Mars expedition
-
రెండేళ్లలో అంగారక గ్రహంపైకి స్టార్‌షిప్ మిషన్..?
రాబోయే రెండేళ్లలో ఐదు స్టార్‌షిప్ మిషన్లను అంగారక గ్రహానికి పంపించాలని యోచిస్తున్నట్లు స్పేస్ఎక్స్ సీఈఓ ఇలొన్‌మస్క్ తెలిపారు. ఈమేరకు ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు. ఈ మిషన్ ద్వారా మనుషులను కూడా అంగారక గ్రహంపైకి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.ఏటా సెప్టెంబర్ నెలలో భూమి, అంగారక గ్రహాల మధ్య దూరం తగ్గుతుంది. ఆ సమయంలో వచ్చే రెండేళ్ల కాలంలో సంస్థకు చెందిన దాదాపు ఐదు స్టార్‌షిప్ మిషన్లను ప్రయోగిస్తామని మస్క్ తెలిపారు. ముందుగా అన్‌క్రూడ్ మిషన్(మానవ రహిత)లను పంపిస్తామని చెప్పారు. అవి సురక్షితంగా అంగారక గ్రహంపై దిగితే మరో రెండేళ్లలో మానవులను అక్కడకు పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఒకవేళ అనుకున్న విధంగా అంతరిక్షనౌక గ్రహంపై దిగకపోతే ఈ ప్రయోగం మరో రెండేళ్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏటా రూ.మూడు లక్షల కోట్లు అవసరంస్టార్షిప్ మిషన్‌తో ప్రజలను, సరుకులను చంద్రుడిపైకి, అంగారక గ్రహంపైకి తీసుకెళ్లగల అంతరిక్ష నౌకను రూపొందించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే పదేళ్లలో దీన్ని సాధించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇందుకోసం స్పేస్ఎక్స్ నాసాతో కలిసి పని చేస్తోంది. చంద్రునిపైకి వ్యోమగాములను పంపడానికి స్టార్షిప్ని ఉపయోగించాలని భావించిన నాసా ‘ఆర్టెమిస్ 3 మిషన్’ కోసం 2025 లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇది సెప్టెంబర్ 2026కి వాయిదా పడింది. -
అంగారక గ్రహం నుంచి వచ్చిన పోస్ట్కార్డ్ను చూశారా..!
NASA Curiosity Rover Sends A Rare Postcard From Mars To Mark 10th Anniversary: భూగ్రహమే కాకుండా మానవులకు నివాసయోగ్యంగా ఉండే ఇతర గ్రహాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధనలను చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భూమికి అత్యంత సమీపంలోని అంగారక గ్రహం మానవులకు నివాసయోగ్యంగా ఉండవచ్చుననే భావనతో నాసా ఇప్పటికే మార్క్‌పైకి క్యూరియాసిటీ, పర్సివరెన్స్ రోవర్లను ప్రయోగించింది. తాజాగా క్యూరియాసిటీ రోవర్‌ను లాంచ్ చేసి నవంబర్ 26తో పది వసంతాలు ముగిశాయి. 2011 నవంబర్ 26న క్యూరియాసిటీ రోవర్‌ను నాసా లాంచ్ చేసింది. మార్స్‌పైకి పది సంవత్సరాల క్రితం ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ ఇంకా పనిచేస్తోండడం గమనార్హం. అద్భుతమైన పోస్ట్‌కార్డ్..! క్యూరియాసిటీ రోవర్ పది వసంతాలను పూర్తి చేసుకోవడంతో మార్స్ నుంచి భూమికి అద్భుతమైన ఫోటోలను పంపింది. మార్టిన్ ల్యాండ్‌స్కేప్‌లో క్యూరియాసిటీ రోవర్ బంధించిన ఆసక్తికరమైన రెండు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను నాసా తన సోషల్‌మీడియా ఖాతాలో క్యూరియాసిటీ పంపిన పోస్ట్కార్డుగా వర్ణిస్తూ షేర్ చేసింది. ఫోటో కర్టసీ: నాసా క్యూరియాసిటీ పంపిన ఫోటోలను నాసా శాస్త్రవేత్తలు కాస్త ఎడిట్ చేస్తూ..‘విష్ యూ వర్ హియర్’ అనే ట్యాగ్ లైన్‌తో సోషల్ మీడియా నాసా పోస్ట్చేసింది. క్యూరియాసిటీ రోవర్ 360 డిగ్రీల కెమెరా సహయంతో ఈ ఫోటోలను తీసింది. క్యూరియాసిటీ రోవర్ నిర్వహణ బాధ్యతలను నాసా జెట్ ప్రొపెల్షన్ లాబోరేటరీ చూసుకుంటుంది. ఇప్పటివరకు మార్స్‌పై క్యూరియాసిటీ కనిపెట్టిన వాటిలో ముఖ్యమైనవి..! ⇒మార్టిన్ రేడియేషన్ వాతావరణాన్ని అంచనా వేసింది. ⇒అంగారక గ్రహాన్ని చేరిన ఏడు సంవత్సరాల తరువాత క్యూరియాసిటీ రోవర్ మార్స్‌పై ఉన్నపురాతన ప్రవాహాన్ని కనుగొంది. దీంతో మార్స్‌పై నీరు ఒకప్పుడు ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ⇒మార్స్ నేలపై జరిపిన డ్రిల్లింగ్ సహాయంతో సల్ఫర్, నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ , కార్బన్‌తో జీవానికి సంబంధించిన కొన్ని కీలక రసాయన పదార్థాలను క్యూరియాసిటీ గుర్తించింది. ⇒పురాతన గేల్ క్రేటర్‌లో మిలియన్ల సంవత్సరాలుగా సరస్సులు ఉన్నాయని క్యూరియాసిటీ గుర్తించింది. View this post on Instagram A post shared by NASA (@nasa) చదవండి: ఈ ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో ఏదంటే..! -
అంగారక యాత్రకు సునీతా విలియమ్స్!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2030లలో చేపట్టనున్న మానవసహిత అంగారక యాత్రకు భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ వెళ్లనున్నారు. పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకెళ్లి, తిరిగి భూమికి తీసుకువచ్చేందుకు సునీతతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు.. రాబర్ట్ బెన్కెన్, ఎరిక్ బో, డగ్లస్ హర్లీలను నాసా ఎంపిక చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి, అక్కడి నుంచి అంగారకుడి వద్దకు పర్యాటకులను తీసుకెళ్లే ‘కమర్షియల్ క్రూ వెహికల్స్’ను నడిపేందుకు ఈ నలుగురూ శిక్షణ పొందనున్నారు. ఈ రోదసి యాత్రల కోసం బోయింగ్, స్పేస్ఎక్స్ కంపెనీలతో కలసి సునీత బృందం పనిచేయనుంది. ఈ బృహత్తర యత్నంతో ఈ నలుగురూ చరిత్రలో నిలుస్తారని, అమెరికన్లు మార్స్ మీద కాలు మోపుతారని నాసా పేర్కొంది. సునీత(49)ను వ్యోమగామిగా నాసా 1998లో ఎంపిక చేసింది. రెండుసార్లు అంతరిక్ష యాత్రలకు వెళ్లి 322 రోజులు రోదసిలో ఉన్నారు. 50.40 గంటల పాటు రోదసిలో నడిచి అత్యధిక సమయం స్పేస్‌వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. -
చైనా విఫలమయ్యాకే.. మన మార్స్ యాత్ర!
‘భారత మార్స్యాత్ర’ పుస్తకంలో వెల్లడి న్యూఢిల్లీ: చైనా 2011, నవంబర్‌లో అంగారక యాత్రను చేపట్టి వైఫల్యాన్ని చవిచూసిన తర్వాతే భారత మార్స్ యాత్ర ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందట. తర్వాత దానికి కేబినెట్ ఆమోదం లభించినా, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో స్వయంగా వెల్లడించేందుకని ఆ విషయం గోప్యంగా ఉంచారట. మార్స్ మిషన్‌కు బదులుగా బుధగ్రహానికి ఉపగ్రహాన్ని పంపాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ చీఫ్ యూఆర్ రావు ప్రతిపాదించారట. ‘రీచింగ్ ఫర్ ది స్టార్స్: ఇండియాస్ జర్నీ టు మార్స్ అండ్ బియాండ్’ పేరుతో ప్రముఖ పాత్రికేయ రచయితలు, భార్యాభర్తలు పల్లవ బాగ్లా, సుభద్ర మీనన్‌లు రాసిన కొత్త పుస్తకంలోని విశేషాలివి. మంగళ్యాన్ ఉపగ్రహాన్ని తొలి ప్రయత్నంలోనే మార్స్‌కు పంపి భారత్ ప్రపంచ మన్ననలు అందుకున్న నేపథ్యంలో ఆ మిషన్ పూర్వాపరాలను సన్నిహితంగా గమనించిన బాగ్లా ఈ మేరకు పుస్తకం రచించారు. అలాగే, చంద్రయాన్-1, తొలినాళ్లలో రాకెట్ ప్రయోగాలను మొదలుకొని.. ఇస్రో భవిష్యత్తు ప్రాజెక్టు విశేషాలనూ పుస్తకంలో ప్రస్తావించారు.