
నాన్నా.. నాకు పెళ్లొద్దు!
వయసొచ్చిన ఏ యువతి అయినా కన్నవాళ్లను ఏం కోరుతుంది. తనకు తగిన వరుణ్ని చూసి పెళ్లి చేసి అత్తవారింటికి పంపమని అడుగుతుంది. అయితే హాంకాంగ్‌కు చెందిన అపరకుబేరుడు సెసిల్ చావో జెట్సుంగ్ కుతూరు జిగీచావో మాత్రం ఇందుకు భిన్నం. అసలు తనకు పెళ్లే వద్దంటోంది. మగాళ్ల మాట ఎత్తితే మండిపడుతోంది. తాను స్వలింగ స్వలింగ సంపర్కురాలినని చెప్పి తండ్రికి షాక్ ఇచ్చింది. అంతటితో ఆగకుండా తండ్రికి కన్నీటితో బహిరంగ లేఖ రాసింది.
తనను లెబ్సియన్గా అంగీకరించాలని ప్రాధేయపడింది. తాను సహజీవనం సాగిస్తున్న సియన్ ఈవ్ను సాధారణ భాగస్వామిగా గుర్తించాలని, మామూలుగా మనిషిగా గౌరవించాలని ఆమె విన్నవించింది. 'ఈ విషయాన్ని జీర్ణించుకోవడం మీకు కష్టమని నాకు తెలుసు. ఇద్దరు అమ్మాయిల మధ్య ఆకర్షణ ఎలా సాధ్యమని మీరనుకోవచ్చు. దీని గరించి ప్రత్యేకంగా వివరించలేను. మా ఇద్దరి మధ్య బంధంగా మామూలుగానే ఏర్పడింది' అని తండ్రికి రాసిన లేఖలో జిగీచావో పేర్కొంది. గత తొమ్మిదేళ్లుగా సియన్ ఈవ్తో ఆమె సహజీవనం చేస్తోంది. 2012లో ఫ్రాన్స్లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
జిగీచావోను లెస్బియన్గా గుర్తించేందుకు తన తండ్రి నిరాకరించిన నేపథ్యంలో ఆమె ఈ లేఖ రాసింది. కూతురు మనసు ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. జిగీచావోను పెళ్లికి ఒప్పిస్తే 830 కోట్ల రూపాయిలు కానుకగా ఇస్తానని ఈ హాంకాంగ్ బిలీయనీర్ ప్రకటించాడు. రెండేళ్ల క్రితం రూ.400 కోట్లు ఆఫర్ చేసినా.. ఒక్కరు కూడా పెళ్లికి ముందుకు రాకపోవడంతో ఈ మొత్తాన్ని రెట్టింపు చేశాడు. తనపై 'ఆఫర్' ప్రకటించిన తండ్రిని క్షమించినట్టు 33 ఏళ్ల జిగీచావో వెల్లడించింది. తన మంచి కోరే ఆయన ఇదంతా చేశారని పేర్కొంది. అయితే హాంగ్కాంగ్లో తనకు తగిన వ్యక్తి తారసపడలేదని తెలిపింది. చాలా మంది మంచివాళ్లు ఉన్నా తనకు ఎవరూ నచ్చలేదని నిక్కచ్చిగా చెప్పేసింది.
తానేలావుంటే సంతోషంగా ఉంటానో తన తండ్రి గుర్తించకపోవడం పట్ల జిగీచావో ఆవేదన వ్యక్తం చేసింది. తన ఆలోచనా విధానాలను తండ్రి పంచుకోలేకపోయారని వాపోయింది. హాంగ్కాంగ్ సంపనుల్లో ఒకరయిన 77 ఏళ్ల సెసిల్ చావో జెట్సుంగ్ తరచుగా ప్రచారంలో ఉంటుంటారు. తాజాగా ఆయన తన యువ ప్రియురాలతో పార్టీల్లో కన్పిస్తున్నారు. ఇప్పటివరకు 10 వేల మంది మహిళలతో గడిపినట్టు ఆయనో సందర్భంగా వెల్లడించారు. ఇదిలావుంటే హాంగ్కాంగ్లో హాట్ టాఫిక్గా మారిన ఈ స్టోరీతో సినిమా తీసేందుకు బ్రిటీష్ దర్శకుడు సచా బారోన్ కొహెన్ సిద్ధమవుతున్నారు.