
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన దిగుమతి సుంకాల ప్రకటనపై చైనా (china) ధీటుగా బదులిచ్చింది. అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా మేం సిద్ధమని స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికా నుంచి చైనాలో దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకం విధిస్తున్నట్లు తెలిపింది.
ట్రంప్ నిర్ణయంపై చైనా విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ (Lin Jian) ఘాటు వ్యాఖ్యలే చేశారు. ట్రంప్ దిగుమతి సుంకం ప్రకటనపై అమెరికా మీడియా సంస్థ ది న్యూయార్క్ టైమ్స్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడారు.‘అమెరికా ఎలాంటి యుద్ధాన్ని కోరుకున్నా చైనా చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉంది. మరి అమెరికా ఎలాంటి యుద్ధాన్ని కోరుకుంటుంది. అది టారిఫ్, ట్రేడ్ వార్ ఇతర యుద్ధమైనా మేం చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై అమెరికాలోని చైనా రాయభార కార్యాలయం అధికారిక ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
If war is what the U.S. wants, be it a tariff war, a trade war or any other type of war, we’re ready to fight till the end. https://t.co/crPhO02fFE
— Chinese Embassy in US (@ChineseEmbinUS) March 5, 2025
ట్రంప్ చైనా ఉత్పుత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. మంగళవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. ట్రంప్ నిర్ణయాన్ని ఖండిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించింది.
అమెరికా పార్లమెంట్‌లో ట్రంప్
అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంట్) జాయింట్ సెషన్‌లో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని పలు దేశాలు దశాబ్ధాలుగా అమెరికాలోని సుంకాలు వ్యతిరేకంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాయి.
ఇది సరైన పద్దతి కాదు
సగటున యురోపియన్ యూనియన్,చైనా,బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడాలు మనం విధించే దిగుమతి సుంకాలకంటే ఆ దేశాలు మన దేశ ఉత్పతులపై విధించే దిగుమతి సుంకాలు ఎన్నో రెట్లు ఎక్కువ. ఇది సరైన పద్దతి కాదు. అమెరికా ఆటో మొబైల్ ఉత్పత్తులపై 100శాతం కంటే ఎక్కువ సుంకాల్ని విధిస్తోంది. చైనా కూడా అంతే మనం విధించే దిగుమతి సుంకాల కంటే రెండు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తోంది. సౌత్ కొరియా నాలుగు రెట్లు వసూలు చేస్తున్నాయి.
మనం ఎంత చెల్లిస్తున్నామో.. వాళ్లుకూడా అంతే చెల్లించాలి
మనతో సన్నిహితంగా ఉంటున్న వారితో పాటు మనల్ని వ్యతిరేకిస్తున్న దేశాలు కూడా మన ఉత్పత్తుల మీద పన్నులు విధిస్తున్నాయి. ఇది అన్యాయం కాదా. ఇప్పుడు మన వంతు వచ్చింది. వారు మన ఉత్పత్తులపై ఎంత ట్యాక్స్ వేస్తారో. మనం కూడా అంతే వారి ఉత్పత్తులపై అంతే ట్యాక్స్ వేస్తున్నాం. అందుకే తక్షణమే అమెరికాకు దిగుమతి అయ్యే ఇతర దేశాల ఉత్పత్తులపై దిగుమతి సుంకం (ప్రతిగా విధించే పన్నులు) విధిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏ దేశం ఉత్పత్తులపై ఎంత దిగుమతి సుంకం విధిస్తున్నారో సంబంధిత వివరాల్ని వెల్లడించారు.
అమెరికా ఉత్పత్తులపై చైనా సుంకం
అమెరికా సుంకం విధించే దేశాల్లో చైనా ఉత్పతులున్నాయి. చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ప్రతి ఉత్పత్తి 10 శాతం నుంచి 20 శాతం దిగుమతి సుంకం తప్పని సరిగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిగా చైనా సైతం అమెరికా ఉత్పతుత్తులపై దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. 10శాతం, 15శాతం దిగుమంది సుంకాన్ని విధిస్తున్నట్లు చైనా స్టేట్ కౌన్సిల్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment