పాక్‌కు ఎఫ్-16 విమానాలు ఇవ్వొద్దు | Dont give F-16 aircraft to Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌కు ఎఫ్-16 విమానాలు ఇవ్వొద్దు

Published Sat, Feb 27 2016 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

Dont give F-16 aircraft to Pakistan

అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం

 వాషింగ్టన్: పాక్‌కు ఎఫ్-16 యుద్ధవిమానాలు సహా ఆయుధాలేవీ విక్రయించవద్దంటూ అమెరికా ప్రతినిధుల సభలో పలువురు సభ్యులు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలను పాక్ తమ పౌరులపైనే, ముఖ్యంగా బెలూచిస్తాన్ ప్రాంతవాసులపై వినియోగిస్తోందని ఆరోపించారు.  

విక్రయాన్ని అడ్డుకోవాలంటూ రిపబ్లికన్ పార్టీ మాజీ అధ్యక్ష అభ్యర్థి రాండ్ పాల్ ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమెరికాలో ఉగ్రదాడులకు పాల్పడిన లాడెన్‌ను పట్టుకోవడానికి సహకరించిన పాకిస్తానీ షకీల్ అఫ్రీదిని పాక్ వేధిస్తోందని ప్రతినిధుల సభ సభ్యుడు రోహ్రబాచర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement