ లేనంత అత్యధికంగా అమెరికా విడుదల చేస్తున్న నిల్వలు ఈ డిసెంబర్ మధ్య నుంచి చివరిలోగా మార్కెట్లోకి రానున్నాయి. దీని వల్ల అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్ నిలకడగా మారుతుందన్నది ఆశ. నిజానికి, చమురు సంక్షోభం తలెత్తిన 1973–74లో స్వతంత్ర సంస్థ ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ’ (ఐఈఏ) ఏర్పాటైంది. 30 సభ్యదేశాల ఈ సంస్థ అప్పటి నుంచి ఆర్థిక సంపన్న దేశాల పక్షాన ప్రపంచవ్యాప్త ముడిచమురు సరఫరాలను పర్యవేక్షిస్తోంది. ఈ ఏజెన్సీ ఏర్పాటయ్యాక ఇప్పటిలా కొన్ని దేశాలు కలిసి ఓ సమన్వయంతో అత్యవసర నిల్వల నుంచి ఆయిల్ విడుదల గతంలో మూడేసార్లు జరిగింది. అవి – 1991లో గల్ఫ్ యుద్ధం, 2005లో కత్రినా – రీటా తుపాన్లతో మెక్సికో గల్ఫ్‌లో చమురు వసతులు దెబ్బతిన్న సందర్భం, 2011లో లిబియాలో యుద్ధంతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడిన సమయం! ఇప్పుడిది నాలుగోసారి. క్రిస్మస్ సెలవులు దగ్గర పడుతున్న అమెరికాలో ఇంధనం సగటున గ్యాలన్ 3.41 డాలర్లు పలుకుతోంది. 2014 నుంచి ఇదే అత్యధికం. గ్యాసోలిన్ రేటూ గత ఏడాది కన్నా 1.29 డాలర్లు పెరిగింది. అనేక సవాళ్ళతో ప్రతిష్ఠ దెబ్బతిన్న బైడెన్‌కు.. ఈ ప్రయాణాల సీజన్లో సగటు అమెరికన్ల కోసం నిల్వల విడుదల తప్పలేదు. ప్రపంచ చమురు వినియోగంలో అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానం భారత్‌దే. తర్వాతి స్థానాలు జపాన్, దక్షిణ కొరియాలవి. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 99 మిలియన్ బ్యారళ్ళ చమురు సరఫరా అవుతుంది. వీటన్నిటి అత్యవసర నిల్వలు కలిపినా, 15 రోజుల ప్రపంచ సరఫరాకే సరి. వీటిలో అత్యధికంగా 714 మిలియన్ బ్యారళ్ళ అత్యవసర నిల్వలున్నవి అమెరికా వద్దే! 39 మిలియన్ బ్యారళ్ళ నిల్వలు మన దగ్గరున్నాయి. ఇంధన ధరలు తగ్గేందుకు నిల్వలను విడుదల చేయాలని మునుపెన్నడూ లేని రీతిలో అమెరికా గత వారం అభ్యర్థించింది. ఆ ప్రతిపాదనను భారత్ మొదట ప్రశ్నించింది. చివరకు రోజువారీ దేశీయ వినియోగానికి సమానమైన మొత్తంలో 5 మిలియన్ బ్యారళ్ళ నిల్వల విడుదలకు సై అంది. ప్రతీకాత్మకమే అయినా, ఈ చర్య వల్ల మనకు లాభం కన్నా నష్టమనే వాదనా ఉంది. ఇక ప్రపంచంలో అతి పెద్ద చమురు దిగుమతిదారు చైనా. తమ దేశంలో ఆయిల్ ధరకు కళ్ళెం వేయడానికి ఈ ఏడాది ఇప్పటికే చాలాసార్లు నిల్వలు విడుదల చేసింది. వివరాలు వెల్లడించనప్పటికీ, తాజా కలసికట్టు ప్రయత్నానికీ బాసటగా నిలుస్తానంటోంది. 1100 బిలియన్ బ్యారళ్ళ నిల్వలున్న ఒపెక్ ప్లస్‌కు, మరెన్నో లక్షల బ్యారళ్ళ మిగులు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అయినా సరే, డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి పెంచడం లేదు. యూరప్‌లోని తాజా లాక్డౌన్లు సహా అనిశ్చిత పరిస్థితులను సాకుగా చూపుతోంది. ఉత్పత్తిని తగ్గించి, ధరలు పెరిగేలా చేస్తోందనే అనుమానానికీ తావిచ్చింది. ఇక తప్పక... ‘ప్రపంచ చమురు విపణి వేదికపై మీరే కాదు.. మేమూ ఉన్నామ’న్నట్టు ఒపెక్ ప్లస్‌కు కొన్ని దేశాలు పరోక్షంగా సవాలు విసిరినట్టయింది. డిసెంబర్ 2న సమావేశమయ్యే ఒపెక్ ప్లస్ దీనికెలా స్పందిస్తుందో, పరిణామాలెలా ఉంటాయో చూడాలి. ఇప్పటికైతే నిల్వల విడుదల ప్రకటన ప్రభావం లేదు. బుధవారం ఆయిల్ ధరలు వారంలోకెల్లా గరిష్ఠానికి చేరాయి. ఒకవేళ రేపు ధరలు తగ్గినా, అదీ తాత్కాలికమే. సరఫరాల్లో సమస్యలు తలెత్తితే తట్టుకోవడానికని పెట్టుకున్న నిల్వలతో అధిక ధరలను నియంత్రించాలనుకోవడం చురకత్తితో పెనుయుద్ధం చేయాలనుకోవడమే! తాజా చమురు పోరుతో అమెరికా, సౌదీ అరేబియా సంబంధాలూ మరింత దెబ్బతినవచ్చు. కానీ ఇప్పటికీ భయపెడుతున్న కరోనా నుంచి కొన్ని దేశాలు, ఆర్థిక మందగమనం నుంచి మిగతా దేశాలు బయటపడడమే ప్రస్తుతం కీలకం! ఒపెక్ చేతిలో ఆటబొమ్మ కాకూడదంటే, సౌరశక్తి లాంటి తరగని ఇంధన వనరుల వైపు మళ్ళడమే ఎప్పటికైనా శరణ్యం!! -
ఆర్థిక రికవరీకి చమురు రేట్ల ముప్పు
న్యూఢిల్లీ: భారీగా పెరిగిపోతున్న ముడి చమురు రేట్లు .. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీని దెబ్బతీసే ప్రమాదముందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చమురు ధరలు సహేతుక స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సౌదీ అరేబియాతో పాటు చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్‌ను కోరింది. ‘ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతూకం పాటించే విధంగా చమురు రేట్లు ఉండాలి. ప్రస్తుతం సరఫరా కన్నా డిమాండ్ అధికంగా ఉండటంతో రేట్లు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాలకు మరింత వేగంగా మళ్లే అవకాశం ఉంది. కాబట్టి అధిక ధరలనేవి ఉత్పత్తి దేశాలకు కూడా ప్రతికూలంగానే పరిణమించగలవని ఒపెక్ కూటమికి భారత్ తెలియజేసింది‘ అని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇటీవలే సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, రష్యా తదితర దేశాలతో సమావేశాల సందర్భంగా క్రూడాయిల్ రేట్ల పెరుగుదలపై చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన వివరించారు. చమురు ధరలను స్థిరంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని, లేకపోతే ఇప్పటిదాకా ప్రపంచ దేశాలు సాధించిన రికవరీ దెబ్బతినే అవకాశం ఉందని ఆయా దేశాలకు మంత్రి స్పష్టం చేసినట్లు అధికారి తెలిపారు. బ్యారెల్ ధర 65–70 డాలర్ల స్థాయి పైగా ఉండటం వల్ల దిగుమతి దేశాలకు సమస్యాత్మకంగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. చమురుకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న ఏకైక దేశమైన భారత్ పక్కకు తప్పుకుంటే .. ఉత్పత్తి దేశాలకు కూడా సమస్యేనని అధికారి పేర్కొన్నారు. ధర మాత్రమే కాకుండా సరఫరా కాంట్రాక్టులు, చెల్లింపుల్లోనూ వెసులుబాట్లు కావాలని భారత్ కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు. ముడిచమురు అవసరాల్లో దాదాపు 85 శాతం భాగాన్ని భారత్ దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అలాగే 55 శాతం గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటోంది. -
పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం ఆలస్యం చమురు కంపెనీలు ఆ భారాన్ని ప్రజలపై నేరుగా మోపాయి. మంగళవారం లీటరు పెట్రోలుపై 29 పైసలు, లీటరు డీజిల్‌పై 32 పైసల వంతున ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.106.73లకు చేరుకోగా లీటరు డీజిల్ ధర రూ. 99.33గా నమోదు అయ్యింది. ఇకపై బాదుడే నవంబరు వరకు ముడి చమురు ఉత్పత్తిని పరితంగానే చేయాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ అయిల్‌కి డిమాండ్ పెరిగిపోయింది. దీంతో నవంబరు వరకు ముడి చమురు ధరలు తగ్గే అవకాశం లేదు. దీంతో మరో రెండు నెలల వరకు ప్రలజకు పెట్రో వడ్డన చేయనుంది ప్రభుత్వం. వెనువెంటనే జులై చివరి వారం నుంచి ఆగస్టు, సెప్టెంబరు వరకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. బ్రెండ్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 75 డాలర్ల నుంచి 56 డాలర్ల వరకు పడిపోయింది. ఆ సమయంలో ధరల స్థిరీకరణ పేరుతో పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించేందుకు చమురు కంపెనీలు ఆసక్తి చూపించలేదు. కంటి తుడుపు చర్యగా కేవలం రూపాయికి అటుఇటుగా పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించారు. కానీ గత వారం రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధర పెరగడం ఆలస్యం ఆ భారాన్ని వెంటనే సామాన్యులపై మోపింది ప్రభుత్వం. చదవండి : పెట్రోల్ బాదుడు.. తగ్గేదేలేదు! -
పెట్రోల్ బాదుడు.. తగ్గేదేలేదు!
ఫ్రాంక్ఫర్ట్: నవంబరు వరకు పెట్రో బాదుడు తప్పేలా లేదు. చమురు ఉత్పత్తిపై ఒపెక్ దేశాలతో పాటు వాటి మిత్ర కూటమి తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. ఫలితంగా గత వారం రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. సోమవారమయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరాయి. ఒపెక్ నిర్ణయాలు కోవిడ్ మహమ్మారి సమయంలో తగ్గిన ఉత్పత్తిని పునరుద్ధరించే క్రమంగా నెమ్మదిగా ఉండాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. దీని ప్రకారం నవంబర్‌లో రోజుకు 400,000 బారెళ్ల మేర మాత్రమే ఉత్పిత్తిని పెంచాలని ఒపెక్, ఈ కూటమి మిత్ర దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇప్పుడప్పుడే చమురు ఉత్పత్తి పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగింది. ఐనప్పటికీ గ్లోబల్ మార్కెట్లలోకి భారీ సరఫరాలను పెంచరాదని ఒపెక్ కూటమి నిర్ణయించింది. ఫలితంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్వీట్ క్రూడ్ బేరల్ ధర 3 శాతంపైగా లాభంతో 78 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 3 శాతం లాభంతో 82 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. చదవండి :పెట్రోల్ సెంచరీ..మరీ ఈవీ ఛార్జింగ్ కాస్ట్ ఎంతో తెలుసా ? -
స్థిరంగా కొనసాగుతున్న పెట్రో ధరలు, 14 రోజులుగా
దేశీయ మార్కెట్లో చమురు ధరలు 14రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు వారాల క్రితం పెరిగిన చమరు ధరలు ఆ తర్వాత నుంచి ఎలాంటి మార్పుచోటు చేసుకోలేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.05 శాతం పెరుగుదలతో 75.14 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.14 శాతం పెరుగుదలతో 73.72 డాలర్లకు చేరింది. శనివారం రోజు పెట్రోల్ ధరల వివరాలు ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఎఫెక్ట్: చమురు ధరలు తగ్గనున్నాయా?!
సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మే 3 నుంచి నేటి మధ్య కాలంలో వరుసగా 4 రోజుల పాటు పెట్రో ధరలు పెరగకపోవడం గమనార్హం. అయితే అందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగడం ఓ కారణమేనని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రోజు పెట్రోల్ ధరల వివరాలు ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది మరో వైపు త్వరలో చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 18 న జరిగిన ఒపెక్ (పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య) సమావేశంలో పెట్రోలు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు.కరోనా ఎఫెక్ట్‌తో తగ్గించిన పెట్రోలు నెల వారి ఉత్పత్తి సామార్థ్యాన్ని తిరిగి రోజుకు 400,000 బారెల్స్ పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రకటన తర్వాత ముడి ధరలు బాగా పడిపోయాయి. జులై 16న బ్యారెల్ ధర 73.59 డాలర్లు ఉండగా... జులై 19న ధర 68.62డాలర్లుగా ఉంది. ముడి చమురు ఉత్పత్తి పెరుగుతూ పోతే దేశీయంగా ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ప్రపంచ ఎకానమీ రికవరీపై ఒపెక్ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఎకానమీ మున్ముందు రికవరీ బాటన పయనిస్తుందని చమురు ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్) అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న నెలల్లో క్రమంగా చమురు ఉత్పత్తి పెంపునకు తన మిత్రదేశాలతో కలిసి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం మే నుంచి జూలై వరకూ మొత్తంగా రోజుకు 2 మిలియన్ బ్యారళ్లకుపైగా అదనపు ఉత్పత్తి జరగనుంది. దీని ప్రకారం ఉత్పత్తి మే నెల్లో రోజుకు 3,50,000 బ్యారళ్ల అదనపు ఉత్పత్తి జరుగుతుంది. జూన్ నెల్లో అదనపు ఉత్పత్తి కూడా ఇదే స్థాయిలో రోజుకు 3,50,000 బ్యారళ్లు జరుగుతుంది. జూలైలో రోజుకు 4,00,000 బ్యారళ్ల అదనపు ఉత్పత్తి అవుతుంది. దీనికితోడు సౌదీ అరేబియా రోజుకు అదనంగా ఒక మిలియన్ బ్యారళ్ల చమురు ఉత్పత్తి జరపనుంది. మార్చిలో ఒపెక్ తన ఉత్పత్తిని రోజుకు 3,00,000 బ్యారళ్ల మేర అదనంగా పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో రోజుకు సగటు ఉత్పత్తి 25.33 మిలియన్ బ్యారళ్లకు చేరింది. (ఐటీ కంపెనీల తాజా సవాల్ ఏంటంటే?) గత మార్చి సమా వేశం తరహాలోనే సరఫరాల విషయంలో ఒపెక్ జాగరూకతతో వ్యవహరించింది. ఉత్పత్తి లక్ష్యా లను భారీగా పెంచకపోవడం వల్ల స్వల్ప కాల వ్యవధిలో ధరల స్థిరీకరణ జరగవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థల రికవరీ బాగుంటుందని, ఈ నేపథ్యంలో క్రూడ్ డిమాండ్ భారీగా పెరుగుతుందని ఒపెక్ దేశాలు భావిస్తున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతి, ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకుల ఉద్దీపన చర్యలు గ్లోబల్ ఎకానమీ వృద్ధికి బాటలువేస్తాయని ఒపెక్ దేశాలు అంచనా వేస్తున్నాయి. మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారి అమెరికా రిఫైనరీలు భారీగా క్రూడ్ ప్రాసెసింగ్ చేసిన విషయాన్ని సంబంధిత వర్గాలు ప్రస్తావించాయి. -
చమురు భగభగ.. భారత్‌కు సౌదీ ఉచిత సలహా
లండన్: డిమాండ్ మరింతగా మెరుగుపడే దాకా చమురు ఉత్పత్తిపై నియంత్రణలు కొనసాగించాలని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్, దాని అనుబంధ దేశాలు భావిస్తున్న నేపథ్యంలో ముడి చమురు రేట్లు గణనీయంగా పెరుగుతున్నా యి. గురువారం 4% ఎగిసిన ధరలు శుక్రవారం మరో రెండు శాతం పైగా పెరిగాయి. 14 నెలల గరిష్ట స్థాయిని తాకాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ రేటు బ్యారెల్‌కు 2.3 శాతం దాకా పెరిగి 68.26 డాలర్లకు చేరింది. అటు నైమెక్స్ క్రూడాయిల్ ధర దాదాపు 2% పైగా పెరిగి 66.23 డాలర్ల స్థాయిని తాకింది. ఒపెక్, దాని అనుబంధ దేశాలు ఏప్రిల్‌లోనూ ఉత్పత్తి గణనీయంగా పెంచరాదని నిర్ణయించుకున్నాయి. రష్యా, కజకిస్తాన్‌లకు స్వల్ప మినహాయింపునివ్వడం తప్ప మిగతా దేశాలన్నీ కూడా ఉత్పత్తిపై నియంత్రణ కొనసాగించాలని తీర్మానించుకున్నాయి. ఒపెక్ దేశాలు కనీసం రోజుకు 15 లక్షల బ్యారెళ్ల మేర (బీపీడీ) ఉత్పత్తి పెంచుతాయని మార్కెట్ వర్గాలు భావించినప్పటికీ.. దానికి విరుద్ధంగా 1.5 లక్షల బీపీడీకి మాత్రమే ఒపెక్, అనుబంధ దేశాలు నిర్ణయించడం మార్కెట్ వర్గాలను నిరాశపర్చిందని యూబీఎస్ అనలిస్ట్ జియోవాని స్టానొవో పేర్కొన్నారు. జనవరి 2020: క్రూడ్ గరిష్ట రేటు 65.65 డాలర్లు ఏప్రిల్ 2020: క్రూడ్ కనిష్ట రేటు మైనస్ 40.32 డాలర్లు మార్చి 5 2021: క్రూడ్ గరిష్ట రేటు 66.23 డాలర్లు అంచనాల్లో సవరణలు.. ఒపెక్, అనుబంధ దేశాలు సరఫరాపై నియంత్రణలు కొనసాగించనున్న నేపథ్యంలో విశ్లేషకులు... ముడిచమురు ధరల అంచనాలను కూడా సవరించడం ప్రారంభించారు. రెండో త్రైమాసికంలో బ్రెంట్ క్రూడ్ రేటు మరో 5 డాలర్లు పెరిగి 75 డాలర్లకు (బ్యారెల్‌కు) చేరవచ్చని, మూడో త్రైమాసికానికి 80 డాలర్లకు చేరొచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో బ్రెంట్ రేటు 75 డాలర్లకు (బ్యారెల్‌కు), నైమెక్స్ క్రూడ్ 72 డాలర్లకు (బ్యారెల్‌కు) చేరొచ్చని యూబీఎస్ అంచనాలను సవరించింది. భారత్‌కు సౌదీ ఉచిత సలహా.. చమురు రేట్లను స్థిరంగా ఉంచుతామన్న హామీకి కట్టుబడి ఉండాలని, ఉత్పత్తిపై నియంత్రణలను సడలించాలని భారత్ చేసిన విజ్ఞప్తిని ఒపెక్, దాని అనుబంధ దేశాలు తోసిపుచ్చాయి. కావాలంటే గతంలో చౌకగా కొనుక్కున్న చమురును ఉపయోగించుకోవాలంటూ సౌదీ అరేబియా ఉచిత సలహా ఇచ్చింది. ఒపెక్, అనుబంధ దేశాల నిర్ణయంపై జరిగిన విలేకరుల సమావేశంలో సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్.. భారత్ విజ్ఞప్తిపై స్పందించారు. ‘భారత్ విషయానికొస్తే గతేడాది ఏప్రిల్, మే, జూన్‌లో చౌకగా కొనుగోలు చేసిన చమురును ప్రస్తుతం ఉపయోగించుకోవాలని మా మిత్ర దేశాన్ని కోరుతున్నాము‘ అని ఆయన వ్యాఖ్యానించారు. 2020 ఏప్రిల్-మే మధ్యన భారత్ 16.71 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వైజాగ్‌తో పాటు మంగళూరు, పాదూరు (కర్ణాటక)లోని వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌లలో నిల్వ చేసుకుంది. అప్పట్లో బ్యారెల్ క్రూడాయిల్ సగటున 19 డాలర్ల రేటుకే లభించింది. కేంద్రచమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలే చమురు రేట్లు ఎగియడం .. ఆర్థిక రికవరీ, డిమాండ్‌ను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత ఉత్పత్తి పెంచుతామంటూ ఒపెక్ అప్పట్లో హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్నా ఉత్పత్తి సాధారణ స్థితికి రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పెట్రో రేట్లు.. గతేడాది ఏప్రిల్–డిసెంబర్ మధ్యలో భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు సగటు రేటు బ్యారెల్‌కు 50 డాలర్ల కన్నా తక్కువే ఉన్నప్పటికీ దేశీయంగా రిటైల్ రేట్లు గరిష్ట స్థాయిలోనే కొనసాగాయి. పెట్రోల్, డీజిల్ రేట్లపై ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం పెంచుకుంటూ వస్తుండటం కూడా ఇందుకు కారణం. ప్రస్తుతం ఢిల్లీలోని రేట్ల ప్రకారం పెట్రోల్ ధరలో మూడో వంతు ఎక్సైజ్ డ్యూటీ ఉంటుండగా, డీజిల్ ధరలో 40% దాకా ఉంటోంది. దీనికి రాష్ట్రాల పన్నులూ తోడవడం రేట్లకు మరింతగా ఆజ్యం పోస్తోంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే రూ. 100 దాటేసింది. అంతర్జాతీయంగా క్రూడ్ రేట్లు ఇంకా పెరిగితే దేశీయంగా ఇంధనాల రిటైల్ రేట్లు మరింతగా ఎగిసే అవకాశం ఉంది. క్రూడ్ సెగకు కరిగిన రూపాయి 19 పైసల పతనంతో 73 దిగువకు ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, దేశీయ మార్కెట్ల తాజా బలహీన దోరణి ఎఫెక్ట్ రూపాయిపై పడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు బలహీనపడి 73.02కు బలహీనపడింది. ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.00–0.25 శాతం శ్రేణి) మరింత తగ్గబోదని అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ చైర్మన్ పావెల్ సంకేతాలు ఇచ్చారన్న విశ్లేషణలు, దీనితో ఇక ఈజీ మనీకి ముగింపు పలికినట్లేనన్న అంచనాలు, వ్యాక్సినేషన్ నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి సంకేతాల నేపథ్యంలో డాలర్ ఇండెక్స్ మూడు నెలల గరిష్టానికి (91.94) చేరింది. -
మూడు నెలల గరిష్టానికి చమురు
బుధవారం చమురు ధరలు మూడు నెలల గరిష్టానికి చేరాయి. కోవిడ్ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం నెమ్మదిగా కోలుకుంటుండడం, ప్రధాన ఆయిల్ ఉత్పత్తి దారులు ప్రొడక్షన్లో కోతవిధిస్తారని ఇన్వెస్టర్లు భావిస్తుండడంతో చమురు ధరలు మూడు నెలల గరిష్ట స్థాయికి పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 1 శాతం పెరిగి 39.79 డాలర్ల ట్రేడ్ అవుతోంది.మార్చి 6 తరువాత ఇది గరిష్టం కాగా, నిన్న(మంగళవారం) 3.3శాతం పెరిగింది.అమెరికా టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్(డబ్ల్యూటీఐ) కూడా 1 శాతం పెరిగి 37.14 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మార్చి6 తరువాత గరిష్టస్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. కాగా డబ్ల్యూటీఐ మంగళవారం 4 శాతం పెరిగింది. వైరస్ పుట్టిన చైనాలో పరిశ్రమలు తిరిగి తెరుచుకోవడంతో బెంచ్‌మార్క్‌లు ఏప్రిల్ కనిష్టాలనుంచి పుంజుకుని రెండు వారాలుగా ర్యాలీ చేస్తున్నాయి. ఇతర ఆర్థిక వ్యవస్థలు సైతం నెమ్మదిగా ప్రారంభమతున్నాయి .దీంతో ఆయిల్‌కు డిమాండ్ పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్సోపోర్టింగ్ కంట్రీస్(ఒపెక్), రష్యాలు ప్రపంచ ఉత్పత్తిలో 10 శాతానికి సమానమై రోజుకి 9.7 మిలియన్ల బ్యారెల్ ఉత్పత్తి కోతను జూలై, ఆగస్టు వరకు పొడిగించవచ్చని తెలుస్తోంది. క్రూడ్ ఉత్పత్తిలో కోతలపై ఒపెక్‌తో పాటు వివిధ దేశాలు గురువారం ఆన్లైన్ సమావేశాన్ని నిర్వహించనున్నాయి. ప్రస్తుతం ఉత్పత్తి కోతలు మే నుంచి జూన్ వరకు కొనసాగే అవకాశం ఉంది. జూలై నుంచి డిసెంబర్ మధ్యలో కోతలను 7.7 మిలియన్ల బీపీడి తగ్గించవచ్చని భావిస్తున్నారు. కానీ సౌదీ అరేబియా మాత్రం మరికొంత ఎక్కువ కాలం కోత విధించాలని భావిస్తోంది. -
వారికి థ్యాంక్స్ చెప్పిన ట్రంప్
వాషింగ్టన్: అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోకుండా ఉత్పత్తి కొనసాగేలా ఒప్పందం కుదుర్చుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా తగ్గిన డిమాండ్, పోటీ పడి సౌదీ అరేబియా, రష్యా చమురు ధరలను తగ్గించాయి. దీంతో అమెరికా చమురు కంపెనీలు భారీ నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ జోక్యంతో పెట్రోలియం ఉత్పత్తి దేశాల సమాఖ్య(ఒపెక్, రష్యా) ఉత్పత్తిని తగ్గించుకునేందుకు అంగీకరించాయి. ఇందుకు సహకరించినందుకు సౌదీ అరేబియా, రష్యా ప్రభుత్వాధినేతలకు ఫోన్ చేసి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో స్థిరత్వం వస్తుందన్నారు. అవన్నీ నకిలీ వార్తలు: ట్రంప్ ఆగ్రహం -
పెట్రో ధరలు: ఒపెక్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. వెంటనే ధరలను తగ్గించాలంటూ ఒపెక్ దేశాలకు తాజా హెచ్చరిక జారీ చేశారు. ఆయిల్ ఎగుమతిదారుల కార్టెల్ క్రూడ్ ధరలను తగ్గించాలంటూ గురువారం ట్విటర్లో ఒక ప్రకటన జారీ చేశారు. మధ్యప్రాచ్య దేశాలకు తామే సైనిక రక్షణ అందిస్తున్నామనీ, ఇది కొనసాగాలంటే ధరల పెరుగుదల ఎంతమాత్రం మంచికాదన్నారు. ముడి చమురు ధరల పెరుగుదలకు ఒపెక్ దేశాల గుత్తాధిపత్యమే కారణమంటూ ట్రంప్ మరోసారి కన్నెర్రజేశారు. ఈ తరుణంలో ధరలు తగ్గించడం అవసరమని పేర్కొన్నారు. మధ్యప్రాచ్య దేశాలను మేం కాపాడుతున్నాం. తాములేకుండా ఎంతోకాలం సురక్షితంగా ఉండలేరు. ధరలు ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. దీన్ని మేం గుర్తు పెట్టుకుంటామంటూ ట్వీట్ చేశారు. ట్రంప్ ట్వీట్ తరువాత యుఎస్ బెంచ్ మార్కు ఫ్యూచర్స్ ధరలు కొద్దిగా పడిపోయాయి. దీంతో 70 డాలర్లను అధిగమించిన బ్యారెల్ ధర గురువారం 0.2 శాతం నష్టపోయింది. కాగా ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోకుండా ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు అలాగే ఉత్పత్తిని పెంచాల్సిందిగా మిత్రదేశం సౌదీసౌదీ అరేబియాను అమెరికా కోరింది. ఒపెక్ వ్యవస్థాపక సభ్యులైన ఇరాన్, వెనిజులా కూడా ఆంక్షలు విధించింది. దీంతో అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకారం, జులై 2016 ఇరాన్ ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిని నమోదు చేసింది. నవంబరు 4న ఇస్లామిక్ రిపబ్లిక్ చమురు పరిశ్రమను దెబ్బతీసేందుకు కూడా కొత్త ఆంక్షలు విధించింది అమెరికా. ఒపెక్ దేశాల ఈ ఆధిపత్యాన్ని తగ్గించాలనే ఆలోచనలతో ఆమెరికా షేల్‌గ్యాస్ ఉత్పత్తిని పెంచి, ఆయిల్ దిగుమతులను తగ్గించుకుంది. దీంతో ఆయిల్ ధరలు తగ్గడంతో అమెరికా కుయుక్తులను దెబ్బతీసేందుకు ఒపెక్ దేశాలు కూడా ఆయిల్ ఉత్పత్తులను తగ్గించాయి. ప్రధానంగా 2014లో చమురు ధరలు కుప్పకూలిన నేపథ్యంలో 2016లో ప్రధాన చమురు ఉత్పత్తి సంస్థలన్నీ ( ఒపెక్, నాన్-ఒపెక్ దేశాలు) ఉత్పత్తిని తగ్గించేందుకు అంగీకరించాయి. మరోవైపు సౌది అరేబియా ఇరాన్‌లు, రష్యాలాంటి నాన్ ఒపెక్దేశాలతో భేటీ కానున్నాయి. ఉత్పత్తి స్థాయిలపై చర్చించనున్నాయి. నవంబరులోజరగనున్న అమెరికా మిడ్ టెర్మ్ ఎన్నికలకు మందు ఆదే చివరి సమావేశం. We protect the countries of the Middle East, they would not be safe for very long without us, and yet they continue to push for higher and higher oil prices! We will remember. The OPEC monopoly must get prices down now! — Donald J. Trump (@realDonaldTrump) September 20, 2018 -
ఒపెక్ దృష్టికి అధిక ధరల అంశం
న్యూఢిల్లీ: పెట్రోలియంపై ఆసియా దేశాల నుంచి అధిక ధరలను వసూలు చేస్తున్న అంశాన్ని ఒపెక్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ శానుసి బక్రిండో దృష్టికి పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీసుకెళ్లారు. భారత పర్యటనకు వచ్చిన బక్రిండోతో ప్రధాన్ మంగళవారం భేటీ అయి పలు విషయాలపై చర్చించారు. ఆసియా దేశాల నుంచి ప్రీమియం ధరలను ఒపెక్ సభ్య దేశాలు వసూలు చేస్తున్నాయంటూ మన దేశం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఒపెక్ చమురు ఉత్పత్తికి కోత విధించడం వల్ల అస్థిరతలు అధికం కావడం, ధరలు పెరగడం వల్ల భారత్‌పై పడే ప్రభావాన్ని పెట్రోలియం మంత్రి వివరించారు. ఆసియాలో ప్రీమియం ధరల అంశంపైనా తగినంత చర్చించినట్టు, భారత్ తరహా దేశాలకు వాస్తవిక ధరలు ఉండాలన్న అంశాన్ని గుర్తు చేసినట్టు పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. చమురు అవసరాల్లో మన దేశం 80 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. దేశీయ అవసరాల్లో ముడి చమురు 86 శాతం, సహజ గ్యాస్ 75 శాతం, ఎల్పీజీ 95 శాతాన్ని ఒపెక్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవలి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దేశీయంగానూ వాటి ధరలు గరిష్ట స్థాయిలకు చేరాయి. -
చమురు ఉత్పత్తి కోత.. మరో 9 నెలలు
ఒపెక్ దేశాల నిర్ణయం న్యూఢిల్లీ: అధిక సరఫరా సమస్యను అధిగమించే దిశగా చమురు ఉత్పత్తిలో కోతను మరో తొమ్మిది నెలల పాటు కొనసాగించాలని క్రూడ్ ఉత్పత్తి దేశాల సమాఖ్య ఒపెక్, ఇతర దేశాలు నిర్ణయించాయి. ఒపెక్‌లోని సభ్య దేశాలతో పాటు రష్యా తదితర దేశాలు కూడా మార్చి దాకా కోతలను పొడిగించేందుకు అంగీకరించినట్లు ఇరాన్ పెట్రోలియం శాఖ మంత్రి బిజాన్ నామ్దర్ జాంగ్నె వెల్లడించారు. ఉత్పత్తిని తగ్గించడం నుంచి నైజీరియా, లిబియాకు మినహాయింపు ఉంటుంది. అలాగే ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరాన్ యథాపూర్వ ఉత్పత్తి స్థాయినే కొనసాగిస్తుందని బిజాన్ తెలియజేశారు. ఒపెక్‌లో సభ్యత్వం లేని ఇతర దేశాలేవీ కొత్తగా ఈ ఒప్పందంలో చేరబోవడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. చమురు సరఫరా పెరిగిపోయి ధర భారీగా పతనమైన నేపథ్యంలో ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఆ తర్వాత డిసెంబర్లో మరో 11 ఇతర దేశాలు కూడా ఈ డీల్‌లో భాగం కావడంతో మొత్తం ఉత్పత్తిలో కోత 1.8 మిలియన్ బ్యారెళ్లకు పెరిగింది. ఇది జనవరి నుంచి 6 నెలల పాటు అమల్లో ఉండాలి. దీనితో చమురు రేట్లు పెరిగినప్పటికీ.. అమెరికా నుంచి షేల్ గ్యాస్ ముంచెత్తడంతో నిల్వలు పెరిగి ధరల జోరు తగ్గింది. అయితే మూడేళ్ల పాటు అధిక ఉత్పత్తి కారణంగా పేరుకుపోయిన నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయని, అయినప్పటికీ ఈ ఏడాది ఆఖరు నాటిదాకా ఖాళీ కావని ఒపెక్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఒపెక్‌తో పాటు ఇతర దేశాలు కూడా మార్చ్ దాకా ఉత్పత్తి కోత నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి. ఉత్పత్తి కోత మరింత పెరుగుతుందన్న అంచనాలకు భిన్నంగా యథాతథ స్థితిని కొనసాగించాలని ఒపెక్ దేశాలు నిర్ణయించటంతో.. మార్కెట్ వర్గాలు ప్రతికూలంగా స్పందించాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఒక దశలో 3.7 శాతం క్షీణించి 52.42 డాలర్ల వద్ద, నైమెక్స్ క్రూడ్ 4 శాతం తగ్గి 49.28 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. -
ఓపెక్ సభ్యుల సంచలన నిర్ణయం
వియన్నా : ఓపెక్ సభ్యులు 2008 తర్వాత మొదటిసారి చమురు ఉత్పత్తిలో కోత విధించేందుకు అంగీకరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేడు జరిగిన ఓపెక్ సభ్యుల ప్రధాన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు రాయిటర్స్‌కు వెల్లడించాయి. చమురు మార్కెట్‌ను సమతుల్యం పరచడానికి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులందరూ కలిసి ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తివివరాలు ఇంకా వెల్లడికాలేదు. ప్రతి సభ్యులు ఏ మేరకు ఉత్పత్తిలో కోత విధించాలనే విషయంపై వియన్నాంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఓపెక్ సభ్యులు నిర్ణయం వెలువడగానే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు ఒక్కసారిగా 8 శాతానికి పైగా ఎగిశాయి. జనవరి నెల బ్రెండ్ క్రూడ్ ఫ్యూచర్స్ 8.3 శాతం పెరిగి బ్యారల్‌కు 50.214 డాలర్లుగా నమోదయ్యాయి. కాగ మంగళవారం ఈ ధరలు కనీసం 4 శాతం పడిపోయిన సంగతి తెలిసిందే. చమురు మార్కెట్‌ను పునరుద్ధరించడానికి ఉత్పత్తిలో కోత విధించాల్సినవసరమేముందని సౌదీ లీడర్లు వాదించారు. కానీ ఆఖరికి సౌదీ కూడా ఉత్పత్తిలో కోత విధించేందుకు సమ్మతించినట్టు తెలిసింది. చమురు ఉత్పత్తి కోత ప్రకటనలతో డాలర్ ట్రెండ్ రివర్స్ అవనుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అమెరికా ఎన్నికల తర్వాత శరవేగంగా దూసుకెళ్తున్న డాలర్‌కు బ్రేక్‌లు పడనున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఓపెక్ సభ్యుల ఉత్పత్తిలో కోత నిర్ణయం విఫలమై ఉండి ఉంటే, చమురు ఉత్పత్తి ధరలు బ్యారల్‌కు 40 డాలర్ల కంటే కిందకి దిగొచ్చేవని పలువురు విశ్లేషకులు చెప్పారు.