బంపర్ ఆఫర్.. పెళ్లాడితే రూ. 830 కోట్ల కానుక | Father offers 830 crores marriage bounty for lesbian daughter | Sakshi
Sakshi News home page

బంపర్ ఆఫర్.. పెళ్లాడితే రూ. 830 కోట్ల కానుక

Published Fri, Jan 24 2014 4:44 PM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

Father offers 830 crores marriage bounty for lesbian daughter

హాంకాంగ్: ఔత్సాహికులైన యువకులకు బంపర్ ఆఫర్. ఆ ఆమ్మాయిని పెళ్లాడితే ఏకంగా 830 కోట్ల రూపాయిలు కానుకగా ఇస్తారు. హాంకాంగ్కు చెందిన ఓ బిలీయనీర్ ఈ ఆఫర్ ఇస్తున్నారు. కాకపోతే ఆ ఆమ్మాయి స్వలింగ సంపర్కురాలు. చిక్కంతా ఇక్కడే ఉంది.

షిప్పింగ్ మ్యాగ్నెట్ సెసిల్ చావో జి ట్సుంగ్ తన కుమార్తెకు వివాహం చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆయన కుమార్తె స్వలింగ సంపర్కురాలు కావడమే దీనికి కారణం. తన కుమార్తెను పెళ్లి చేసుకునే వారికి దాదాపు 400 కోట్ల రూపాయిలు ఇస్తానని 2012 సెప్టెంబర్లో తొలుత ప్రకటించారు. అయినా  ఎవరూ ముందుకు రాకపోవడంతో తాజాగా ఆ మొత్తాన్ని రెట్టింపు చేశారు. తనకు కాబోయే అల్లుడు విలాసవంతమైన జీవితం గడిపేలా భారీ మొత్తంతో పాటు సకల సౌకర్యాలూ కల్పిస్తానని చెబుతున్నారు. కాగా సెసిల్ తనయ ఎప్పుడో మరొకరి జీవితంలోకి ప్రవేశించింది. గత తొమ్మిదేళ్లుగా మరో అమ్మాయితో కలసి సహజీవనం సాగిస్తోంది. సెసిల్ తన వ్యాపార బాధ్యతల్ని కుమార్తెకు అప్పగించాలని తొలుత భావించారు. ఆమె పెళ్లి చేసుకోకపోతే ఇద్దరు కుమారులకు ఇవ్వాలని ప్రస్తుతం ఆలోచిస్తున్నారు.

తన కుమార్తె మనసు మారుతుందని సెసిల్ విశ్వాసంతో ఉన్నారు. ఆమె పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలన్నది ఆయన కోరిక. సెసిల్ కంపెనీకి ఆమె ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. కాగా తనయ ఆలోచన మాత్రం మరోలా ఉంది. భారీ ఆఫర్ చూపి వరుడ్ని ఆకర్షించలేమని చెబుతోంది. ఈ విషయం పత్రికల వారితో చెప్పొద్దని ఆమె తండ్రిని కోరుతోంది. ఆమె గేల హక్కుల కోసం కృషి చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement