వారి పాటలు వింటే.. బీపీ కి టాటా చెప్పొచ్చు!
Published Wed, Jun 22 2016 6:21 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM
లండన్: సంగీత దిగ్గజం మోజార్త్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ను వినడం వల్ల కేవలం మూడ్ మారడమే కాదు.. రక్త పోటును కూడా తగ్గించుకోవచ్చని ఓ పరిశోధనలో తేలింది. క్లాసికల్ మ్యూజిక్ మ్యాస్ట్రోలు వోల్ఫ్ గాంగ్ మోజార్త్, జాన్నన్ స్ట్రాస్ ల పాటలు విన్న వారి రక్త పోటు తగ్గడమే కాకుండా గుండె కొట్టకునే వేగం కూడా తగ్గుతోందని పరిశోధకులు చెప్పారు. దాదాపు 25 నిమిషాల పాటు వీరి ఆల్బమ్ విన్న 60 మందిలో ఇటువంటి మార్పులను గమనించినట్లు వివరించారు. మోజార్త్ కంపోజ్ చేసిన మ్యూజిక్ విన్నవారిలో 4.7ఎమ్ఎమ్ హెచ్ జీ, స్ట్రాస్ కంపోజ్ చేసిన 3.7 ఎమ్ఎమ్ హెచ్ జీ రక్త పోటు తగ్గినట్లు గుర్తించామన్నారు.
అయితే, అబ్బా ఆల్బమ్ ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపారు. మోజర్త్, స్ట్రాస్ లు కంపోజ్ చేసిన సంగీతానికి రక్తపోటును నిరోధించగలిగిన శక్తి ఉందని అన్నారు. మోజర్త్ మ్యూజిక్ లో ఆ శక్తి ఎక్కువగా ఉందని తేల్చి చెప్పారు. ఇద్దరి సంగీతాన్ని విన్న పురుషుల్లో మహిళల కంటే కార్టిసోల్ లెవల్స్ పడిపోయినట్లు ఉన్నట్లు వివరించారు.
Advertisement
Advertisement