12 లక్షల కోట్లు దాటిన ఫేస్బుక్ విలువ | Facebook's market value tops 200 billion dollars | Sakshi
Sakshi News home page

12 లక్షల కోట్లు దాటిన ఫేస్బుక్ విలువ

Published Tue, Sep 9 2014 10:43 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

12 లక్షల కోట్లు దాటిన ఫేస్బుక్ విలువ - Sakshi

12 లక్షల కోట్లు దాటిన ఫేస్బుక్ విలువ

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ మార్కెట్ విలువ 12.05 లక్షల కోట్లు దాటిపోయింది. దాంతో ప్రపంచంలోనే 22వ అతిపెద్ద కంపెనీగా ఫేస్బుక్ అవతరించింది. దాంతో కంపెనీ షేర్లు సోమవారం నాడు అత్యధికంగా 77.6 డాలర్ల వద్ద ముగిసింది. ఆది అల్ టైం హై అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇన్స్టాగ్రామ్ లాంటి ఫొటో షేరింగ్ సైట్లు, వాట్స్ యాప్ లాంటి మొబైల్ మెసేజింగ్ సర్వీసులను టేకోవర్ చేయాలని ఫేస్బుక్ నిర్ణయించుకున్నా, ఇంకా చేయలేదు. అది కూడా అయితే దీని విలువ మరింత పెరిగిపోతుందని అంటున్నారు.

దీంతో ఫేస్బుక్ షేరుకు, ఆ కంపెనీకి బంగారు భవిష్యత్తు ఉందన్నది మార్కెట్ వర్గాల విశ్లేషణ. త్వరలోనే యూజర్ల న్యూస్ ఫీడ్లలో కొన్ని వీడియో యాడ్లు పెట్టాలని కూడా భావిస్తోంది. ఇది కూడా జరిగితే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం మరింత పెరుగుతుంది. ఇటీవలే వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ తయారీ కంపెనీ ఆక్యులస్ వీఆర్ను రెండు బిలియన్ల డాలర్లు పెట్టి ఫేస్బుక్ కొనుగోలు చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement