మహిళా రిపోర్టర్‌కు షాకిచ్చిన ట్రంప్‌! | Donald Trump asks female reporter to be quiet | Sakshi
Sakshi News home page

మహిళా రిపోర్టర్‌కు షాకిచ్చిన ట్రంప్‌!

Published Thu, Jul 28 2016 12:34 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

మహిళా రిపోర్టర్‌కు షాకిచ్చిన ట్రంప్‌! - Sakshi

మహిళా రిపోర్టర్‌కు షాకిచ్చిన ట్రంప్‌!

ఫ్లోరిడా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్ ‍ట్రంప్‌ తాజాగా ఓ మహిళా రిపోర్టర్‌కు షాకిచ్చాడు. లైవ్ ప్రసారంలో తనదైన శైలిలో ఆమెను కసురుకుంటూ కాస్తా ‘నోరుమూస్తావా’ అని ట్రంప్‌ పేర్కొన్నాడు. ఫ్లోరిడాలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ఘటన జరిగింది.

‘ఈ దేశానికి చెందిన ఎవరిదైనా కంప్యూటర్‌ను హ్యాక్ చేయమని రష్యా లేదా చైనాను అడుగడంలో మీకు ఎలాంటి అభ్యంతరం లేదా’ అంటూ  ఎన్బీసీ రిపోర్టర్‌ కేటీ టర్‌ ట్రంప్‌ను అడిగింది. హిల్లరీ ఈమెయిల్స్‌ను హ్యాక్‌ చేయమంటూ ట్రంప్‌ పేర్కొన్న వ్యాఖ్యలను ఉటంకించేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ విషయమై తీవ్ర వాగ్వాదం జరుగడంతో అసహనం చెందిన ట్రంప్‌ ‘కాస్తా నోరుమూస్తావా’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. దీంతో నోచ్చుకున్నట్టు కనిపించిన కేటీ మళ్లీ ప్రశ్నలు అడుగలేదు. క్లింటన్‌ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె పంపిన ఈమెయిల్‌ మిస్సవ్వడంతో.. ఆ ఈమెయిల్స్‌ను కనిపెట్టడంలో రష్యా తమకు సహాయం చేయాలని ట్రంప్‌ పేర్కొనడం పెద్ద దుమారం రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement