Indian American Women
-
అగ్రరాజ్యపు కీలక పదవిలో వీణారెడ్డి
అగ్రరాజ్యంలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి కీలక పదవి దక్కింది. ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ మిషన్ డైరెక్టర్‌గా వీణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని సంస్థ ట్విటర్ పేజీ ద్వారా అధికారికంగా ప్రకటించింది. కాగా, యూఎస్ఏఐడీ(USAID) మిషన్ డైరెక్టర్‌గా ఎంపికైన తొలి ఇండియన్-అమెరికన్ వ్యక్తి వీణా రెడ్డి కావడం విశేషం. ఈ నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సందూ, వీణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఇంతకాలం ఆమె ఇదే ఏజెన్సీలో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా పని చేశారు. కంబోడియా మిషన్ డైరెక్టర్‌గా 2017 ఆగష్టు నుంచి ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. హైతి భూకంప సమయంలో రక్షణ-అభివృద్ధి చర్యల పర్యవేక్షకురాలిగా ఆమె తన సత్తా చాటారు. Best wishes, Veena @usaid_india . #India - @USAID partnership has the potential to make a difference to the lives of people not only in 🇮🇳 & 🇺🇸, but across the 🌏! https://t.co/t3KAIeblLo — Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) July 26, 2021 ఈ పదవుల కంటే ముందు వాషింగ్టన్లో అసిస్టెంట్ జనరల్ కౌన్సెల్‌గా ఆసియా దేశాల సమస్యలపై ప్రభుత్వ న్యాయసలహాదారుగా ఆమె పని చేశారు. ఇక ప్రభుత్వ సర్వీసుల కంటే ముందు న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, లండన్‌లో కార్పొరేట్ కంపెనీలకు అటార్నీగా వ్యవహరించిన అనుభవం ఆమెకు ఉంది. చికాగో నుంచి బీఏ, ఎంఏ, లా కోర్సులు పాసైన వీణారెడ్డి.. కొలంబియా యూనివర్సిటీ నుంచి ‘జురిస్ డాక్టరేట్’(జేడీ) అందుకుంది. న్యూయార్క్, కాలిఫోర్నియా బార్ అసోషియేషన్‌లో వీణకు సభ్యత్వం ఉంది. -
టాయిలెట్ గోడలపై హిందూ దేవుళ్లు!
న్యూయార్క్ : ఓ పబ్ టాయిలెట్ గోడలపై హిందూ దేవుళ్లను చూసి ఖంగుతిన్న ఓ భారత సంతతికి చెందిన అమెరికా మహిళా... ఆ పబ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి మెయిల్ ద్వారా భారత సంస్కృతి, హిందూ దేవుళ్ల సంప్రదాయం గురించి తెలియజేసింది. ఆమె మెయిల్‌కు స్పందించిన సదరు పబ్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పడంతో పాటు టాయిలెట్ గోడలపై ఆ చిత్రాలను తొలిగిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో వివరించింది. వివరాల్లోకి వెళ్తే.. అంకితా మిశ్రా అనే భారత సంతతి మహిళా.. కొద్ది రోజుల క్రితం స్నేహితులతో కలిసి న్యూయార్క్, బష్విక్లోని హాస్ ఆఫ్ ఎస్ పబ్‌కు వెళ్లింది. అక్కడ చిందేస్తూ ఆస్వాదించింది. ఇంతలో టాయిలెట్‌కు వెళ్లిన ఆమె షాక్‌కు గురైంది. టాయిలెట్‌లోని గోడలపై హిందూ దేవుళ్లు.. వినాయక, సరస్వతి, కాళీ, శివుడి చిత్రాలున్నాయి. దీంతో ఇది దేవాలయమా లేక టాయిలెటా? అని ఆశ్చర్యపోయింది. వెంటనే అక్కడ ఉండలేక బయటకు వచ్చి.. సదరు పబ్‌కు మెయిల్ పెట్టింది. ఆ చిత్రాలన్ని హిందూ దేవుళ్లని, భారత్‌లో ఆరాధ్యదైవంగా భావిస్తారని వివరించింది. దీనికి స్పందించిన సదరు పబ్ నిర్వాహకులు.. ఈ విషయం తమకు తెలియదని, ఇతర ప్రాంతాల్లో ఈ చిత్రాలును చూసి.. అందంగా ఉన్నాయి కదా అని ఇక్కడ వేయించామని క్షమాపణలు తెలిపారు. ఆ చిత్రాలను తొలిగిస్తామని కూడా స్పష్టం చేశారు. ఇక ఇలా హిందూ దేవుళ్లను అవమానించడం ఇదే తొలిసారేం కాదు.. గతంలో చెప్పులపై.. టాయిలెట్ సీట్స్‌పై కూడా వేసిన ఘటనలున్నాయి. -
డెమొక్రటిక్ పార్టీ కమిటీ సీఈవోగా సీమా
వాషింగ్టన్: అమెరికాలో డెమొక్రటిక్ పార్టీ పాలన విభాగమైన డెమొక్రటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ) సీఈవోగా భారతీయ అమెరికన్ సీమా నంద నియమితులయ్యారు. అమెరికాలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ వ్యవహారాల నిర్వహణలో భారత సంతతికి చెందిన వ్యక్తి కీలక పాత్ర పోషించడం ఇదే తొలిసారి. వచ్చే నెల్లో బాధ్యతలు చేపట్టనున్న ఆమె డీఎన్సీ రోజువారీ కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తారు. ప్రస్తుత డీఎన్సీ చైర్మన్ టామ్ పెరెజ్ అమెరికా కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కార్యాలయంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సీమా∙పనిచేశారు. ‘జీవితకాలంలో ఒక్కసారే ఇలాంటి పదవి దక్కుతుంది’ అని ఆమె చెప్పారు. -
‘సంపాదనలో వీరికి సరిలేరు’
వాషింగ్టన్: అమెరికాలో గత ఏడాది శ్వేతజాతి పురుషుల సగటు సంపాదన కంటే భారతీయ అమెరికన్ మహిళల సంపాదన ఎక్కువని యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తన నివేదికలో తెలిపింది. కానీ, ఆసియన్ అమెరికన్ పురుషులు సంపాదించే ప్రతీ డాలర్‌తో పోల్చితే ఆసియన్ అమెరికన్ మహిళలు 78 సెంట్లను మాత్రమే సంపాదిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఆఫ్రికన్ అమెరికన్ నల్లజాతి పురుషుల సంపాదనతో పోలిస్తే ఆఫ్రికన్ అమెరికన్ నల్లజాతి మహిళలు 90 సెంట్లు సంపాదిస్తున్నారు. లాటిన్ అమెరికన్ శ్వేతజాతి కంటే ఏషియన్ అమెరికన్లలో 25 శాతం ఎక్కువ మంది డిగ్రీ, అంత కంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు.