స్నోడెనా మజాకా..
న్యూయార్క్: వరదలా వచ్చిపడుతున్న ఈమెయిల్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్తో సీఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ట్విట్టర్ నోటిఫికేషన్స్ వరదలా వచ్చిపడుతుండటంతో తనకు ఏమి తోచడం లేదని స్నోడెన్ పేర్కొన్నాడు. అతని ట్విట్టర్ ఖాతాలో 12.6 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. గత వారం స్నోడెన్ చేసిన తొలి ట్వీట్ 'కెన్ యూ హియర్ మి నౌ'ను 1.2 లక్షల రీట్వీట్ చేశారంటే అతని ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవచ్చు.
నోటిఫికేషన్స్ టర్న్ ఆఫ్ చేయడం మరిచిపోవడంతో తన ట్విట్టర్ ఖాతాకి 47 గిగాబైట్ డాటా వచ్చి చేరిందని ఎడ్వర్డ్ స్నోడెన్ ట్వీట్ చేశాడు. ప్రతి నోటిఫికేషన్కి తనకు ఓ అప్డేట్ వచ్చిందని పోస్ట్ చేశాడు. ఖాతా ప్రారంభించిన తొలిరోజే అధిక ఫాలోయర్స్ను సంపాదించుకున్న వ్యక్తుల్లో ఒకరిగా స్నోడెన్ నిలిచిన విషయం విదితమే. ట్విట్టర్ అకౌంట్ స్నోడెన్ ఓపెన్ చేసి ఇంకా వారం రోజులు కూడా కాలేదు. తన ఫాలోయర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి స్నోడెన్ అశ్చర్యానికి లోనవుతున్నాడు.
I forgot to turn off notifications. Twitter sent me an email for each: Follow Favorite Retweet DM 47 gigs of notifications. #lessonlearned
— Edward Snowden (@Snowden) October 1, 2015