భవిష్యత్ బైక్..
ఇది భవిష్యత్ బైక్ డిజైన్.. పేరు ‘పయనీర్’.. మనుషులకుండే సిక్స్త్‌సెన్స్ దీనికీ ఉంది. దాని వల్ల మోటార్ సైకిల్ నడపడం రానివారు కూడా దీన్ని సులువుగా నడిపేయొచ్చు. ఎందుకంటే.. ఇది తనకు తానే బ్యాలెన్స్ చేసుకుంటుంది.. అంతేకాదు.. అటానమస్ మోడ్‌లో పెడితే.. బైక్ మనం నడపాల్సిన పనిలేదు.. అదే పరుగులు తీస్తుంది. ఈ అదిరిపోయే డిజైన్ సృష్టికర్త స్వీడన్‌కు చెందిన డానియల్ గున్నార్‌సన్. దీన్ని ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ కోసం రూపొందించారు.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఇదే పెద్ద సంచలనమై కూర్చుంది. సంప్రదాయ డిజైన్లకు పేరుమోసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఇంత ఆధునికమైన డిజైన్ రావడమంటే మాటలా మరీ.. పైగా.. ఎలక్ట్రిక్ బైక్. అయితే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్రేడ్ మార్క్ ‘బుల్లెట్ సౌండ్’ మాత్రం వినిపించదు. ఎలక్ట్రిక్ బైక్ కావడంతో చాలా కామ్‌గా వెళ్తుంది. ఇది కేవలం డిజైన్ కోసమేనా లేదా మార్కెట్లోకి తెస్తారా అన్న విషయాన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంకా ప్రకటించలేదు.