టోక్యో: ఆఫీసులో కునుకు తీస్తున్నారంటే అది గవర్నమెంట్ ఆఫీసై ఉంటుందంటూ చమత్కరిస్తారు. ఇందులో నిజం కూడా లేకపోలేదు. మనదేశంలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా ఆఫీసర్లు కునుకు తీస్తున్న, ముచ్చట్లు చెప్పుకుంటున్న దృశ్యాలు కనిపిస్తాయి. అయితే జపాన్ మాత్రం ఇందుకు భిన్నం. అక్కడ వారికి పనే ప్రపంచం. కనీసం నిరసన తెలపాలన్నా కూడా అక్కడివారు ఆందోళనలకు బదులుగా ఎక్కువ పనిచేసి, నిరసన తెలుపుతారట. దీంతో అక్కడి ప్రభుత్వం కార్యాలయాల నుంచి ఉద్యోగులను ఇంటికి పంపడానికి డ్రోన్లను రంగంలోకి దించింది.
టైం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆఫీసులోనే ఉంటూ పనిచేస్తుంటే ఈ డ్రోన్ పసిగట్టేస్తుంది. డ్రోన్ కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు పరిశీలించి, సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నారు. జపాన్ చట్టాల ప్రకారం ఓ ఉద్యోగి నెలలో 100 గంటలకు మించి పని చేయకూడదు. కానీ జపాన్ మాత్రం తీవ్రమైన ‘కరోషి’ సమస్యతో బాధపడుతోందట. కరోషీ అంటే పనిచేస్తూ ఆఫీస్‌లోనే చనిపోవడం. దీనికి పరిష్కారంగానే డ్రోన్లను రంగంలోకి దించి, ఉద్యోగులను వేళకు ఇంటికి పంపేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment