ఒబామా ఫైనల్‌ మెసేజ్‌! | Here's what Obamas said in final Christmas message | Sakshi
Sakshi News home page

ఒబామా ఫైనల్‌ మెసేజ్‌!

Published Sun, Dec 25 2016 10:06 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM

ఒబామా ఫైనల్‌ మెసేజ్‌!

ఒబామా ఫైనల్‌ మెసేజ్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షడు బరాక్‌ ఒబామా, ప్రథమ మహిళ మిచెల్లీ ఒమామా వైట్‌ హౌస్‌ నుంచి తమ చివరి క్రిస్మస్‌ సందేశం ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో భిన్న కోణాల్లో విడిపోయిన అమెరికా ప్రజలంతా సహోదర భావంతో మెలగాలని ఒబామా ఆకాంక్షించారు. క్రిస్మస్‌ వేడుకలను అమెరికా ప్రజలంతా ఉల్లాసంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

అమెరికా సైన్యం అందిస్తున్న సేవలకు గాను ఒబామా తన మెసేజ్‌లో ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. గత ఎనిమిదేళ్లుగా అమెరికా ప్రజలకు సేవ చేయడం అనేది.. మిచెల్లీ, తాను పొందిన గొప్ప గిఫ్ట్‌ అని ఒబామా పేర్కొన్నారు. ఈ కాలంలో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగ సమస్యలను అంతా కలిసి ఎదుర్కొన్నామని ఓబామా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement