రాబోయే రెండేళ్లలో ఐదు స్టార్‌షిప్ మిషన్‌లను అంగారక గ్రహానికి పంపించాలని యోచిస్తున్నట్లు స్పేస్‌ఎక్స్ సీఈఓ ఇలొన్‌మస్క్ తెలిపారు. ఈమేరకు ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. ఈ మిషన్ ద్వారా మనుషులను కూడా అంగారక గ్రహంపైకి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఏటా సెప్టెంబర్ నెలలో భూమి, అంగారక గ్రహాల మధ్య దూరం తగ్గుతుంది. ఆ సమయంలో వచ్చే రెండేళ్ల కాలంలో సంస్థకు చెందిన దాదాపు ఐదు స్టార్‌షిప్ మిషన్‌లను ప్రయోగిస్తామని మస్క్ తెలిపారు. ముందుగా అన్‌క్రూడ్ మిషన్(మానవ రహిత)లను పంపిస్తామని చెప్పారు. అవి సురక్షితంగా అంగారక గ్రహంపై దిగితే మరో రెండేళ్లలో మానవులను అక్కడకు పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఒకవేళ అనుకున్న విధంగా అంతరిక్షనౌక గ్రహంపై దిగకపోతే ఈ ప్రయోగం మరో రెండేళ్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఏటా రూ.మూడు లక్షల కోట్లు అవసరం
స్టార్‌షిప్ మిషన్‌తో ప్రజలను, సరుకులను చంద్రుడిపైకి, అంగారక గ్రహంపైకి తీసుకెళ్లగల అంతరిక్ష నౌకను రూపొందించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే పదేళ్లలో దీన్ని సాధించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇందుకోసం స్పేస్‌ఎక్స్ నాసాతో కలిసి పని చేస్తోంది. చంద్రునిపైకి వ్యోమగాములను పంపడానికి స్టార్‌షిప్‌ని ఉపయోగించాలని భావించిన నాసా ‘ఆర్టెమిస్ 3 మిషన్’ కోసం 2025 లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇది సెప్టెంబర్ 2026కి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment