‘సంపాదనలో వీరికి సరిలేరు’ | Indian American Women Earn More Than White Men | Sakshi
Sakshi News home page

‘సంపాదనలో వీరికి సరిలేరు’

Published Fri, Jan 8 2016 5:38 PM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

‘సంపాదనలో వీరికి సరిలేరు’

‘సంపాదనలో వీరికి సరిలేరు’

వాషింగ్టన్: అమెరికాలో గత ఏడాది శ్వేతజాతి పురుషుల సగటు సంపాదన కంటే భారతీయ అమెరికన్ మహిళల సంపాదన ఎక్కువని యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తన నివేదికలో తెలిపింది. కానీ, ఆసియన్ అమెరికన్ పురుషులు సంపాదించే ప్రతీ డాలర్‌తో పోల్చితే ఆసియన్ అమెరికన్ మహిళలు 78 సెంట్లను మాత్రమే సంపాదిస్తున్నారని నివేదిక పేర్కొంది.

ఆఫ్రికన్ అమెరికన్ నల్లజాతి పురుషుల సంపాదనతో పోలిస్తే ఆఫ్రికన్ అమెరికన్ నల్లజాతి మహిళలు 90 సెంట్లు సంపాదిస్తున్నారు. లాటిన్ అమెరికన్ శ్వేతజాతి కంటే ఏషియన్ అమెరికన్లలో 25 శాతం ఎక్కువ మంది డిగ్రీ, అంత కంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement