female reporter
-
మహిళా విలేకరికి క్షమాపణలు చెప్పిన గవర్నర్
-
మహిళా విలేకరికి గవర్నర్ క్షమాపణ
చెన్నై: మహిళా విలేకరి చెంపపై తట్టినందుకు తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ బుధవారం ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఆమె తన మనవరాలి వంటిదనీ, విలేకరిగా ఆమె పనిని మెచ్చుకుంటూ అప్యాయతతో చెంపపై తట్టానని పురోహిత్ వివరణ ఇచ్చారు. ఇంగ్లిష్ మేగజీన్‌లో విలేకరిగా పనిచేసే లక్ష్మి సుబ్రమణియన్ మంగళవారం పురోహిత్‌ను ఓ ప్రశ్న అడగ్గా, దాన్నుంచి తప్పించుకునేందుకు పురోహిత్ ఆమె చెంపపై తట్టి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన ఆమె వెంటనే ఈ విషయాన్ని ట్వీటర్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత జర్నలిస్టు సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళనకు దిగి గవర్నర్ చర్య పట్ల నిరసన వ్యక్తం చేశాయి. ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేయడంతో చివరకు పురోహిత్ క్షమాపణ కోరుతూ లక్ష్మి సుబ్రమణియన్‌కు లేఖ రాశారు. దీంతో గవర్నర్‌ను మన్నించిన ఆమె.. ఆయన ప్రవర్తించిన తీరు మాత్రం సరైనది కాదని పురోహిత్‌కు ఈమెయిల్ పంపారు. -
మహిళా విలేకరిపై వేధింపులు
ముంబై : అర్ధరాత్రి సమయంలో వెళ్తున్న మహిళా విలేకరిని ఇద్దరు వ్యక్తులు వెంబడించి వేధించారు. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కొద్దిగంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు. ముంబైలోని అంథేరి ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వార్తా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిని అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఆటోలో తన ఇంటికి వెళుతోంది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై ఆమెను వెంబడించి వెకిలి మాటలు మాట్లాడసాగారు. ఇరవై నిమిషలపాటు ఆమె వారి వేధింపులను భరించింది. చివరికి పోలీసు జీపు అటుగా రావటంతో ఆ దుండగులు పరారయ్యారు. అయితే బాధితురాలు పోలీసులకు ఈ విషయం వివరించింది. తన ఫోన్లో తీసిన దుండగుల ఫొటోలను, రికార్డు చేసిన మాటలతోపాటు స్కూటీ నంబర్ ఫొటోను అందజేసింది. అనంతరం పోలీసులు ఆమెను సురక్షితంగా ఇంటికి పంపారు. బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో నిందితులను క్లిఫర్డ్ అమన(25)అనే ఐటీ ఉద్యోగి, సాగర్ సింగ్(21)అనే బీకాం విద్యార్థిగా గుర్తించి అరెస్టు చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
షాకింగ్: లైవ్‌లో మహిళా జర్నలిస్ట్ మృతి
ఇస్లామాబాద్: లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న ఓ యువ మహిళా జర్నలిస్టు అకస్మాత్తుగా మృతిచెందారు. ఈ ఘటన పాకిస్తాన్లో ఇటీవల చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు 25 ఏళ్ల వయసున్న యువతి పాకిస్తాన్‌కు చెందిన 92 టీవీ ఛానెల్లో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రోగ్రాంలో పాల్గొని ఆ మహిళా జర్నలిస్ట్ లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్నారు. క్రేన్ మీద నిల్చున్న ఆమె ఓ విషయంపై కొన్ని క్షణాల ముందే రిపోర్టింగ్ ప్రారంభించారు. గట్టిగా మాట్లాడుతున్న ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనట్లు కనిపించారు. ఆమెకు కళ్లుతిరిగాయో లేక గుండెపోటుకు గురయ్యారో స్పష్టతలేదు కానీ ఒక్కసారిగా క్రేన్ మీద నుంచి కుప్పకూలిపోయి నేలపై పడిపోయారు. అక్కడున్నవారు ఆమెను చేరుకుని పరిశీలించిలోపే మహిళా జర్నలిస్టు తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషాధ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందమైన జర్నలిస్టు ఎలా చనిపోయారో ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు కామెంట్ చేశారు. ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళా రిపోర్టర్‌కు షాకిచ్చిన ట్రంప్!
ఫ్లోరిడా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ మహిళా రిపోర్టర్‌కు షాకిచ్చాడు. లైవ్ ప్రసారంలో తనదైన శైలిలో ఆమెను కసురుకుంటూ కాస్తా ‘నోరుమూస్తావా’ అని ట్రంప్ పేర్కొన్నాడు. ఫ్లోరిడాలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ఘటన జరిగింది. ‘ఈ దేశానికి చెందిన ఎవరిదైనా కంప్యూటర్ను హ్యాక్ చేయమని రష్యా లేదా చైనాను అడుగడంలో మీకు ఎలాంటి అభ్యంతరం లేదా’ అంటూ ఎన్బీసీ రిపోర్టర్ కేటీ టర్ ట్రంప్‌ను అడిగింది. హిల్లరీ ఈమెయిల్స్‌ను హ్యాక్ చేయమంటూ ట్రంప్ పేర్కొన్న వ్యాఖ్యలను ఉటంకించేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ విషయమై తీవ్ర వాగ్వాదం జరుగడంతో అసహనం చెందిన ట్రంప్ ‘కాస్తా నోరుమూస్తావా’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. దీంతో నోచ్చుకున్నట్టు కనిపించిన కేటీ మళ్లీ ప్రశ్నలు అడుగలేదు. క్లింటన్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె పంపిన ఈమెయిల్ మిస్సవ్వడంతో.. ఆ ఈమెయిల్స్‌ను కనిపెట్టడంలో రష్యా తమకు సహాయం చేయాలని ట్రంప్ పేర్కొనడం పెద్ద దుమారం రేపింది.