ప్రమాదంలో సనా సిటీ
అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారసత్వ నగరాల జాబితాలో యెమెన్ రాజధాని సనా చేరింది. ప్రభుత్వ అనుకూల బలగాలకు, షియా (హుతీ) తిరుగుబాటుదారులకు మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో సనా సిటీని ఈ జాబితాలో చేర్చినట్లు ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) జూలై 3న పేర్కొంది. రెండున్నర వేల ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన సనా నగరం 7,8 శతాబ్దాల్లో ముఖ్యమైన ఇస్లామిక్ కేంద్రంగా విలసిల్లింది. పదకొండో శతాబ్దానికి పూర్వమే ఇక్కడ 103 మసీదులు, ఆరువేలకు పైగా ఇళ్లు ఉన్నాయి.