Pioneer
-
'ఆధునిక యోగా పితామహుడు'! ఏకంగా 60 దేశాలకు..
ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతమైన బహుమతుల్లో ఒకటి 'యోగా'. అలాంటి యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ యోగా భారతదేశం వారసత్వమే అయినా అందరికీ దీని గురించి కూలంకషంగా తెలియని కాలంలో తిరుమలై కృష్ణమాచార్య గారు దీన్ని వ్యాప్తి చేశారు. ఎంతలా అంటే మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్లు కూడా తెలుసుకునేలా ప్రజాధరణ తీసుకొచ్చారు. ఆయన తర్వాత కాలంలో ఆయన శిష్యుడిగా చెప్పుకునే బెల్లూర్ కృష్ణమచార్ సుందరరాజా అయ్యంగార్ లేదా బీకేఎస్ అయ్యంగార్‌కే ఆ ఘనత దక్కుతుంది. ఎందుకంటే..? ఆయన ఏకంగా 60 దేశాలకు యోగా అభ్యాసాన్ని గురించి తెలియజేశారు. ఇవాళ(జూన్ 20) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీకేఎస్ అయ్యంగార్ ఎలా పాశ్చాత్య దేశాలకు యోగాను పరిచయం చేయగలిగారు? ఆయన యోగా నేర్చుకోవడానికి దారితీసిన పరిస్థితులు గురించి తెలుసుకుందామా..!బీకేఎస్ అయ్యంగార్ లేదా బెల్లూర్ కృష్ణమచార్ సుందరరాజా అయ్యంగారిని 'ఆధునిక యోగా పితామహుడి'గా పిలుస్తారు. ఆయన యోగాని శారీరక అభ్యాసానికి సంబంధించిన కళ, సైన్స్, ఫిలీసపీ అని ప్రగాఢంగా నమ్మారు. 1950లలో యోగా అభ్యాసాలను ప్రచార చేసే నిమిత్తం ముంబై పర్యటనలో ఉన్నారు అయ్యంగారు. సరిగ్గా ఆ సమయంలోనే భారత్ సందర్శనకు వచ్చిన అమెరికన్ బ్రిటీష్ వయోలిన్ వాద్యకారుడు యొహూదీ మెనూహిన్ యోగా గురువు అయ్యంగార్ని కలవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా యోగా గురించిసేలా చేసే ప్రచారం చేయాలన్న అతని దృఢ సంకల్పం విని ఆశ్చర్యపోయారు. ఆయన అలవోకగా వేస్తున్న ఆసనాలన్నీ మెనూహిన్ని ఎతంగానో ఆకర్షించాయి. ఆ ఆసనాలు తాను నేర్చుకుంటే తన వయోలిన్ కళ మరింత మెరుగుపడుతుందని భావించి, అయ్యంగార్ని తనతోపాటు స్విట్జర్లాండ్, లండన్ వంటి దేశాలకు తీసుకెళ్లాడు. అలా అయిన యోగా ప్రాముఖ్యత గురించి విదేశాల్లో ప్రచారం చేసే అవకాశం లభించింది. ఆ క్రమంలో 1956లో అయ్యంగార్ న్యూయార్క్ వచ్చిన తొలినాళ్లల్లో చాలామంది యోగా పట్ల ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత నెమ్మదిగా యోగాకు క్రేజ్ లభించడం జరిగింది. ఆ విధంగా ఆయన ఆరు ఖండాల్లో యోగా ఇన్స్టిట్యూట్లను ప్రారంభించాడు. అంతేగాదు 'లైట్ ఆన్ యోగా' వంటి పుస్తకాలను కూడా రాశారు. ఇవి అంతర్జాతీయంగా అమ్ముడైన పుస్తకంగా కూడా నిలిచింది. ఎవరంటే..అయ్యంగార్ డిసెంబర్ 14, 1918న కర్ణాటక బెల్లూరులో జన్మించారు. 1937లో మహారాష్ట్రలోని పూణేకు వచ్చి అయ్యంగార్ యోగాగా పిలిచే యోగా శైలిని తీసుకొచ్చారు. ఆయన చిన్నతనంలో క్షయ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధుల నుంచి బయటపడేందుకు అతనికి యోగా ఉపకరించింది. దీంతో అప్పటి నుంచి ఎన్నో ప్రయోజనాలందించే ఈ యోగాని అందరూ తెలసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని సంకల్పించారు. ఇక ఆయన యోగా అభ్యాసన విధానంలో చాలా సులభమైన భంగామల్లో వేసేలా బ్లాక్‌లు, పల్టీలు, వంటి వాటిని వినియోగించేవారు. ఎవ్వరైనా ఇట్టే నేర్చుకునేలా బోధించేవారు. ఆ తర్వాత 1975లో తన స్వంత 'యోగవిద్య' సంస్థను స్థాపించారు. అలా దేశవ్యాప్తంగా విదేశాలలో కూడా వివిధ శాఖలకు విస్తరించాడు. అలా యోగా వ్యాప్తి కోసం చేసిన కృషికి గానూ యోగా గురువుగా, ఆధునిక ఋషిగా కీర్తించబడ్డారు. ఆయనకు విదేశాల్లో సుమారు 100కు పైగా యోగా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఆయన సామాన్యులకే గాక పలువురు ప్రముఖులకు కూడా యోగాసనాలు నేర్పారు. ఆయన వద్ద యోగాసనాలు నేర్చుకున్నవారిలో ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు జయప్రకాష్ నారాయణ్, ప్రసిద్ధ తత్వవేత్త జె కృష్ణమూర్తి వంటి వారు కూడా ఉన్నారు. ఆయన యోగాసనాల శైలికి నటి కరీనా కపూర్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి అన్నెట్ బెనింగ్, డిజైనర్ డోనా కరాంటో, రచయిత ఆల్డస్ హక్స్లీ వంటి అభిమానులు కూడా ఉన్నారు. అంతేగాదు యోగాకు ఆయన చేసిన అపారమైన కృషికి గానూ 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మవిభూషణ్ వంటి అవార్డులతో భారతప్రభుత్వ సత్కరించి, గౌరవించింది. 2004లో టైమ్ మ్యాగజైన్ ద్వారా ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేరుపొందారు. చివరిగా ఆగస్టు 20, 2014న, 95 ఏళ్ల వయసులో గుండె వైఫల్యం, మూత్రపిండ వైఫల్యంతో పూణే ఆస్పత్రిలో అయ్యంగార్ మరణించారు. (చదవండి: International Yoga Day 2024: స్ఫూర్తినిచ్చే గొప్ప ప్రయాణం) -
రైతులకు చట్టాలపై అవగాహన కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: రైతులకు భూమి, నీరు, క్రిమిసంహారక మందులు, మార్కెటింగ్ చట్టాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావు పిలుపునిచ్చారు. రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 176 పారా లీగల్ వలంటీర్లను నియమించిందని వెల్లడించారు. గ్రామీణ భవితకు వలంటీర్లు మార్గదర్శకులు కావాలన్నారు. సాగు చట్టాలపై వలంటీర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నల్సార్ యూనివర్సిటీలో బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ నవీన్‌రావు మాట్లాడుతూ.. ‘దేశంలోని రైతుల్లో పేద, మధ్య తరగతి వారే ఎక్కువ. వారికి చట్టాలపై అవగాహన తక్కువ. న్యాయం పొందడం వారి హక్కే అయినా కోర్టులకు వెళ్లి దాన్ని పొందాలంటే ఆర్థిక భారంతో కూడిన పని. కోర్టు గ్రామ స్థాయికి వెళ్లి న్యాయం అందించలేని పరిస్థితి. అందుకే ఇలాంటి వారి కోసం న్యాయ సేవా సంస్థలు ఆవిర్భవించాయి. వారికి న్యాయసేవలు అందించడమే వలంటీర్ల బాధ్యత. దీని కోసం పుట్టిందే ‘అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్’. బమ్మెరలో రెండు నెలల క్రితం ప్రారంభించాం. ఇప్పుడు 67 ప్రాంతాల్లో ఇవి ఏర్పాటయ్యాయి. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రెండు రోజుల పాటు జరిగే శిక్షణలో మీకు తెలియనివి నిపుణుల నుంచి తెలుసుకోండి. ప్రతీ చిన్న విషయానికి కోర్టులను ఆశ్రయించకుండా.. గ్రామీణ స్థాయిలో పరిష్కారం అయ్యేలా చూడాలి. మీరు పరిష్కరించలేని సమస్య వచ్చినప్పుడు మండల, జిల్లా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చు’అని సూచించారు. వారియర్లలా పని చేయాలి... సత్వర న్యాయం అందించేందుకు వలంటీర్లు వారియర్లలా పనిచేయాలని నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ శ్రీకృష్ణదేవరావు సూచించారు. పూర్వం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ‘మధ్యవర్తిత్వం’సంప్రదాయాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. లీగల్ సర్విసెస్ అథారిటీ చట్టాలు, పథకాలపై వలంటీర్లకు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ(టీఎస్ఎల్ఎస్ఏ) సభ్యకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ విద్యుల్లత, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ ప్రెసిడెంట్ సునీల్ కుమార్, రిసోర్స్ పర్స న్లు, ట్రైనీ పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. -
52 ఏళ్ల తరువాత క్షమాపణ : ఆమె ఏం చేసింది?
ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న ట్రాన్స్జెండర్లకు ఆమె ఒక విజయ పతాక. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి తానెంచుకున్న రంగంలో అత్యంత ప్రతిభావంతంగా ఎదిగి ట్రాన్ప్జెండర్ సమూహానికి ప్రజలకు ఉత్సాహాన్నిచ్చిన ధీర వనిత. కానీ ఇదంతా సాధించడానికి ట్రాన్స్‌జెండర్ మహిళకు అర్ధశతాబ్దానికి పైగా పోరాటం చేయాల్సి వచ్చింది. విశేష ప్రతిభ ఉన్నప్పటికీ కేవలం తాను ట్రాన్స్‌జెండర్ విమెన్ని అని ప్రకటించినందుకు ఉద్యోగాన్ని కోల్పోయింది. 1968 లోనే లింగమార్పిడి చేసుకున్న మహిళనని తనకు తాను ధైర్యంగా వెల్లడించింది. కానీ టెక్ దిగ్గజం ఐబీఎం ఒక యువ కంప్యూటర్ మేధావిని ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే తదనంతర కాలంలో తన అసాధారణ ప్రతిభా పాటవాలతో ఒకపుడు తనను అవమానపరిచిన సంస్థే స్వయంగా పొరపాటును గ్రహించి క్షమాపణలు చెప్పే స్థాయికి ఎదిగింది. దీనికి తోడు ఎల్జీబీటీక్యూ హక్కులపై ప్రపంచవ్యాప్తంగా చైతన్యం పెరగడంతో ఐబీఎం ఆ వైపుగా స్పందించింది. ఆధునిక కంప్యూటర్ యుగానికి బాటలు వేసిన ఆమెకు సాంకేతిక ఆవిష్కరణల ద్వారా ప్రపంచాన్ని మార్చిన వ్యక్తులకు ఇచ్చే అరుదైన ఐబీఎం లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. ఆమె పేరే లిన్ కాన్వే (82) గత నెలలో 1,200 మందికి పైగా ఉద్యోగులు హాజరైన ఆన్లైన్ ఈవెంట్‌కు ఆహ్వానించింది. ఈ వేడుకలో ఐబీఎం ఆమెను క్షమాపణ కోరింది. ఆమె పరిశోధన తమ విజయానికి ఎంతో తోడ్పడిందని, చేయకూడని పనిచేశామంటూ ఐబీఎం హెచ్ఆర్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డయాన్ గెర్సన్ క్షమాపణ కోరడం విశేషం. అలాగే ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఆమెను అభినందనలతో ముంచెత్తారు. ఎవరీ లిన్ కాన్వే లిన్ ఆన్ కాన్వే. అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఆవిష్కర్త, ట్రాన్స్‌జెండర్ పీపుల్ కోసం పనిచేస్తున్న ఉద్యమకర్త. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో అత్యంత గౌరవనీయమైన ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. అనేక అవార్డులు, రివార్డులు ఆమె సొంతం. అంతేనా ఇవాల్టి స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, చిప్ ఆవిష్కరణలు దశాబ్దాల తరబడి ఆమె చేసిన కృషి ఫలితమే. 1938లో న్యూయార్క్ లోని మౌంట్ వెర్నాన్లో అబ్బాయిగా పుట్టారు లిన్ చిన్నతనం నుంచే చదువులో రాణిస్తూ వచ్చారు. గణితం అన్నా, సైన్స్ అన్నా ప్రాణం.155 పాయింట్ల ఐక్యూతో అసాధారణ తెలివితేటలతో రాణించాడు. కానీ చిన్న వయసు నుంచే డిస్ఫోరియా అన లింగపరమైన సమస్య వెంటాడింది. అయినా చదువులోప్రతిభ కనబరుస్తూ కొలంబియా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అప్లైడ్ సైన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. 1964లో ఐబీఎం రీసెర్చ్ విభాగంలో జాయిన్ అయ్యారు. ఆర్కిటెక్చర్ బృందంలో అధునాతన సూపర్ కంప్యూటర్ రూపకల్పన చేయడంతోపాటు, గొప్ప పరిశోధకురాలిగా ఎదిగారు. 1964లో పెళ్లి చేసుకున్న లిన్‌కు (మహిళగా మారకముందు) ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఆమెలోని జన్యుపరమైన లోపం కుదురుగా ఉండనీయలేదు. దీంతో 1967లో, మాన్హటన్కుచెందిన సెక్సాలజిస్ట్ డాక్టర్ హ్యారీ బెంజమిన్ ద్వారా లింగమార్పడి గురించి తెలుసుకున్నారు. అలా బెంజమిన్ సహాయంతో, ఆమె మగ నుండి ఆడకు శారీరకంగా పరివర్తనను ప్రారంభించారు. చివరకు 1969లో ఆపరేషన్ తరువాత పూర్తి మహిళగా అవతరించారు. దీనికి ఆమె కుటుంబం, సహచరుల మద్దతు లభించింది. కానీ ఐబీఎం మాత్రం జీర్ణించుకోలేకపోయింది. ఆమె వలన ఇతర ఉద్యోగులకు కూడా ఇబ్బంది అంటూ అప్పటి సీఈవో థామస్ జేవాట్సన్ లిన్‌ను తొలగించారు. దీంతో లిన్ కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించడంతో కష్టపడాల్సి వచ్చిందని, ఎప్పటికి ఈ సమస్యల్ని అధిగమిస్తానో తెలియని స్థితిలో తీవ్ర నిరాశకు గురయ్యానని ఆమె చెప్పారు. అయినా దుఃఖాన్ని దిగమింగి తన పోరాటాన్ని కొనసాగించానన్నారు. చివరకు తన కొత్త అవతారాన్ని దాచి పెట్టి ఎంట్రీ లెవల్ కాంట్రాక్ట్ ప్రోగ్రామర్‌గా మళ్లీ ఉద్యోగంలో చేరానని ఆమె చెప్పారు. ఆ తరువాత తన ప్రతిభతో అమెరికా డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీలో ఉద్యోగాన్ని సాధించారు. దాదాపు 30ఏళ్ల పాటు తాను ట్రాన్స్జెండర్ననీ ఎవరికీ చెప్పలేదు. (కొద్దిమంది సన్నిహితులు, బంధువులు, హెచ్ఆర్ సిబ్బంది, భద్రతా క్లియరెన్స్ ఏజెన్సీలు మినహా). అయితే 1999లో కంప్యూటర్ రంగంలో ఆమె ఆవిష్కరణలపై చరిత్రకారుల పరిశోధించడం ప్రారంభించినప్పుడు ఆమె తన ఉనికిని బహిరంగపర్చారు. ఐబీఎంలో ఉద్యోగం కోల్పోయిన సంఘటనతో పాటు, తన లింగ మార్పిడి ప్రస్థానాన్ని ఆన్లైన్లో బహిర్గతం చేశారు. కంప్యూటర్ సైంటిస్టుగా ప్రస్థానం, పురస్కారాలు కాంట్రాక్ట్ ప్రోగ్రామర్‌గా ఉద్యోగంలో చేరిన లిన్ ఆ తరువాత తన కరియర్లో వెనుతిరిగి చూసింది లేదు. ఆధునిక స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, సిలికాన్ వ్యాలీలోని అనేక శక్తివంతమైన కంపెనీల అభివృధ్దితో ఆధునిక కంప్యూటర్ యుగానికి బాటలు వేశారు. ఇంటర్నెట్కు, అనేక టెక్ స్టార్టప్‌ల ఆవిర్భావానికి అపూర్వ సామర్ధ్యాన్నిచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆమెది కీలక పాత్ర. 70 ల ప్రారంభంలో ప్రసిద్ధి చెందిన జిరాక్స్ పాలో ఆల్టో రిసెర్చ్ సెంటర్లో కంప్యూటర్ చిప్ డిజైన్‌ను ఆవిష్కరించిన ఘనత ఆమె సొంతం. 1980లలో ఇ-కామర్స్, మైక్రోప్రాసెసర్ చిప్ రూపకల్పనలో ఆమె సాధించిన పురోగతి సిలికాన్ వ్యాలీ మొట్టమొదటి స్టార్టప్‌లకు శక్తినిచ్చిందని ఫోర్బ్స్ ఆమెను ప్రశంసించింది. 1983లో మెషిన్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో చేసిన కృషికి మెరిటోరియస్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 2014లో టైమ్ మ్యాగజైన్ ఆమెను అమెరికన్ సంస్కృతిలో అత్యంత ప్రభావవంతమైన ఎల్జీబీటీక్యూ వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. ఈ క్రమంలో ఆమె ఎల్జీబీటీ కార్యకర్తగా, రచయితగా మారారు. తమ లాంటి వాళ్లకోసం ఉద్యమిస్తూ..ఎంతో మంది ఎల్జీబీటీక్యూ హక్కుల కార్యకర్తలకు, సెలబ్రిటీలకు స్ఫూర్తిగా నిలిచారు. -
అనుష్క మోజులో పటన్ పతనం
పోలీసుల చేతికి మిలటరీ రహస్య పత్రాలు కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫేస్‌బుక్‌ల నుంచి 104 రహస్య పత్రాలు వెలికి అనుష్క అగర్వాల్‌పై కేసు నమోదు చంచల్‌గూడ జైలుకు పటన్ తరలింపు త్వరలో మార్షల్ కోర్టుకు పంపే అవకాశం హైదరాబాద్: సికింద్రాబాద్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ సైనికాధికారి పటన్ కుమార్ పోద్దార్.. పాక్ ఐఎస్ఐ ఏజెంట్(అనుష్క అగర్వాల్)కు పంపిన మిలటరీ రహస్య పత్రాలు సీసీఎస్ పో లీసుల చేతికి చిక్కాయి. ఏడాది కాలంగా ఆమెకు 104 పేజీల రహస్యాలను పంపినట్లు తేలింది. సోమవారం పటన్ కస్టడీ ముగియడంతో నాంప ల్లి కోర్టు మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసుల విచారణలో పలు నిజాలు వెలుగు చూశాయి. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈ నెల 12న కస్టడీకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు పటన్‌ను విచారించి మరిన్ని రహస్యాలను కక్కించారు. వెలుగు చూసిన నిజాలు.. దేశంలోని 12 ఆర్మీ యూనిట్ల ప్రాంతాలు, సైనికాధికారుల పేర్లు, ఏయే యూనిట్లో ఏయే ఆయుధాలు ఎక్కడెక్కడ ఉంటాయనే విషయాలను పటన్ పాక్ ఐఎస్ఐ ఏజెంట్‌కు అందించాడు. సైనికాధికారుల సమావేశాల సర్క్యులర్ కాపీలను సైతం ఆమెకు పంపినట్లు తేలింది. పటన్ నుంచి నాలుగు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, బ్లూ టూత్, మూడు సెల్ఫోన్లు, నాలుగు పెన్‌డ్రైవ్‌లు, 10 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు డీ కోడ్ చేసి రికవరీ చేశారు. రికవరీ పత్రాలు, ఫొటోలను పంపినట్టు పటన్ అంగీకరించాడు. ఆర్మీ యూనిట్లు, అధికారుల సమావేశాల ఫొటోలు, మిస్సైల్ ఫొటోలు ఇందులో ఉన్నాయి. ఆర్మీ మిస్సైల్స్ నిల్వ కర్మాగారాలు, మిలటరీ అధికారుల రహస్య సమావేశాలు, వాటి ఎజెండా గురించి కూడా పటన్ తన ఈ-మెయిల్, ఫేస్బుక్ ద్వారా ఆమెకు పంపించాడు. దేశ సరిహద్దులో ఏ సెక్టార్లో ఎంత మంది ఉంటారు, వారు ఎన్ని రోజులకు మారుతుంటారు, కొత్తగా వచ్చే బృందాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేవాడు. సైనిక రహస్యాలు పంపినందుకు అనుష్క తనకు రూ.74 వేలు పలు దఫాలుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేసిందని పటన్ విచారణలో వెల్లడించాడు. చైనాలో ఉండే విదేశీ రాయబార కార్యాలయంలో ధరమ్వీర్ సింగ్, మాజీ సుబేదార్ బి.ఎస్.రెడ్డిల ద్వారా విదేశాల్లో తాను స్థాపించిన ఎంఎల్ఎం సెక్యూర్డ్ లైఫ్ సంస్థకు వ్యాపారం చేయించి లాభాలు ఆర్జించి పెడతానని, లండన్‌కు కూడా పంపిస్తానని అనుష్క తనను నమ్మించిందని వెల్లడించాడు. అత్యంత క్రమశిక్షణకు మారుపేరైన మిలటరీలో పనిచేస్తున్న తాను అనుష్క మోజులో పడి మోసపోయానని అతడు అంగీకరించాడు. తాను రహస్యాలు పంపకపోతే ఆమె తనను బ్లాక్మెయిల్ చేసి ఉండేదని, అందుకు భయపడి సహకరించానని విచారణాధికారులకు చెప్పాడు. తప్పు చేసినందుకు పశ్చాత్తాప పడుతున్నానని పేర్కొన్నాడు. పటన్ పాక్‌కు పంపిన రహస్యాల కాపీలను నగర పోలీసులు కేంద్ర రక్షణ రంగ అధికారులకు పంపారు. చంచల్‌గూడ జైలులో ఉన్న పటన్‌ను త్వరలో మిలటరీ మార్షల్ కోర్టులో హాజరు పర్చేందుకు ఆర్మీ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. దిద్దుబాటు చర్యలు దేశ సైనిక రహస్యాలు పాక్‌కు చేరడంతో కలవరపడ్డ ఆర్మీ అధికారులు దిద్దుబాటు చర్యలో నిమగ్నమయ్యారు. పాక్‌కు చేరిన రహస్యాలు ఏంటనే విషయంపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో తమ మిస్సైల్ ఆయుధాగారాన్ని బదిలీ చేయాలని, ఉన్నతాధికారుల రహస్య మందిరాలను కూడా మార్చాలని భావిస్తున్నారు. రహస్యాలు బయటకు పోకుండా అధికారుల వద్ద ఉన్న కంప్యూటర్లను చిన్న ఉద్యోగులు వాడకుండా చూడాలని సూచించారు. పాక్‌కు చేరిన రహస్యా లు పనికిరాకుండా చేసేందుకు చర్యలను మొద లు పెట్టాలని ఆర్మీ వర్గాలు యోచిస్తున్నాయి. -
భవిష్యత్ బైక్..
ఇది భవిష్యత్ బైక్ డిజైన్.. పేరు ‘పయనీర్’.. మనుషులకుండే సిక్స్త్సెన్స్ దీనికీ ఉంది. దాని వల్ల మోటార్ సైకిల్ నడపడం రానివారు కూడా దీన్ని సులువుగా నడిపేయొచ్చు. ఎందుకంటే.. ఇది తనకు తానే బ్యాలెన్స్ చేసుకుంటుంది.. అంతేకాదు.. అటానమస్ మోడ్‌లో పెడితే.. బైక్ మనం నడపాల్సిన పనిలేదు.. అదే పరుగులు తీస్తుంది. ఈ అదిరిపోయే డిజైన్ సృష్టికర్త స్వీడన్‌కు చెందిన డానియల్ గున్నార్సన్. దీన్ని ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కోసం రూపొందించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఇదే పెద్ద సంచలనమై కూర్చుంది. సంప్రదాయ డిజైన్లకు పేరుమోసిన రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఇంత ఆధునికమైన డిజైన్ రావడమంటే మాటలా మరీ.. పైగా.. ఎలక్ట్రిక్ బైక్. అయితే.. రాయల్ ఎన్ఫీల్డ్ ట్రేడ్ మార్క్ ‘బుల్లెట్ సౌండ్’ మాత్రం వినిపించదు. ఎలక్ట్రిక్ బైక్ కావడంతో చాలా కామ్‌గా వెళ్తుంది. ఇది కేవలం డిజైన్ కోసమేనా లేదా మార్కెట్లోకి తెస్తారా అన్న విషయాన్ని రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకా ప్రకటించలేదు.