సాక్షి, న్యూఢిల్లీ : ‘కరోనా కష్టాలు అంతా ఇంత కాదయా! విశ్వదాభిరామ వినుర వేమ!’ అంటే ఆమె కష్టాల గురించి చెప్పలేం. ‘పీత కష్టాలు పీతవే! ఆమె కష్టాలు ఆమెవే!’ అంటే సరిపోతుందేమో! ఆమెకు 38 ఏళ్లు. న్యూయార్క్ సిటీని ప్రాణాంతకమైక కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఆమె కూడా ఆందోళనకు గురయ్యారు. కరోనాకు కనిపించనంత దూరంగా పారిపోవాలనుకున్నారు. దాంతో ఆమె న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ నుంచి అతి చిన్న పట్టణం వెర్మంట్‌కు ఇటీవలే మకాం మార్చారు. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలై విలవిలలాడుతున్నారు. శృంగార భాగస్వామి దొరక్క తహతహలాడుతున్నారు. నచ్చిన యువకుల వద్దకు వెళ్లి వెచ్చని మాటలు చెప్పినా ‘కరోనా’ కారణంగా చొరవ తీసుకునేందుకు భయపడుతున్నారట. ఆమె అంతగా బాధ పడుతున్నారంటే ఆమె ఒంటరి అనుకుంటే పొరపాటే.
ఆమెకు పెళ్లయింది. భర్త మంచి శరీరదారుఢ్యం కలిగిన పురుష పుంగవుడు. భార్యను బాగా చూసుకుంటారట. అయితే ఆయనలో అసాధారణ లైంగిక నైపుణ్యం లేదట. అందుకని ఆమెకు తృప్తి కలగడం లేదట. ఇంతకు ఆమె పేరేమిటంటే...తెలియదు. ఎందుకంటే ఆమె చెప్పలేదు. పేరు వెల్లడించకుండానే ఆమె తన ‘కరోనా కష్టాల’ను ‘ది కట్స్’ అనే వెబ్‌సైట్‌లోని ‘సెక్సువల్ డైరీస్’ కాలంలో వెళ్లడించారు. ‘నా భర్త చాలా మంచి వారు. ముద్దులొలికే ఐదేళ్ల పాప కూడా ఉంది. జీవితానికి ఏ లోటు లేదు. లైంగికంగా వారానికోసారి కలుసుకుంటాం. ఏదో వెలితి. అయినా భర్తను నొప్పించడం ఇష్టం లే క ఆయనతో బాగుంటాను. ఆయనకు నా మీద పూర్తి నమ్మకం. దాన్ని ఆసరా చేసుకునే బయట కొత్త స్పర్శను వెతుక్కునేదాన్ని.
ఏడాదికి ఒకరిద్దరు చొప్పున మారస్తూ వచ్చాను. ఇంతలో కరోనా కోరలు సాచింది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు నా భర్త, నేను మా అమ్మాయిని తీసుకొని వెర్మంట్‌కు వచ్చాం. కొంత ప్రాంతానికి రావడం వల్ల భర్తతో లైంగిక, మానసిక సంబంధాలు పెరుగుతాయని కూడా ఆశించాను. సంబంధాలు పెరిగినా తృప్తి కలగడం లేదు. నా భర్తను మోసం చేస్తున్నానన్న చింత నాకు ఏనాడు లేదు. నేను ఎవరికి అన్యాయం చేయడం లేదు. ఆయన్ని సుఖ పెడుతూనే నేను సుఖ పడుతున్నాను. నేను ఒక మగవాళ్లతోనే కాదు, ఆడవాళ్లతో కూడా సుఖాన్ని పంచుకుంటున్నాను. సరుకుల కోసమో, వైన్ షాపుకో వెళ్లినప్పుడు ముఖంలో కరకుదనం, కంటిలో కత్తిలాంటి చూపుకోసం వెతుకుతాను. ఎదురైతే తెలియకుండానే కొత్త అనుభూతి మొదలవుతుంది’ ....అనామిక.
Comments
Please login to add a commentAdd a comment