ఓపెక్ సభ్యుల సంచలన నిర్ణయం
ఓపెక్ సభ్యుల సంచలన నిర్ణయం
Published Wed, Nov 30 2016 8:18 PM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM
వియన్నా : ఓపెక్ సభ్యులు 2008 తర్వాత మొదటిసారి చమురు ఉత్పత్తిలో కోత విధించేందుకు అంగీకరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేడు జరిగిన ఓపెక్ సభ్యుల ప్రధాన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు రాయిటర్స్కు వెల్లడించాయి. చమురు మార్కెట్ను సమతుల్యం పరచడానికి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులందరూ కలిసి ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తివివరాలు ఇంకా వెల్లడికాలేదు. ప్రతి సభ్యులు ఏ మేరకు ఉత్పత్తిలో కోత విధించాలనే విషయంపై వియన్నాంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఓపెక్ సభ్యులు నిర్ణయం వెలువడగానే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు ఒక్కసారిగా 8 శాతానికి పైగా ఎగిశాయి.
జనవరి నెల బ్రెండ్ క్రూడ్ ఫ్యూచర్స్ 8.3 శాతం పెరిగి బ్యారల్కు 50.214 డాలర్లుగా నమోదయ్యాయి. కాగ మంగళవారం ఈ ధరలు కనీసం 4 శాతం పడిపోయిన సంగతి తెలిసిందే. చమురు మార్కెట్ను పునరుద్ధరించడానికి ఉత్పత్తిలో కోత విధించాల్సినవసరమేముందని సౌదీ లీడర్లు వాదించారు. కానీ ఆఖరికి సౌదీ కూడా ఉత్పత్తిలో కోత విధించేందుకు సమ్మతించినట్టు తెలిసింది. చమురు ఉత్పత్తి కోత ప్రకటనలతో డాలర్ ట్రెండ్ రివర్స్ అవనుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అమెరికా ఎన్నికల తర్వాత శరవేగంగా దూసుకెళ్తున్న డాలర్కు బ్రేక్లు పడనున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఓపెక్ సభ్యుల ఉత్పత్తిలో కోత నిర్ణయం విఫలమై ఉండి ఉంటే, చమురు ఉత్పత్తి ధరలు బ్యారల్కు 40 డాలర్ల కంటే కిందకి దిగొచ్చేవని పలువురు విశ్లేషకులు చెప్పారు.
Advertisement