ఢాకా: ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, ఆ విధంగా కృషి చేసే ప్రపంచ దేశాలతో కలిసి ముందుకు సాగుతామని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. ఢాకాలోని ఓ రెస్టారెంటుపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడిపై ఆమె స్పందిస్తూ ఈ దాడి ముమ్మాటికి నీచాతి నీచమైనదే అన్నారు.
ఇలాంటి వారిని ఏ ముస్లింలు అని అనాలి? అసలు వీరికి మతమంటూ లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రంజాన్ పవిత్ర ప్రార్ధనలు పక్కకుపెట్టి వారు ప్రజలను చంపడానికి వెళ్లారు. ఇలాంటి చర్య ఏమాత్రం సహించరానిది కాదు. వారికి అసలు ఏ మతం లేదు. ఉగ్రవాదమే వారి మతం' అని చెప్పారు.