
మిస్ న్యూజెర్సీగా భారతీయ యువతి
వాషింగ్టన్: మరో భారత సంతతి అందం అమెరికాలో మెరిసింది. ఇటీవల ‘మిస్ అమెరికా’ కిరీటాన్ని కైవసం చేసుకొని తొలి భారత సంతతి యువతిగా నీనా దావులూరి రికార్డు సృష్టిం చగా, తాజాగా ఎమిలీ షా అనే 18 ఏళ్ల యువతి ‘మిస్ న్యూజెర్సీయూఎస్‌ఏ-2014’ టైటిల్‌ను సాధించింది. తాజా గా పర్సిప్పనిలో ఘనం గా నిర్వహించిన పోటీలో 130 మంది యువతులు పోటీపడగా అత్యంత చిన్నవయుస్కురాలైన ఎమిలీ ఈ కిరీటాన్ని సొంతం చేసుకొంది. దీంతో ఆమె ‘మిస్ అమెరికా-2014’ టైటిల్ వేటకు అర్హత సాధించింది.
ఇందులోనూ విజయం సాధిస్తే మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనవచ్చు. భారత సంతతి ప్రజలు అధికంగా ఉం డే ఎడిసన్ ప్రాంతంలో ఆమె నివాసం ఉంటోంది. ఎమిలీ ఇప్పటికే పలు హాలీ వుడ్, బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ‘ది గ్రేట్ న్యూ వండర్‌ఫుల్’ అనే హాలీవుడ్ చిత్రంలో నసీరుద్దీన్ షాతో, ‘అవుట్ ఆఫ్ కంట్రోల్’ అనే బాలీవుడ్ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్‌తో నటించింది. ఇంకా ‘త ర రమ్ పమ్’, ‘జానేమన్’ లాంటి సినిమాల్లోనూ నటించింది. ఆమె తండ్రి ప్రశాంత్ షా... కరణ్ జోహార్, రాకేష్ రోషన్, షారుఖ్ ఖాన్‌లు నిర్మించిన పలు సినిమాలకు పనిచేశారు.