‘భారత మార్స్‌యాత్ర’ పుస్తకంలో వెల్లడి
న్యూఢిల్లీ: చైనా 2011, నవంబర్‌లో అంగారక యాత్రను చేపట్టి వైఫల్యాన్ని చవిచూసిన తర్వాతే భారత మార్స్ యాత్ర ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందట. తర్వాత దానికి కేబినెట్ ఆమోదం లభించినా, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో స్వయంగా వెల్లడించేందుకని ఆ విషయం గోప్యంగా ఉంచారట. మార్స్ మిషన్‌కు బదులుగా బుధగ్రహానికి ఉపగ్రహాన్ని పంపాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ చీఫ్ యూఆర్ రావు ప్రతిపాదించారట.
‘రీచింగ్ ఫర్ ది స్టార్స్: ఇండియాస్ జర్నీ టు మార్స్ అండ్ బియాండ్’ పేరుతో ప్రముఖ పాత్రికేయ రచయితలు, భార్యాభర్తలు పల్లవ బాగ్లా, సుభద్ర మీనన్‌లు రాసిన కొత్త పుస్తకంలోని విశేషాలివి. మంగళ్‌యాన్ ఉపగ్రహాన్ని తొలి ప్రయత్నంలోనే మార్స్‌కు పంపి భారత్ ప్రపంచ మన్ననలు అందుకున్న నేపథ్యంలో ఆ మిషన్ పూర్వాపరాలను సన్నిహితంగా గమనించిన బాగ్లా ఈ మేరకు పుస్తకం రచించారు. అలాగే, చంద్రయాన్-1, తొలినాళ్లలో రాకెట్ ప్రయోగాలను మొదలుకొని.. ఇస్రో భవిష్యత్తు ప్రాజెక్టు విశేషాలనూ పుస్తకంలో ప్రస్తావించారు.
చైనా విఫలమయ్యాకే.. మన మార్స్ యాత్ర!
Published Mon, Nov 17 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement
Advertisement