ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మోర్సీకి 40 ఏళ్ల జైలు శిక్ష
కైరో: గూఢచర్యం కేసులో ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీకి ఆ దేశ కోర్టు శనివారం జీవిత ఖైదు విధించింది. సహ నిందితులైన మరో ఆరుగురికి మరణశిక్ష వేసింది. సైనిక నిఘా సంబంధ అధికార రహస్యాలను ఖతర్‌కు, దోహాలోని ఓ టీవీ నెట్‌వర్క్‌కు మోర్సీ, ఇతర నిందితులు అందజేశారన్న ఆరోపణలపై విచారణ జరిపిన కైరో క్రిమినల్ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. మరో ఇద్దరికి సైతం జీవిత ఖైదు పండింది. వీరికి 25 ఏళ్ల చొప్పున(జీవిత ఖైదు) జైలుశిక్ష విధించింది.
దేశ భద్రతకు సంబంధించిన పత్రాల చౌర్యానికి పాల్పడ్డారంటూ మోర్సీకి అదనంగా 15 ఏళ్ల జైలుశిక్షను విధించింది. ఈజిప్ట్ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు మోర్సీ. 2012 నుంచి 2013 జూలై మధ్యకాలంలో అధ్యక్షునిగా కొనసాగారు.