షాకింగ్: లైవ్‌లో మహిళా జర్నలిస్ట్ మృతి | Female journalist died while doing Live Reporting in Pakistan | Sakshi
Sakshi News home page

లైవ్‌లో మహిళా జర్నలిస్ట్ మృతి.. వీడియో వైరల్

Published Thu, Jun 29 2017 5:16 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

షాకింగ్: లైవ్‌లో మహిళా జర్నలిస్ట్ మృతి

షాకింగ్: లైవ్‌లో మహిళా జర్నలిస్ట్ మృతి

ఇస్లామాబాద్: లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న ఓ యువ మహిళా జర్నలిస్టు అకస్మాత్తుగా మృతిచెందారు. ఈ ఘటన పాకిస్తాన్‌లో ఇటీవల చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు 25 ఏళ్ల వయసున్న యువతి పాకిస్తాన్‌కు చెందిన 92 టీవీ ఛానెల్‌లో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రోగ్రాంలో పాల్గొని ఆ మహిళా జర్నలిస్ట్ లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్నారు. క్రేన్ మీద నిల్చున్న ఆమె ఓ విషయంపై కొన్ని క్షణాల ముందే రిపోర్టింగ్ ప్రారంభించారు.

గట్టిగా మాట్లాడుతున్న ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనట్లు కనిపించారు. ఆమెకు కళ్లుతిరిగాయో లేక గుండెపోటుకు గురయ్యారో స్పష్టతలేదు కానీ ఒక్కసారిగా క్రేన్ మీద నుంచి కుప్పకూలిపోయి నేలపై పడిపోయారు. అక్కడున్నవారు ఆమెను చేరుకుని పరిశీలించిలోపే మహిళా జర్నలిస్టు తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషాధ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందమైన జర్నలిస్టు ఎలా చనిపోయారో ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు కామెంట్ చేశారు. ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement