
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ప్రశంసలు కురిపించారు. గూగుల్‌పై గతంలో విమర్శలు కురిపించిన ట్రంప్ తాజాగా యూ టర్న్ తీసుకున్నారు. పిచాయ్ అమెరికా సైన్యం కోసం పనిచేస్తున్నారు. చైనా సైన్యం కోసం కాదు. ఇది సంతోషించదగిన పరిణామామని ఆయన పేర్కొన్నారు.
పిచాయ్ పూర్తిగా అమెరికా వైపు దృఢంగా నిలబడ్డారంటూ ట్వీట్ చేశారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో వైట్హౌస్‌లో బుధవారం సమావేశమైన అనంతరం ట్రంప్ ట్విటర్‌లో పోస్ట్ పెట్టడం విశేషం. అలాగే దేశం కోసం గూగుల్ ఏమేమి చేయగలదన్న అంశాలపై కూడా సుందర్ పిచాయ్‌తో చర్చించానంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.
సంచలన వ్యాఖ్యలతో టెక్ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా నిలిచే ట్రంప్ ఈసారి గూగుల్ విషయంలో పాజిటివ్‌గా స్పందించారు. అంతేకాదు గతంలో టిమ్ యాపిల్ అని సంబోధించిన అమెరికా ప్రెసిడెంట్, ఈసారి సుందర్ పిచాయ్‌ను ‘ప్రెసిడెంట్ ఆఫ్ గూగుల్’ అని తప్పుగా సంబోధించి మరోసారి చర్చకు తావిచ్చారు. మరోవైపు తాజా పరిణామంపై గూగుల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
గూగుల్ సంస్థ చైనాతో పాటు ఆ దేశ మిలిటరీకి సాయం చేస్తోందికానీ, అమెరికాకు కాదంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Just met with @SundarPichai, President of @Google, who is obviously doing quite well. He stated strongly that he is totally committed to the U.S. Military, not the Chinese Military....
— Donald J. Trump (@realDonaldTrump) March 27, 2019
Comments
Please login to add a commentAdd a comment