అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ ట్రక్కును కారు ఢీకొనడంతో ఐదుగురు ఎన్నారై విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. టెక్సాస్ ఏఅండ్ఎం యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు న్యూ ఆర్లియాన్స్లో థాంక్స్గివింగ్ బ్రేక్కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. తాను వెళ్తున్న లేన్లోనే భారీ ట్రక్కు ఉండటంతో దాన్ని తప్పించడానికి డ్రైవర్ చాలా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
గాయపడిన వాళ్లలో ప్రాణన్ కన్నన్ (22), అక్షయ్ జైన్ (22), చిరంజీవి బోరే (23), షచిత్ అయ్యర్ (23), కిషన్ బజాజ్ (24) ఉన్నారు. వీరందరినీ వెంటనే ఆస్పత్రులకు తరలించారు. వీరిలో అక్షయ్ జైన్, కిషన్ బజాజ్ల పరిస్థితి విషమంగా ఉండటంతో.. వాళ్లను హెలికాప్టర్లలో మెమోరియల్ హెర్మన్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యచికిత్సలు అందించేందుకు అమెరికాలో ఉన్న భారతీయులు విరాళాలు సేకరిస్తున్నారు. ట్రక్కు డ్రైవర్ క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో ఎన్నారై విద్యార్థులకు తీవ్రగాయాలు
Published Tue, Dec 9 2014 12:23 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement
Advertisement