
ఆంగ్‌సాన్ సూకీ - నరేంద్ర మోదీ
నేపితా: మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకర్త, ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి పొందిన ఆంగ్‌సాన్ సూకీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఇక్కడ తొలిసారి సమావేశమయ్యారు. భారత్-ఆసియాన్ దేశాల సదస్సులో పాల్గొనే సందర్భంగా మోదీ ఆమెతో సమావేశమయ్యారు. భారత్ తనకు రెండో పుట్టిల్లు అంటూ ఈ భేటీలో మోదీకి సూకీ చెప్పినట్లు భారత విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ 'ట్వీట్' చేశారు.
భారత్‌లో మయన్మార్ రాయబారిగా పనిచేసిన తన తల్లి దాఖిన్ యీ తో కలసి సూకీ తన చిన్నతనంలో భారత్‌లో నివసించడం తెలిసిందే. ఆమె ఢిల్లీ, సిమ్లాలలో చదువుకున్నారు.
**