బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా | haseena as bangla prime minister | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా

Published Mon, Jan 13 2014 4:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

haseena as bangla prime minister

 ఢాకా: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా 66 ఏళ్ల షేక్ హసీనా బాధ్యతలు స్వీకరించారు. సైనిక పాలన ముగిసి ప్రజాస్వామ్యం పునరుద్ధరించిన తర్వాత ఈ రెండు దశాబ్దాల్లో హసీనా ప్రధాని పీఠాన్ని అధిష్టించడం ఇది మూడోసారి. అధ్యక్షుడి నివాస సౌధం బంగభవన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానిగా హసీనాతో పాటు 48 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులతో పాటు భారత్ హై కమిషనర్ పంకజ్ శరణ్ సహా పలువురు దౌత్యాధికారులు హాజరయ్యారు. హసీనాకు భారత ప్రధాని మన్మోహన్ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement