lesbian daughter
-
స్వలింగ సంపర్కురాలి నుంచి కుమార్తెను రక్షించండి
సాక్షి, చెన్నై(తమిళనాడు): స్నేహం పేరుతో తన కుమార్తెను స్వలింగ సంపర్కానికి ప్రేరేపిస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలని చెన్నై తిరుమంగళం పోలీసుస్టేషన్లో ఓ యువతి తండ్రి మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మదురై జిల్లాకు చెందిన ఆనంద్ (44) చెన్నైలో ఇతని కుమార్తె తన బంధువు ఇంటిలో బస చేసి వుంది. అదే ప్రాంతానికి చెందిన మరో యువతితో స్వలింగ సంపర్కానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో ఆమెను రక్షించాలని కోరుతూ మంగళవారం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అందులో తన కుమార్తె(17) చదువు సరిగా రాలేదని దీంతో చెన్నై సైదాపేటలోని బంధువుల ఇంటిలో ఉంచినట్లు తెలిపారు. అక్కడ ఆమె గత కొన్ని నెలలుగా నుంగంబాక్కంలోని ఒక ప్రైవేటు శిక్షణ కేంద్రంలో దుస్తుల తయారీ నేర్చుకుంటోందన్నారు. ఈ సమయంలో అక్కడున్న మరో యువతితో తన కుమార్తెకు స్వలింగ సంపర్క సంబంధం ఏర్పడినట్లు తెలిసింది. దీంతో ఆమె గత కొన్ని రోజుల క్రితం సైదాపేట బంధువుల ఇంటి నుంచి అదృశ్యమైందన్నారు. ఆమె కోసం గాలిస్తున్న స్థితిలో అన్నానగర్ వెస్ట్ ప్రాంతంలోని ఒక సంస్థలో కౌన్సెలింగ్ పొందుతున్నట్లు తాజాగా తెలిసింది. గత కొన్ని రోజుల క్రితం ఆ సంస్థతో తన కుమార్తెను పంపాలని కోరినా వారు నిరాకరించారన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకొని తన కుమార్తెను రక్షించాలని కోరారు. తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేసి బాలికతో సంబంధమున్న మరో యువతిని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. -
నాన్నా.. నాకు పెళ్లొద్దు!
వయసొచ్చిన ఏ యువతి అయినా కన్నవాళ్లను ఏం కోరుతుంది. తనకు తగిన వరుణ్ని చూసి పెళ్లి చేసి అత్తవారింటికి పంపమని అడుగుతుంది. అయితే హాంకాంగ్‌కు చెందిన అపరకుబేరుడు సెసిల్ చావో జెట్సుంగ్ కుతూరు జిగీచావో మాత్రం ఇందుకు భిన్నం. అసలు తనకు పెళ్లే వద్దంటోంది. మగాళ్ల మాట ఎత్తితే మండిపడుతోంది. తాను స్వలింగ స్వలింగ సంపర్కురాలినని చెప్పి తండ్రికి షాక్ ఇచ్చింది. అంతటితో ఆగకుండా తండ్రికి కన్నీటితో బహిరంగ లేఖ రాసింది. తనను లెబ్సియన్గా అంగీకరించాలని ప్రాధేయపడింది. తాను సహజీవనం సాగిస్తున్న సియన్ ఈవ్‌ను సాధారణ భాగస్వామిగా గుర్తించాలని, మామూలుగా మనిషిగా గౌరవించాలని ఆమె విన్నవించింది. 'ఈ విషయాన్ని జీర్ణించుకోవడం మీకు కష్టమని నాకు తెలుసు. ఇద్దరు అమ్మాయిల మధ్య ఆకర్షణ ఎలా సాధ్యమని మీరనుకోవచ్చు. దీని గరించి ప్రత్యేకంగా వివరించలేను. మా ఇద్దరి మధ్య బంధంగా మామూలుగానే ఏర్పడింది' అని తండ్రికి రాసిన లేఖలో జిగీచావో పేర్కొంది. గత తొమ్మిదేళ్లుగా సియన్ ఈవ్‌తో ఆమె సహజీవనం చేస్తోంది. 2012లో ఫ్రాన్స్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. జిగీచావోను లెస్బియన్‌గా గుర్తించేందుకు తన తండ్రి నిరాకరించిన నేపథ్యంలో ఆమె ఈ లేఖ రాసింది. కూతురు మనసు ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. జిగీచావోను పెళ్లికి ఒప్పిస్తే 830 కోట్ల రూపాయిలు కానుకగా ఇస్తానని ఈ హాంకాంగ్ బిలీయనీర్ ప్రకటించాడు. రెండేళ్ల క్రితం రూ.400 కోట్లు ఆఫర్ చేసినా.. ఒక్కరు కూడా పెళ్లికి ముందుకు రాకపోవడంతో ఈ మొత్తాన్ని రెట్టింపు చేశాడు. తనపై 'ఆఫర్' ప్రకటించిన తండ్రిని క్షమించినట్టు 33 ఏళ్ల జిగీచావో వెల్లడించింది. తన మంచి కోరే ఆయన ఇదంతా చేశారని పేర్కొంది. అయితే హాంగ్‌కాంగ్‌లో తనకు తగిన వ్యక్తి తారసపడలేదని తెలిపింది. చాలా మంది మంచివాళ్లు ఉన్నా తనకు ఎవరూ నచ్చలేదని నిక్కచ్చిగా చెప్పేసింది. తానేలావుంటే సంతోషంగా ఉంటానో తన తండ్రి గుర్తించకపోవడం పట్ల జిగీచావో ఆవేదన వ్యక్తం చేసింది. తన ఆలోచనా విధానాలను తండ్రి పంచుకోలేకపోయారని వాపోయింది. హాంగ్‌కాంగ్ సంపనుల్లో ఒకరయిన 77 ఏళ్ల సెసిల్ చావో జెట్సుంగ్ తరచుగా ప్రచారంలో ఉంటుంటారు. తాజాగా ఆయన తన యువ ప్రియురాలతో పార్టీల్లో కన్పిస్తున్నారు. ఇప్పటివరకు 10 వేల మంది మహిళలతో గడిపినట్టు ఆయనో సందర్భంగా వెల్లడించారు. ఇదిలావుంటే హాంగ్‌కాంగ్‌లో హాట్ టాఫిక్‌గా మారిన ఈ స్టోరీతో సినిమా తీసేందుకు బ్రిటీష్ దర్శకుడు సచా బారోన్ కొహెన్ సిద్ధమవుతున్నారు. -
అన్నీఉన్నా అల్లుడు లేడు...!
-
అన్నీఉన్నా అల్లుడు లేడు...!
పెళ్లి చేసుకోవడానికి తగిన అమ్మాయి దొరకడం లేదని బాధపడుతున్న యువకులకు బంపర్ ఆఫర్. పెళ్లి చేసుకుంటే పిల్లతో పాటు వందల కోట్లు పొందే సువర్ణ అవకాశం. ఆ ఆమ్మాయిని పెళ్లాడితే ఏకంగా 830 కోట్ల రూపాయిలు కానుకగా ఇస్తారు. హాంకాంగ్‌కు చెందిన ఓ బిలీయనీర్ ఈ ఆఫర్ ఇస్తున్నారు. హాంకాంగ్‌కు చెందిన ఈ అపరకుబేరుడి పేరు సెసిల్ చావో జెట్సుంగ్. పాపం..తన కూతురు(జిగీచావో) పెళ్లి కోసం నానా కష్టాలు పడుతున్నాడు. దేశంలోనే అత్యంత ధనవంతుడైనా కూడా అల్లుడిని మాత్రం తెచ్చుకోలేకపోతున్నాడు. అందుకే తన కూతురును పెళ్లి చేసుకుంటే రూ.830 కోట్లు ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. గతంలో కూడా రూ.400 కోట్లు ఆఫర్ చేసినా..ఒక్కరు కూడా పెళ్లికి ముందుకు రాలేదు. అందుకే ఈ సారి కట్నం రెట్టింపు చేశాడు. కాగా సెసిల్ కూతురు గతంలోనే ఒకరి జీవితంలో ప్రవేశించింది. అయితే.. ఆమె జీవితం పంచుకున్నది అబ్బాయితో కాదు అమ్మాయితో. సింపుల్‌గా చెప్పాలంటే సెసిల్ కూతురు స్వలింగ సంపర్కురాలు. గత తొమ్మిదేళ్లుగా ఆమె మరో అమ్మాయితో కలసి సహజీవనం సాగిస్తోంది. సెసిల్ కూతురు లెస్బియన్ కావడంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదీ అసలు స్టోరీ. కుమార్తె పెళ్లి చేసుకొని పిల్లలను కనాలన్నది సెసిల్ కోరిక. అయితే.. సెసిల్ కూతురి ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నాయి. భారీ ఆఫర్ చూపి వరుడ్ని ఆకర్షించలేమని చెబుతోంది. సెసిల్ మాత్రం కూతురి మనసు మారుతుందని విశ్వాసంతో ఉన్నారు. చూద్దాం ఇద్దరిలో ఎవరు గెలుస్తారో. -
బంపర్ ఆఫర్.. పెళ్లాడితే రూ. 830 కోట్ల కానుక
హాంకాంగ్: ఔత్సాహికులైన యువకులకు బంపర్ ఆఫర్. ఆ ఆమ్మాయిని పెళ్లాడితే ఏకంగా 830 కోట్ల రూపాయిలు కానుకగా ఇస్తారు. హాంకాంగ్‌కు చెందిన ఓ బిలీయనీర్ ఈ ఆఫర్ ఇస్తున్నారు. కాకపోతే ఆ ఆమ్మాయి స్వలింగ సంపర్కురాలు. చిక్కంతా ఇక్కడే ఉంది. షిప్పింగ్ మ్యాగ్నెట్ సెసిల్ చావో జి ట్సుంగ్ తన కుమార్తెకు వివాహం చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆయన కుమార్తె స్వలింగ సంపర్కురాలు కావడమే దీనికి కారణం. తన కుమార్తెను పెళ్లి చేసుకునే వారికి దాదాపు 400 కోట్ల రూపాయిలు ఇస్తానని 2012 సెప్టెంబర్‌లో తొలుత ప్రకటించారు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడంతో తాజాగా ఆ మొత్తాన్ని రెట్టింపు చేశారు. తనకు కాబోయే అల్లుడు విలాసవంతమైన జీవితం గడిపేలా భారీ మొత్తంతో పాటు సకల సౌకర్యాలూ కల్పిస్తానని చెబుతున్నారు. కాగా సెసిల్ తనయ ఎప్పుడో మరొకరి జీవితంలోకి ప్రవేశించింది. గత తొమ్మిదేళ్లుగా మరో అమ్మాయితో కలసి సహజీవనం సాగిస్తోంది. సెసిల్ తన వ్యాపార బాధ్యతల్ని కుమార్తెకు అప్పగించాలని తొలుత భావించారు. ఆమె పెళ్లి చేసుకోకపోతే ఇద్దరు కుమారులకు ఇవ్వాలని ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. తన కుమార్తె మనసు మారుతుందని సెసిల్ విశ్వాసంతో ఉన్నారు. ఆమె పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలన్నది ఆయన కోరిక. సెసిల్ కంపెనీకి ఆమె ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా తనయ ఆలోచన మాత్రం మరోలా ఉంది. భారీ ఆఫర్ చూపి వరుడ్ని ఆకర్షించలేమని చెబుతోంది. ఈ విషయం పత్రికల వారితో చెప్పొద్దని ఆమె తండ్రిని కోరుతోంది. ఆమె గేల హక్కుల కోసం కృషి చేస్తోంది.